జాతీయ వార్తలు

ఎన్నికలకు ముందు ఎస్పీకి మరో షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 5: మరో అయిదు రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్న తరుణంలో అధికార సమాజ్‌వాది పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సమాజ్‌వాది పార్టీ లీగల్ సెల్ జాతీయ అధ్యక్షుడి పదవిసహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన తన రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు పంపించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. తన రాజీనామాకు కారణాలను భాటియా తెలియజేయనప్పటికీ పార్టీ తన సిద్ధాంతాలయిన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం విషయంలో రాజీపడ్డమే ఆయన రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.