S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువక్రీడాకారులకు మహనీయులే స్ఫూర్తి

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 29: యువ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ లాంటి మహనీయ క్రీడా మాంత్రికులను స్ఫూర్తిగా తీసుకోవాలని శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కఠోర దీక్షతో శిక్షణ పొంది నచ్చిన క్రీడలో ముందుకెళ్లాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించే నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని, అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు.

చిన్న పరిశ్రమలకు తక్షణ అనుమతులు

విజయవాడ, ఆగస్టు 29: జిల్లాలో ఔత్సాహికులైన చిన్న పరిశ్రమలు స్థాపించే వారి కోసం సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు తక్షణమే మంజూరు చేసే విధంగా జిల్లా పరిశ్రమల కేంద్రం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. మంగళవారం జిల్లా పరిశ్రమల పోత్సాహక కమిటీ చైర్మన్, కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖాధికారులు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బ్యాంకుల్లో పోగుపడుతున్న రూ.10 నాణేలు!

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 29: పది రూపాయల నాణాలు చెల్లవని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల చూసినా ఇవి చెలామణి కాకపోవటంతో బ్యాంకర్లు, ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రూపాయల నాణేలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెలామణి అవుతున్నాయి. తెలంగాణలో సైతం అన్నిచోట్లా చెలామణిలో ఉన్నాయి. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 10 రూపాయల నాణాలు ఎవరూ తీసుకోవటం లేదు. ఇదిలావుంటే బ్యాంకర్లు తీసుకుంటున్నప్పటికీ వారి వద్ద నుండి ఎవరూ తీసుకోకపోవడంతో కొన్ని బ్యాంకుల్లో కోటి రూపాయల పైచిలుకు నాణాలు లాకర్లలో పడి ఉన్నాయి.

జిల్లాలో విజిలెన్స్ అధికారుల దూకుడు

మచిలీపట్నం, ఆగస్టు 29: జిల్లాలో కల్తీ ఆహారం, నిషేధిత గుట్కా అమ్మకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దూకుడు పెంచారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు దాడులను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో పాటు నిషేధిత గుట్కా వ్యాపారుల్లోనూ దడ పుట్టించారు. జిల్లా కలెక్టర్‌గా బి లక్ష్మీకాంతం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.

క్రీడా నైపుణ్యంతో మంచి నడవడికను అలవర్చుకోవాలి

గుడివాడ, ఆగస్టు 29: క్రీడల్లో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం ద్వారా మంచి నడవడికను, జీవితాంతం క్రమశిక్షణను అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీ ఆర్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ మెమోరియల్ జాతీయ క్రీడల దినోత్సవ వేడుక సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముందుగా దివంగత ఎన్టీ ఆర్, పర్వతనేని జగన్మోహనరావు విగ్రహాలు, ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఘనంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

నందిగామ, ఆగస్టు 29: స్థానిక గాంధీ సెంటర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో సహా పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నాం

అవనిగడ్డ, ఆగస్టు 29: గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పెద్దపీట వేస్తున్నారని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హాకీ క్రీడకు జాతీయ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ధ్యాన్‌చంద్ అని, ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించటం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతికెక్కారన్నారు.

ప్రజల హృదయాలు గెలిస్తేనే ఓట్లు

కర్నూలుసిటీ: ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటేనే ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేస్తారని, ప్రశాంత్‌కిషోర్ లాంటి సలహాదారులను పెట్టుకుంటే ఓట్లు రావని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి వైకాపా అధినేత జగన్‌కు హితవు పలికారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో కెఇ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రతిపక్ష నేత జగన్ ఎన్నో విధాలుగా రెచ్చగొట్టి, వ్యక్తి గత దూషణలు చేసి, గ్లోబల్ ప్రచారం చేసినా విజ్ఞత కలిగిన నంద్యాల ప్రజలు నమ్మలేదన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు.

ఏజన్సీలో పొంగుతున్న వాగులు

గంగవరం: కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండురోజులుగా మన్యంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండవాగులు పొంగి ప్రవహించడంతో మన్యం ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంగవరం మండలంలో జడేరు వద్ద పెద్దేరు, కనే్నరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గోకవరం-గంగవరం రూట్‌లో జువ్వమ్మ కాలువ , గంగవరం-ఆముదాలబంద మధ్య పెద్దకాలువలు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెదఅడ్డపల్లి - చీడిపాలెం మధ్య కొండవాగు ప్రవాహానికి వంతెన వద్ద అప్రోచ్ దెబ్బతింది. చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నేడు గవర్నర్ రాక

తిరుపతి, ఆగస్టు 29: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈనెల 30, 31 తేదీలలో తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 4.20 గంటలకు తిరుచానూరు తోళ్లప్పగార్డెన్‌కు చేరుకుంటారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం 5.15 గంటలకు తిరుచానూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరి వెళ్తారు. ఆ రోజు రాత్రి తిరుమలలో బసచేస్తారు.

Pages