శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 18: త్వరలో జరగనున్న పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతు ప్రకటించిన వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, వాసుదేవనాయుడుల గెలుపు కోసం జిల్లాలోని నేతలందరూ గట్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై టిడిపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన శనివారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్ని ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత వారిపై ఉందన్నారు. పురపాలక మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రెండున్నరేళ్లలో పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి, ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించిందన్నారు. ఇవన్నీ వివరించడం ద్వారా ఓట్లను అభ్యర్థించాలని నేతలక సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆత్మకూరు, నెల్లూరురూరల్, కావలి, సూళ్లూరుపేట, నెల్లూరుసిటి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌తలు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, పరసా రత్నం, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, టిడిపి నేతలు ఆనం వివేకానందరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, తాళ్లపాక అనూరాధ, ఆనం జయకుమార్‌రెడ్డి, పొణకా దేవసేన, దొంతు శారద తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కస్టడీలో ఉగ్రవాదులు
నెల్లూరు, ఫిబ్రవరి 18: ఇటీవల జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఆరుగురు ఉగ్రవాదులను కోర్టు ఆదేశాలతో శనివారం నగర పోలీసులు కస్టడీకి తీసుకుని రహస్య స్థలంలో విచారిస్తున్నారు. వారం రోజులపాటు ఈ విచారణ కొనసాగనుంది.