జాతీయ వార్తలు

ఢిల్లీలో దాడికి నక్సల్స్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, అక్టోబర్ 16: దేశ రాజధాని ఢిల్లీలో భారీ దాడి జరపడానికి నక్సలైట్లు పన్నిన కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. దాడికి పాల్పడాలని ప్రణాళిక రచించుకున్న నక్సలైట్లలో పది మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక ఏరియా కమాండర్ కూడా ఉన్నాడు. వారినుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబుల తయారీలో నిపుణులయిన ఈ వామపక్ష తీవ్రవాదులు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో హింసాత్మక సంఘటనలకు పాల్పడాలని ప్రణాళిక రూపొందించుకున్నారని ఉత్తరప్రదేశ్ ఐజి (స్పెషల్ టాస్క్ ఫోర్స్) అసీం అరుణ్ ఆదివారం ఇక్కడ హడావుడిగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఢిల్లీ శివార్లలోని నోయిడాలో నిర్వహించిన దాడుల్లో తొమ్మిది మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వీరిలో ఆరుగురిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురిని ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మరొకరిని బిహార్ సరిహద్దులో ఉన్న చందౌలిలో అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. జార్ఖండ్‌లోని లతెహార్ జిల్లా బరియతు గ్రామానికి చెందిన ఏరియా కమాండర్ ప్రదీప్ సింగ్ ఖర్వార్ 2012 ఫిబ్రవరి నుంచి నోయిడాలో దాక్కున్నాడని ఐజి వెల్లడించారు. బిహార్‌లోని సాసరాం జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రంజిత్ పాశ్వాన్‌ను చందౌలిలో అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ప్రదీప్ సింగ్, రంజిత్ తలపై నగదు రివార్డు ఉందని తెలిపారు.