జాతీయ వార్తలు

ఖతార్‌లో కేంద్రం క్షమాభిక్ష పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: కతార్‌లో మరణదండనకు గురైన ఇద్దరు తమిళులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారి తరపున ఖతార్ సుప్రీం కోర్టులో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఒక మహిళను హత్య చేసిన కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి మరణదండన విధించింది. ఈ సమాచారం ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం నుంచి సుష్మాస్వరాజ్ తెప్పించుకున్నారు. అలగప్ప సుబ్రమణియమ్, చెల్లాదురై పెరుమాళ్ అనే ఈ ఇద్దరు వ్యక్తులకు ఖతార్ న్యాయస్థానం శిక్ష విధించింది. ‘ఈ కేసుకు సంబంధించిన నివేదిక అందింది. వారి కుటుంబ సభ్యుల తరపున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి మన దౌత్యకార్యాలయం విజ్ఞప్తి కూడా చేసింది’ అని సుష్మా పేర్కొన్నారు. 40 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు నిందితులకు మరణదండన విధించగా మూడో నిందితులు శివకుమార్ అరసన్‌కు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిని కాపాడాలంటూ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వసంతకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి, సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. ‘వీరిని వెనక్కి పంపించకపోతే న్యూఢిల్లీ, ముంబయిలలోని ఖతార్ దౌత్య కార్యాలయాల ముందు నిరవధిక నిరసన దీక్ష చేస్తా’నని ఆయన హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి అప్పీల్ చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.9.5లక్షలను కూడా మంజూరు చేశారు.