హైదరాబాద్

జూన్‌లో మెట్రో కూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తరుచూ ట్రాఫిక్ కష్టాలలో బేజారవుతున్న జంటనగరవాసుల కష్టాలు దూరమయ్యే సమయం వచ్చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైలు కార్పొరేట్ ఆఫీసులో గురువారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించటంతో పాటు తక్కువ ఛార్జీ, సమయాలతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేసిన మెట్రోరైలు అందుబాటులోకి వస్తే కొంత వరకైనా కష్టాలు తగ్గుతాయని జంటనగరవాసులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో పనులు జరుగుతున్నా, కారిడార్ 1 మియాపూర్-ఎల్బీనగర్, కారిడార్ 3 నాగోల్-శిల్పారామం రెండు కారిడార్లలో కలిపి వచ్చే జూన్ మాసంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున 29 కిలోమీటర్ల మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తేనున్నట్లు మెట్రోరైలు ఎండి వెల్లడించారు. కారిడార్ 1లోని మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు పదకొండు కిలోమీటర్లు, నాగోల్ నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్ల పొడువున మెట్రో ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. సమరయోథుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని ఎన్వీఎస్‌రెడ్డి గుర్తుచేశారు.

పెళ్లి పేరుతో రూ.50లక్షలు స్వాహా
* ఇద్దరు నైజీరియన్‌ల అరెస్టు

హైదరాబాద్, జనవరి 26: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ సిఐడి పోలీసులు హైదరాబాద్‌లో గురువారం అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన టోలిచౌకిలో నివాసం ఉంటున్న మోసిన్‌అగా(29), మహ్మద్ హుస్సేన్ బారువా(31)లను అరెస్టు చేయగా, మరో మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి పేరుతో ఆస్ట్రేలియా వాసిని నిందితులు ఆన్‌లైన్‌లో మోసం చేశారు. అతని వద్ద నుంచి రూ.50లక్షలకుపైగా స్వాహా చేశారు. ఆస్ట్రేలియా వాసి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు నిందితులను అరెస్టు చేసి, వారి బ్యాంకు ఖాతాలోని రూ.20లక్షలు స్తంభింపజేశారు.