తూర్పుగోదావరి

అందరి చూపు డిసెంబర్ 30 వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 25: 500,1000 నోట్ల రద్దు అనంతరం ఎదురైన కష్టాలు... ఎన్ని ఆర్ధిక సమస్యలొచ్చినా తట్టుకుని నేటికీ క్యూలోనే రేయింబవళ్ళు గడుపుతున్న సామాన్యుడు డిసెంబరు 30వ తేదీ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు... జిల్లాలో ఎక్కడ చూసినా ప్రథాని మోదీ కొత్త సంవత్సరంలో ఆసక్తికరమైన ఏదో ప్రకటన చేస్తారట? అని సామాన్యుడు ఆత్రంగా చూస్తున్నాడు... కేంద్రం తీసుకునే నిర్ణయం తమకు అనుకూలమా? లేక ఎప్పటిలాగే ప్రతికూలంగా ఉంటుందా? అనే భయాన్ని కూడా సగటు మనిషి వ్యక్తం చేస్తున్నాడు. పెద్దనోట్ల రద్దు అనంతరం పాత 500,1000 నోట్లు మార్కెట్‌లో చిత్తు కాగితాలుగా మిగిలిపోయాయి. బ్యాంకుల్లో మాత్రమే అది కూడా పరిమిత సంఖ్యలో పెద్దనోట్లను ఈనెల 30వ తేదీ వరకు మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా పాత పెద్దనోట్లు చెల్లుబాటు కావు! ముఖ్యంగా డిసెంబరు 30వ తేదీ తరువాత ప్రజలు సంతోషించే రీతిలో నిర్ణయాలుంటాయని ప్రథాని ఇదివరకే ప్రకటించారు. బడాబాబులు, పెద్దలకు ఆరోజు నుండి మరిన్ని సమస్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడైతే మాత్రం బడాబాబులు, సంపన్నులకు ఇబ్బందేముంది? సమస్యలన్నీ సామాన్యుడికే కదా? అని సగటు ప్రజలు చర్చించుకుంటున్నారు. గడువు తేదీ డిసెంబరు 30వ తేదీ తరువాత కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? నల్ల కుబేరులకు నిజంగానే ప్రతికూల నిర్ణయం తీసుకుంటే, అది తమకు లాభిస్తుందా? అన్న ఆత్రంతో కూడా సామాన్యులున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పేదల ఖాతాల్లోకి పెద్దల సొమ్ము జమ చేస్తారన్నది ఇందులో ఒకటి! అయితే అధికారిక వర్గాల కథనం మేరకు బినామీ లబ్దిదారులకు మాత్రం డిసెంబరు 30 అనంతరం మేలు జరుగుతుందని తెలుస్తోంది. ఇదే విషయమై ఓ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు చర్య మంచి ఫలితాలనివ్వనుందని చెప్పారు. 2017 ఏప్రిల్ నుండి వస్తు వినిమయ బిల్లు అమల్లోకి రానుందని, అప్పటి నుండి అన్ని లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతాయని తెలిపారు. బినామీల చట్టం అమల్లోకి వచ్చిందని, ఈ చట్టాన్ని 2017 జనవరి నుండి పటిష్టంగా అమలుచేయనున్నారని చెప్పారు. ఎవరైతే బినామీ ఆస్తులను కలిగివుంటారో ఆ ఆస్తులన్నీ కేంద్రానికే చెందుతాయని, ఇదే సమయంలో పేదల పేరున ఉన్న పెద్దల అక్రమాస్తులు పేదలకే చెందుతాయని పేర్కొన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు అనంతరం జరిగిన డిపాజిట్ల పూర్తి వివరాలను డిసెంబర్ 31వ తేదీ తరువాత కేంద్రం వెల్లడిస్తుందని కూడా ఆ అధికారి పేర్కొన్నారు. ఏదేమైనా ప్రథాని మోదీ చేసే ప్రకటనతోనైనా తమ చిల్లర కష్టాలకు తెర పడితే బాగుండునని పలువురు ఆరాటపడుతున్నారు.