S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ కాలేజీల్లో పెరిగిన ఆత్మహత్యలు

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంవత్సరం మొదలై రెండు నెలల వ్యవధిలోనే అపుడే దాదాపు పది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడటంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తలొగ్గడం వల్లనే ఇలా జరుగుతోందని, ఇటు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై అనవసరమైన పెంచుతున్నాయని, దాంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్న విద్యార్ధులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని ఎఐఎస్‌ఎఫ్, ఎబివిపి నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

రైతు సమితులపై కోర్టుకు

హైదరాబాద్, ఆగస్టు 29: టిఆర్‌ఎస్ నేతలతో రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ 39పై కోర్టుకు వెళ్ళనున్నట్లు టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చట్ట వ్యతిరేకమైన జివో నెంబర్ 39ని వెంటనే రద్దు చేయాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జివోతో రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాను తయారు చేయబోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బాంచన్ దొర వ్యవస్థను తేవాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల భూ హక్కుదారులకు నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

విపక్షాలకు మైండ్ బ్లాంక్

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందని టిఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల పాపం టిడిపిదని, ముదిగొండ కాల్పుల పాపం కాంగ్రెస్‌దని ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ సర్వేలు, బోగస్ అవార్డులు అంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఉత్తమ్ గ్యాంగ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు.

ప్రభుత్వమే ‘విమోచన’ నిర్వహించాలి

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ విమోచనకు జరిగిన పోరు, దాని వెనుక తెలంగాణ పోరాట యోధుల కృషి , దాని ప్రాధాన్యతను ప్రజల్లో మరింత చర్చకు పెట్టి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా బిజెపి రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి తెలంగాణ విమోచన యాత్రకు రూపకల్పన చేసింది. ఓట్ల రాజకీయంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు జంకుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే బిజెపి ఈ విమోచన యాత్రకు రూపకల్పన చేసిందని విమోచన కమిటీ చైర్మన్ ఎన్ శ్రీవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

నకిలీ బ్యాంక్ గ్యారంటీ లెటర్ కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్, ఆగస్టు 29: బ్యాంక్ రుణం కోసం గ్యారంటీ లెటర్ ఇస్తామంటూ ఓ కంపెనీ యాజమాన్యాన్ని మోసగించి ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని మిసెస్ క్యోరి ఒరెమిన్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డికి హర్యానాలోని గుర్‌గావ్ చెందిన గోవింద్ యశ్వంత్, సంజీవ్ కొఠారి పరిచయమయ్యారు. హర్యానాలోని అలెంజరీ లిమిటెడ్ సిఇఓగా పరిచయమైన వీరు శ్రీకాంత్ రెడ్డికి రూ. 6,66,60. 000లు బ్యాంక్ రుణం ఇప్పిస్తామని, అం దుకు తామే బ్యాంక్ గ్యారంటర్లమంటూ నకిలీ గ్యారంటీ లెటర్ ఇచ్చారు.

దోస్త్ అడ్మిషన్లకు నిబంధనల సడలింపు

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ అడ్మిషన్ల నిబంధనలను సడలించినట్టు దోస్త్ కన్వీనర్ డాక్టర్ లింబాద్రి తెలిపారు. దోస్త్ చివరి దశ అడ్మిషన్లకు మంగళవారం వరకూ అవకాశం ఇచ్చామని అన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు మే14 నుండి మూడు విడతలుగా వెబ్ ఆప్షన్లలో అవకాశం కల్పించామని, 1,87,300 మంది విద్యార్థులు ఇంత వరకూ వివిధ కోర్సుల్లో చేరారని, చిన్నచిన్న కారణాలతో కొంతమంది విద్యార్థులు సీట్లు పొందలేకపోయారని, సరైన టెలిఫోన్ నెంబర్లు ఇవ్వకపోవడం, టోకెన్ నెంబర్‌లు మిస్ కావడం తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురైన మాట నిజమేనని అన్నారు.

పాతబస్తీలో దారుణం

హైదరాబాద్, ఆగస్టు 29: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చి వారం రోజులు గడవక ముందే..ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పాడు. తన భార్యకు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తలాక్ చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, అత్త, మామ సహ ఎనిమిది మందిపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మగ పిల్లాడి కోసం బాబా వద్ద వైద్యం చేయించుకోవాలంటూ భర్త హుస్సేన్ ఒత్తిడి తీసుకురావడంతో నకిలీ బాబా వద్దకు వెళ్లగా..అమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాబా వద్ద వైద్యం చేయించుకోనని భర్తకు విదేశాల్లో ఉన్న భర్తకు ఆమె తేల్చి చెప్పింది.

నిలకడగా నాగావళి

పాలకొండ, ఆగస్టు 29: తుపాను వర్షాల కారణంగా గత రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన నాగావళి నది ప్రవాహం మంగళవారం నాటికి శాంతించింది. వర్షం కూడా గత రెండు రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం నాగావళి నది నిలకడగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నాగావళి నది నీరు వాగుల్లోకి చేరి అక్కడి నుంచి పంట పొలాలకు పోటెత్తడంతో వరి, చెరకు పొలాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. నాగావళి నది వేగం తగ్గడంతో మండలంలోని నాగావళి నదీతీర గ్రామాల కు చెందిన తంపటాపల్లి, వి.పి.రాజుపేట, బుక్కూ రు, మంగళాపురం, యరకారాయపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి పంట పొలాల్లో చేరిన వరదనీరు వాగుల్లోకి దిగజారుతుంది.

పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం రేపు

సూళ్లూరుపేట, ఆగస్టు 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూ రు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఈ నెల 31న పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. దీనికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బి ఎన్.సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాస్తవ్రేత్తలు విచ్చేసి ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు.

తెలుగులో తీర్పు ఇచ్చిన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్

విశాఖపట్నం, ఆగస్టు 29: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భీమునిపట్నం నాల్గవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కె మురళీమోహన్ మంగళవారం తెలుగులో తీర్పు చెప్పారు. 2013 అక్టోబర్ 14న మధ్యాహ్నం రెండు గంటలకు లారీ డ్రైవర్ సీతయ్య లారీని అజాగ్రత్తగా నడిపి రెడ్డిపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సమ్మంగి చంటి మరణించాడు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కంది సీతయ్యపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు భీమిలిలోని నాల్గవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చింది.

Pages