అక్షర

చిట్టి చిట్టి మిరియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-పాలపర్తి ఇంద్రాణి
ప్రతులకు: పాలపర్తి సువర్ణలత,
502, ఎ.పి.హెచ్.బి. టవర్స్, జి.వి.ఆర్. మ్యూజిక్
కాలేజీ ఎదురుగా, దుర్గాపురం, విజయవాడ- 520 003 మరియు జ్యోతి వొలబోజు. ఫోన్- 8096310140.
**

ఇదొక అపూర్వమైన అనుభూతుల జ్ఞాపకాల పేటిక. పాటలో, చిట్టీపొట్టీ రైమ్స్ కావు. కథలు అసలే కావు. మరి? అమ్మతనాన్ని వొంటినిండా గుండెనిండా నింపుకున్న తల్లి, అమ్మ వొడిలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఆమె సన్నిధిలో సంతోష సాగరంలో తేలిపోయే కూతురు చిట్టి తల్లి. వీరిమధ్యన మామూలుగా రోజువారీగా జరిగే కార్యక్రమాలలో వారి సంభాషణ. చిన్నారి సందేహాలు, తల్లి చెప్పే సమాధానాలు. తల్లిగా ప్రతీ స్ర్తి ఆ మాతృత్వాన్ని అనుభవించే అమృత ఘడియలవి. కొన్నికొన్ని పిల్లలడిగే ప్రశ్నలకి పెద్దవాళ్లు సమాధానం చెప్పలేని పరిస్థితి సంభవిస్తుంది. ఇక్కడా అంతే! బజారునుంచి కూరగాయలు తెచ్చి, ఫ్రిజ్‌లో పెడుతూ, ‘ఈ కాయ పేరేంటీ’ అని అడిగే తల్లికి పాప తన సమాధానం చెబుతుంది. వంకాయ, బెండకాయ అంటూ. ‘మరి ఇదేంటీ?’ అడుగుతుంది పాప. ‘బేబీకార్న్ ఒంటికి మంచిది’ చెప్తుంది తల్లి. మరి మమీ కాన్, డాడీ కాన్ తేవేంటి’’ అడుగుతుంది పాప. తల్లికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు. ఆ పసితనంలోని అమాయకపు ప్రశ్నలూ, అందుకు ముగ్ధురాలైన తల్లి అనుభవించే ఆనందం- అదే ఈ ‘‘చిట్టి చిట్టి మిరియాలు’’ గ్రంథం.

-శారదా అశోకవర్ధన్