S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకీ లేదు

మహబూబ్‌నగర్, మార్చి 26: రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి గానీ, ప్రతిపక్షాల నేతలకు గాని లేదని ఆ దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు ప్రతిపక్ష నాయకులు పటాపంచలు కావాల్సిందేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏనుగొండ, రాజేంద్రనగర్ తదితర కాలనీల్లో టిఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే విధంగా హన్వాడ మండలంలోని వేపూర్, తిర్మలగిరి తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.

పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్

కొల్లాపూర్, మార్చి 26: ఎన్నికల ప్రణాళికలో చెప్పని పథకాలెన్నో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టారని అందులో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకోసం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంజికెఎల్‌ఐ అతిథిగృహం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మీ పథకం ద్వారా వీపనగండ్ల మండలానికి 23, కొల్లాపూర్ మండలానికి 70, చిన్నంబావి 13, కోడేరుకు 73, పెంట్లవెల్లికి 14, పెద్దకొత్తపల్లికి 88, పానుగల్లుకు 25 కలిపి మొత్తం 314 మందికి రూ.1.60 కోట్లు విలువగల చెక్కులను అందచేశారు.

టిఆర్‌ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

ఊట్కూర్, మార్చి 26 : నియోజక వర్గంతో పాటు గ్రామీణ ప్రాంతంలో టిఅర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఅర్ అదేశాల మేరకు అదివారం ఊట్కూర్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసి టిఅర్‌ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్టెం రామోహన్‌రెడ్డి హాజరై పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంబించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ బడుగు బలహిన వర్గాల అభ్యున్నతి కోసం ఏంతో కృషి చేశారని అన్నారు.

సర్పంచ్‌పై చెప్పుతో మహిళ దాడి

మద్దూరు, మార్చి 26: మండల కేంద్రమైన మద్దూరు గ్రామ సర్పంచ్‌పై ఆదే గ్రామానికి చెందిన ఓ మహిళ చెప్పుతో దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దూరు ఎస్సై నరేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూరు గ్రామ సర్పంచ్ వెంకటయ్యపై అదే గ్రామానికి చెందిన భారతి అనే మహిళ చెప్పుతో దాడి చేసిందని తెలిపారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రతి రోజు తోపుడు బండ్లలో కూరగాయలు, పూలు విక్రయించే మహిళల మధ్య గత కొన్ని రోజుల నుండి వివాదం నెలకొంది. అయితే తామే వీటిని విక్రయిస్తామని ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని భారతి అనే మహిళ మరో మహిళతో గొడవ పడిందని తెలిపారు.

మాయమాటలతో అధికారం కైవసం

చిట్యాల, మార్చి 26: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు మాయామాటలను చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకివచ్చారని అధికారాన్ని చేపట్టాక ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకాపర్తి గ్రామపరిధిలోని బోయగుబ్బలో ఆదివారం వాటర్‌ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిన్నకాపర్తిలో గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌పై మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలపై సంచలన వ్యాఖ్యలను చేశారు.

సామాజిక వికాసానికి నాటకం చైతన్య సాధనం

నల్లగొండ, మార్చి 26: తెలంగాణ సామాజిక వికాసానికి, ప్రజా చైతన్యానికి నాటక రంగం చైతన్య సాధనగా ఉపకరించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ, కోమలి కళా సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో ఏప్రిల్ 1వరకు రాష్ట్ర నాటక సప్తాహం పేరుతో నిర్వహిస్తున్న నాటకోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ గ్రామీణ ప్రజల్లో, నిరక్షరాస్యుల్లో ఆనాది నుండి కూడా నాటకం ఆలోచనను, చైతన్యాన్ని రగిలించడంలో కీలక భూమిక పోషించిందన్నారు.

ధర్మభిక్షం సేవలు మరువలేనివి

సూర్యాపేట, మార్చి 26: తెలంగాణ సాయుధ పోరాటుయోధుడు, మాజీ ఎంపి దివంగత బొమ్మగాని ధర్మభిక్షం సేవలు మరువలేనివని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ధర్మభిక్షం 6వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్వి కళాశాల వద్ద గల ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటంలో కీలక భూమిక వహించారని కొనియాడారు. సాయుధ పోరాటంతో పాటు గీతా వృత్తిదారుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన మహానీయుడన్నారు.

ఎండుతున్న వరి

తిప్పర్తి, మార్చి 26: ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ఈ రబీ (యాసంగి)లో రైతులు సాగుచేసిన పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. మండలంలోని ఏఎమ్మార్పీ డిస్ట్రిబూటర్ కాలువ ద్వారా సాగునీటిని చెరువులకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. సమయానికి సాగునీటి సరఫరా అందకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గడ్డికొండారు, జంగారెడ్డిగూడం, పజ్జూరు, సూరారం, గోదవారిగూడెం, తిప్పర్తి, సర్వారం తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

నంది ఆకారంలో గేదెకు పుట్టిన దూడ

మిర్యాలగూడ టౌన్, మార్చి 26: మిర్యాలగూడ పట్టణం ఈదులగూడలో చింతల వెంకటేశ్వర్లు అనే పాడి రైతు ఇంట ఆదివారం పాడిగేదెకు నంది ఆకారంలో దూడ పుట్టింది. దూడ పుట్టగానే చనిపోయింది. వెంకటేశ్వర్లు ఇంటిని సందర్శించిన పశుసంవర్దకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జూలకంటి వెంకట్‌రెడ్డి జన్యు లోపం వల్లనే నందిలా దూడ ఉందని అన్నారు. పాడి గేదె గర్భంతో ఉన్నప్పుడు సరైన వైద్యం అందిస్తే ఇలాంటివి జరగవని ఆయన అన్నారు. వింత దూడ పుట్టిందన్న ప్రచారంతో పలువురు గుంపులుగా వచ్చి చూసి వెళ్లారు.
వంచన చేసిన ప్రియుడు

తొలి రోజు మూడు గంటలు ఆలస్యం

మోర్తాడ్, మార్చి 26: మోర్తాడ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల తొలి ప్రయాణం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నెల 25నే నిజామాబాద్ - పెద్దపల్లిల మధ్య నూతన రైలును ప్రభుత్వం ప్రారంభించిన విషయం విధితమే. ఉదయం 4.30గంటలకు నిజామాబాద్ నుండి ప్రారంభమయ్యే రైలు, 5.30గంటల కల్లా మోర్తాడ్‌కు చేరుకుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.30గంటలకు మోర్తాడ్ స్టేషన్‌కు రావాల్సి ఉండగా, ఆదివారం మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నట్లు స్టేషన్ మాస్టర్ ప్రకటించారు. నిజామాబాద్ వెళ్లేందుకు సుమారు 50మంది ప్రయాణికులు స్టేషన్‌కు రాగా, రైలు ఆలస్యంగా వస్తుందని తెలిసి అందులో సగం మంది ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లిపోయారు.

Pages