ఉత్తరాయణం

ఎన్‌జిఒలపై వేటు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఇరవైవేల ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జిఒ)ల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడం సాహసోపేత నిర్ణయం. ఇలాంటి కఠిన నిర్ణయాలతో దేశ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న నరేంద్ర మోదీ వంటి సమర్ధవంతమైన ప్రధాని లభించడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం. మత మార్పిళ్లకు, ఉద్రిక్తతలు పెంచేందుకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేందుకు, జాతివ్యతిరేక కలాపాలకు పాల్పడేందుకు కొన్ని ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరుతున్నాయని నిఘావర్గాలు రెండేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హిందూ మతంపై విద్వేషాలను రగిల్చేందుకు కొన్ని ఎన్జీవోలను విదేశీ సంస్థలు వాడుకుంటున్నాయని ఇటీవల పట్టుబడిన కొందరు ఉగ్రవాదుల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎన్‌జిఒలను నిషేధించడం సముచితం. అయితే, సామాన్యుల పక్షాన పోరాడే సంస్థల పట్ల ప్రభుత్వం వేధింపులకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి

యుపిలో అంతా నాటకం
యుపిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, ముఖ్యమంత్రి అయిన ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరాటం నిజానికి నాటకంలా ఉంది. కొడుకును తండ్రి మందలించడం, పార్టీనుండి తరమడం, బంధువులను దగ్గర చేసుకోవడం, పార్టీ గుర్తయిన సైకిల్‌పై పంతాలకు పోవడం, విడిపోవడం, తరువాత సర్దుకుపోవడం, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే తన కుమారుడే మళ్లీ సిఎం పీఠాన్ని అధిష్టిస్తాడని ప్రకటన చేయడం.. ఇలా అడుగడుగునా నాటకీయతే కనిపిస్తోంది. యుపిలో ఈ రాజకీయ హైడ్రామాను గమనిస్తే రాంగోపాల్ వర్మ లాంటివారు ఓ సినిమా నిర్మించవచ్చు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

డిటెన్షన్ విధానం మేలు
ప్రభుత్వ బడుల్లో ‘డ్రాప్ అవుట్స్’ సంఖ్య భారీగా పెరిగిపోతోందన్న సాకుతో ‘డిటెన్షన్ విధానం’ వద్దనడం సరికాదు. గతంలో ఎప్పుడో చరిత్రాత్మకంగా టీచర్లు 55 రోజులు సమ్మె చేయడంతో కక్ష తీర్చుకోడానికి అప్పటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘నాన్ డిటెన్షన్’ విధానం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలు చూస్తూనే వున్నాం. పదోక్లాసు వరకు గేట్లు ఎత్తేయడంతో విద్యార్థులకు చదివే అలవాటు, మాస్టార్లకు పాఠాలు చెప్పే అలవాటుపోయింది. అటు తర్వాత ఇంటర్ చదివి ఏదో విధంగా బిటెక్, ఎంటెక్ డిగ్రీలు సంపాదించేవారి సంఖ్య పెరిగిపోయింది. ఫీజు రియంబెర్స్‌మెంటు పథకం వచ్చాక డబ్బు దండుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నైపుణ్యాలు లేకపోవడంతో పోలీసు, ప్యూన్ ఉద్యోగాలకు సైతం ఎగబడుతున్నారు ఈ పట్ట్భద్రులు. ఈ దారుణ పరిస్థితి మారాలంటే డిటెన్షన్ విధానం పునఃప్రారంభించాలి.
- గునే్నశ్, కొవ్వాడ

పండుగలను
విభజించవద్దు
తెలంగాణ సిఎం కె.సి.ఆర్ మరో కొత్త సత్యాన్ని సెలవిచ్చారు. సంక్రాంతి ‘ఆంధ్ర పండగ’ట! ‘బతుకమ్మ’, ‘దసరా’ తెలంగాణ పండగలట! సంక్రాంతి అనేది భారతీయ పండగ. సూర్యుడు నెలకోసారి చొప్పున 12 రాశులలో సంచరించే దశలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోజునుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మకర సంక్రమణంనే సంక్రాంతి అంటున్నాం. ఆ రోజున మన దేశమంతటా పుణ్యస్నానాలు, దానాలు, పితృకర్మలు ఆచరిస్తారు. తెలంగాణ వారు ‘ఉత్తరాయణే, పుష్యమాసం’ అని సంకల్పంలో చెప్పుకోరా? సంక్రాంతి పండగకు తెలంగాణ, ఆంధ్రా అని సరిహద్దులు లేవు. ధాన్యరాశులు ఇళ్లకు చేరేవేళ ఇది అన్ని ప్రాంతాలలోనూ రైతులకు సంతోషకరమైన పండగ. పొద్దున లేస్తే వైదిక కర్మలు, చండీయాగాలు చేసేవారు ఇలా మాట్లాడ్డం దురదృష్టకరం. అంతేగాక, ఎవరు చెప్పారో కానీ ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ని తెలంగాణ సారస్వత పరిషత్తుగా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ‘తెలుగు భాషా నిలయం’గా మార్చారు. సురవరం ప్రతాపరెడ్డి వ్రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథానికి రేపోమాపో ఏ విధంగా పేరుమారుస్తారో గదా. తెలుగు బిడ్డలు, సంస్కృతి ఒకటే అంటూ ఈ విధమైన ఆలోచన మంచిది కాదు. పరిపాలన రెండు రాష్ట్రాలుగా ఉండొచ్చు. ఇటువంటి విభేదాలు పనికిరావు.
- డి.కృష్ణమోహన్, గుంటూరు