జాతీయ వార్తలు

రూ. 3 లక్షలు దాటే నగదు లావాదేవీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నల్లధనాన్ని అరికట్టే విధంగా జైట్లీ మరో అడుగు ముందుకు వేశారు. 3 లక్షలకు పైన జరిగే నగదు లావాదేవీలను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నల్లధన నిర్మూలనపై చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి 3 లక్షలు దాటే నగదు లావాదేవీలు అనుమతించబడవని తేల్చిచెప్పారు. అనేక దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను, కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని సిట్ ఈ సిఫార్సు చేసింది. అంతేకాదు 3 లక్షలు దాటిన నగదు లావాదేవీలను చట్టవ్యతిరేకంగా ప్రకటించడంతోపాటు శిక్షార్హంగా కూడా మార్చాలని సిట్ తెలిపింది.