జాతీయ వార్తలు

భారతీయ సినిమాలపై పాక్‌లో నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పాకిస్తాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పాకిస్తాన్ చలనచిత్ర ప్రదర్శకుల సంఘం నిర్ణయించింది. దీంతో పాకిస్తాన్‌లో సోమవారం నుంచి భారతీయ సినిమాల ప్రదర్శన తిరిగి ప్రారంభం అవుతుంది. యురీపై ఉగ్రవాద దాడి తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో భారతీయ సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించారు. పాకిస్తాన్‌లోని సినిమా యజమానులు డిసెంబర్ 19నుంచి భారతీయ సినిమాలను ప్రదర్శిస్తారని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ జోరైష్ లషారి ధ్రువీకరించారు. సోహైల్ ఖాన్ దర్శకత్వంలో నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, అర్బాజ్ ఖాన్, ఆమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫ్రీకి అలీ’ చిత్రాన్ని విడుదల చేయడం ద్వారా అసోసియేషన్ భారతీయ సినిమాల ప్రదర్శనపై నిషేధాన్ని ఎత్తివేస్తుంది.