సంజీవని

మానసిక ఒత్తిడితో.. ఐబిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మానవుడు వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇలాంటి ఒత్తిడివలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ఐబిఎస్ (ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్). నేడు ఐబిఎస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగా పెరిగిపోతోంది. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం తోడుకావడంతో ఐబిఎస్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది.
కారణాలు
తీవ్ర మానసిక ఒత్తిడి, హార్మోనుల సమతుల్యత లోపించటం. సమయపాలన లేని ఆహారం, నిద్ర.
లక్షణాలు
- తేన్పులు ఎక్కువగా ఉండటం
- గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం
- కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
- మల విసర్జన సరిగా పూర్తికాదు. నీళ్ళ విరోచనాలు, జిగట విరేచనాలు.
- తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవటం, వాంతులు కావటం
- జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
జాగ్రత్తలు
- ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.
- నిలువ ఉంచిన పచ్చళ్ళు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.
- నీరు సరిపడినంతగా తాగాలి.
- మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.
- టీ, కాఫీలు, స్మోకింగ్, ఆల్కహాలు సేవించటం మానివేయాలి.
చికిత్స
హోమియో వైద్యంలో ఐబిఎస్‌తో బాధపడేవారికి మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడంవల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.
మందులు
నక్స్‌వామికా: మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
అర్జెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.
ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరువాత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండు గంటల తరువాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి, దుర్భాషలాడే స్వభావంతో వుంటారు. ఇటువంటివారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఆర్సినికం ఆల్బం: ఈ మందు జీర్ణాశయ వ్యాధులకు తప్పక ఆలోచించదగినది. కడుపులో గడబిడలతో తేన్పులు రావడంతోపాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, తరచుగా దాహం, ఒళ్ళు నొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఫాస్ఫరస్: పొట్టలో అల్సర్ ఉండి వీరికి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు ఐస్‌క్రీమ్‌లు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్థులు. ఉరుములు, మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్ ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్, కార్బొవెజ్, చైనా, లైకపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే ఐబిఎస్ నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646