జాతీయ వార్తలు
విప్లవాత్మక చర్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 November 2016
అహ్మదాబాద్, నవంబర్ 18: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమనేత అన్నాహజారే స్పష్టం చేశారు. నల్లధనాన్ని అరికట్టడానికి గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని శుక్రవారం ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈలోగానే ప్రయత్నాలు ప్రారంభించాలని హజారే తెలిపారు.