జాతీయ వార్తలు

నాగపూర్-సికింద్రాబాద్ రైల్వే కారిడార్‌పై రష్యాతో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: నాగపూర్-సికింద్రాబాద్ రైల్వే కారిడార్ వేగం పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు భారత రైల్వే రష్యా రైల్వేతో ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. భారత రైల్వే సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సంధర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గోవాలో ఈనెల 15-16 తేదీల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సంధర్భంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరిందని భారత రైల్వే తమ ప్రకటనలో తెలిపింది.
నాగపూర్-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే లైనుపై రైళ్లను గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో నడిపించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణం చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ అధ్యయన ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చును భారత, రష్యా రైల్వేలు సమానంగా భరిస్తాయి. భారత రైల్వే బోర్డు సభ్యుడు నవీన్‌కుమార్ శుక్లా, రష్యన్ రైల్వే బోర్డు అధ్యక్షుడు ఓ.వి.బెలోజరేవ్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇదిలా ఉంటే 2015 డిసెంబర్‌లో రష్యాతో చేసుకున్న ఎం.ఓ.యు ప్రకారం భారత దేశంలో హై స్పీడ్ రైల్వేల ఏర్పాటు, ప్రస్తుత రైల్వే లైన్లను ఆధునీకీకరించటంతోపాటు ప్యాసింజర్ రైళ్లు 160 నుండి రెండు వందల కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు వీలుగా ఉన్న రైల్వే లైన్లను పటిష్టం చేయటం, ఉపగ్రహాలు, డిజిటల్ కమ్యూనికేషన్ల ఆధారంగా కంట్రోల్, భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయటం, ఉపగ్రహ, జియో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించటం, రోలింగ్ స్టాక్, హెవీ హౌల్ ట్రాన్స్‌పోర్టేషన్, మానవ వనరుల అభివృద్ది, రైల్వే స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్వే కారిడార్ల అభివృద్ది, ట్రాక్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, పునర్‌నిర్మాణం, ఆధునీకీకరించటం, సివిల్ ఇంజనీరింగ్ పనులు, బ్రిడ్జిలు, టనె్నళ్ల నిర్మాణం, స్లాబ్ ట్రాక్‌ల ఏర్పాటు ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.