జాతీయ వార్తలు

అజర్ అరెస్టు వట్టిమాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయడం కానీ, గృహ నిర్బంధంలో ఉంచడం కానీ చేయలేదని ఈ దాడితో సంబంధం ఉన్న కేసులకు సంబంధించి అతని జూనియర్ అనుచరులు ముగ్గుర్ని మాత్రం అరెస్టు చేసారని అధికారులు చెప్పారు. పఠాన్ కోట్ దాడికి సంబంధించి అజర్‌పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని, భారత్‌లో అనేక దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ అధినేతపై స్పష్టంగా కంటికి కనిపించే చర్య ఏదీ తీసుకోలేదని ఇంటెలిజన్స్ వర్గాల నివేదికలను బట్టి తెలుస్తోందని ఆ అధికారులు చెప్పారు. జైషే మహమ్మద్‌కు చెందిన ముగ్గురు జూనియర్ కార్యకర్తలనైతే పాక్ భద్రతా ఏజన్సీలు అదుపులోకి తీసుకున్నాయి కానీ కొన్ని రహస్య డాక్యుమెంట్లు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అరెస్టు చేసారు తప్పించి ఈ నెల 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడితో దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఫఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిలో దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులే కాకుండా ఏడుగురు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందడం తెలిసిందే. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్లు మొదట్లో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని, పాకిస్తాన్ ఏజన్సీలు జరిపిన ప్రచారం మాత్రమేనని ఆ అధికారులు చెప్పారు. పఠాన్‌కోట్ దాడికి సంబందించి జైషే మహమ్మద్‌పై కాని, దాని కార్యకర్తలపై కానీ కేసు నమోదు చేసినట్లు పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు భారత్‌కు తెలియజేయలేదని కూడా వారు చెప్పారు. జైషే మహమ్మద్‌కు చెందిన పలువురు వ్యక్తులను అరెస్టు చేసామని పాక్ ప్రకటించినందున ఏ చట్టం కింద వారిని అరెస్టు చేసారో, దర్యాప్తు ప్రారంభించారో కూడా అది ప్రకటించాలని ఆ అధికారులు అన్నారు. పంజాబ్‌లో అత్యంత కీలకమైన ఎయిర్‌బేస్‌లోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులు ఉపయోగించిన కొన్ని మొబైల్ ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని మన దేశం పాక్‌కు అందజేసిందని, అయితే ఆ నంబర్ల యజమానులెవరనే విషయమై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదని వారు చెప్పారు.