జాతీయ వార్తలు

ఢిల్లీ అధికారుల మూకుమ్మడి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది బేసి-సరి పథకాన్ని దెబ్బతీసే కుట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిప్పులు ప్రధాని మోదీపైనా విసుర్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఢిల్లీలోని అధికార ఆప్ సర్కార్‌కు సరికొత్త సమస్య ఎదురైంది. ఇద్దరు అధికారులను ఆప్ ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు నిరసనగా దాదాపు సీనియర్ అధికారులు అందరూ మూకుమ్మడి సెలవుపెట్టారు. ఇద్దరు సస్పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అలాగే మరోసారి కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలోనే వివాదం రగులుకునే పరిస్థితి ఏర్పడింది. తాము ప్రతిష్టాత్మక రీతిలో బేసి-సరి పథకాన్ని అమలు చేస్తున్న తరుణంలో దాన్ని విఫలం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగిందని ఆప్ తీవ్రస్థాయిలోనే విరుచుకుపడింది. దాదాపు రెండొందల మంది సీనియర్ అధికారులు (డానిక్ కేడర్) గురువారం మూకుమ్మడి సెలవుపెట్టారు. అలాగే 70 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విధులకు హాజరుకాలేదు. యశ్‌పాల్ గార్గ్, సుభాష్ చంద్ర అనే ఇద్దరు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను ఆప్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందుకు వారికి సంఘీభావంగా అధికారుల ఈ చర్యలు దిగారు. సస్పెండైన ఇద్దరు అధికారులు ఢిల్లీ, అండమాన్, నికోబర్ దీవుల సివిల్ సర్వీస్‌కు చెందినవారే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయడానికి ఈ ఇద్దరు అధికారులు నిరాకరించడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం వారిపై చర్య తీసుకుంది. ఇదిలా ఉండగా మూకుమ్మడి సెలవుపెట్టిన అధికారులపై సిఎం కేజ్రీవాల్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. వీరిపై చర్య తీసుకునేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. అవినీతిని, అధికార ధిక్కారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అటు డానిక్స్ కేడర్ అలాగే ఐఏఎస్ అధికారుల సంఘాలు బిజెపి అనుబంధ బృందాలుగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే ప్రధాని మోదీపైనా ధ్వజమెత్తిన కేజ్రీవాల్ ‘లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇతర అధికారుల ద్వారా ఆప్ ప్రభుత్వంపై ‘ఫైరింగ్’కు పాల్పడుతున్నారు’ అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని మరింత ఆదర్శవంతంగా నడపడానికి బ్యూరోక్రాట్ల స్థానే నిపుణులను నియమించాల్సిన తరుణం ఆసన్నమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అధికారులందరూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతే ప్రజలు మరింత ఆనందిస్తారని, దీన్ని ఆర్థిక సెలవుగా పరిగణించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ అధికారులు లేకపోతేనే ప్రభుత్వం నిజాయితీగా, సమర్థవంతంగా సజావుగా నడుస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.