S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలియా సెన్సార్ పూర్తి

శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన ‘చెలియా’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. కార్తీ, అతిథిరావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్లకు మంచి ఆదరణ లభిస్తోందని, కార్తీ, అతిథిరావు హైదరి అందమైన ప్రేమజంటగా ప్రేక్షకులను మెప్పిస్తారని, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, మణిరత్నం టేకింగ్ ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటాయని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తెలిపారు.

బేగం జాన్‌తో వస్తున్నా

లక్స్‌పాపగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ఆషాశైని, తొలినాళ్లలో హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నా, ఆ తరువాత ఆమెకు అవకాశాలు కలిసిరాలేదు. రకరకాల పేర్లు పెట్టుకుని కలిసి వస్తుందేమో అని ప్రయత్నాలూ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బేగం జాన్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. విద్యాబాలన్ లీడ్‌రోల్‌లో నటిస్తుండగా, గుజరాత్‌కు చెందిన మైనా అనే ఓ గిరిజన యువతి పాత్రాలో ఆశాషైని నటించింది. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో తనకు ఆఫర్లు వస్తాయని చెబుతోంది. తెలుగు ప్రేక్షకులు నన్ను మర్చిపోయారని, తాను తెలుగు చక్కగా మాట్లాడగలనని, బేగం జాన్ తరువాత తెలుగులో ఆఫర్లు వస్తాయన్న ఆశాభావంతో వుంది.

ఉగాదికి రాంబాబు టీజర్

సునీల్ కథానాయకుడుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నట్లుగా యూనిట్ తెలియజేస్తోంది. నిర్మాత కిరీటి మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నామని, త్వరలో ఆడియోను విడుదల చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

కొత్త కథ

తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలపై గురిపెట్టింది. బాలీవుడ్‌లో సెటిల్ అవుదామనుకున్న ఈ అమ్మడుకు ‘తుటియా తుటియా తుటక్’ చిత్రం సరైన అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనకు ప్రభుదేవా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలై సో..సోగా ఆడిన ‘అభినేత్రి’ చిత్రం ఫర్వాలేదనిపించింది. అయితే ఇదే ధైర్యంతో ప్రభుదేవా కేవలం తమన్నా కోసమే సీక్వెల్ రూపొందించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రెండు మూడు ప్రేమాయణాలతో విసిగెత్తిపోయిన ప్రభుదేవా, ప్రస్తుతం తమన్నాతో ప్రేమాయణం జరుపుతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది.

ఇదంటే రైతులకు ఇష్టం

పంటలను అతి తక్కువ సమయంలో తిని పాడుచేసే ‘అఫిడ్స్’ను కరకరా నమిలి తినేసే ‘లేడీ బగ్’ అంటే రైతులకు ఎంతో ప్రేమ. ఆ అభిమానంతోనే వాటిని లేడీ బీటిల్ అని కూడా పిలుస్తారు. రోజుకు ఒక లేడిబగ్ బీటిల్ కనీసం 50 అఫిడ్స్‌ను అమాంతం తినేస్తుంది. ఎరుపు శరీరవర్ణంపై నల్లటి మచ్చలతో గుండ్రంగా, అందంగా కనిపించే ఈ బగ్ ప్రమాదం ఎదురైనప్పుడు మోకాళ్ల నుంచి విషానిన చిమ్ముతుంది. చెట్ల కొమ్మలు, కాండంపై నుంచి జారిపోకుండా ఉండేందుకు పాదాలనుంచి బంకలాంటి ద్రవాన్ని విడుదల చేసి వాటిని అతుక్కుని ఉంటుంది. మనలో చిన్నపిల్లల కన్నా ఇవి వేగంగా నడుస్తాయి. ఓ చిన్నపిల్లాడు గంటకు 2 మైళ్ల వేగంతో నడవగలిగితే ఇవి గంటకు 15 మైళ్ల వేగంతా

ఎస్.కె.కె. రవళి

పెరిగేకొద్దీ రంగు మారే కోతులు

‘డస్కీ లీఫ్ మంకీ’ అని, ‘డయామెడ్ మంకీ’ అని పిలిచే ఈ కోతుల కళ్లవద్ద తెల్లటి వలయాలు ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు కాషాయం లేదా పసుపురంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. పెరిగే కొద్దీ గ్రేకలర్‌లోకి బొచ్చు రంగు మారుతుంది. రోజుకు కనీసం 2 కేజీల ఆహారాన్ని తింటాయి. వీటికళ్లవద్ద తెల్లటి వలయాలు ఉండటం వల్ల వీటిని ‘స్పెక్టాకిల్ లంగూర్’ అని కూడా అంటారు.

ఎస్.కె.కె. రవళి

టర్కీ కోడి

తాళ్లాయపాలెంలో ఒక రైతు కొన్ని కోడిపిల్లలను తెచ్చి పెంచుతున్నాడు. అందులో పుంజులు, పెట్టలు ఉన్నాయి. అందులో ఒక టర్కీ కోడి పిల్ల కూడా ఉంది. అది మిగిలిన వాటికి భిన్నంగా ఉండేది. వాటితో కలిసేది కాదు. పైగా రైతు కొడుకు పాక దగ్గర కూర్చుని ఇంగ్లీషు చదువుతుంటే చక్కగా వినేది. అలా దానికి ఇంగ్లీష్ మీద మక్కువ పెరిగింది. దాంతోపాటు దాని దర్పం కూడా పెరిగింది. ఇంగ్లీష్ మీద ఇష్టంతో తెలుగు నిర్లక్ష్యం చేసింది. తెలుగు పదాల అర్థం దానికి తెలియకుండా పెరిగింది. మిగిలిన కోళ్లు ఏం చెప్పినా వినేది కాదు. కారణం దాని తెలుగు తెలియకపోవడం. తల ఊపి వెళ్లిపోయేది. రోడ్ల మీద ట్వింకిల్.. ట్వింకిల్.. అని పాటలు పాడుకుంటూ తిరిగేది.

- కూచిమంచి నాగేంద్ర

రామాయణం.. మీరే డిటెక్టివ్ 28

పరశు రాముడి వంక చూసి చెప్పాడు.
‘రామా! నీ పరాక్రమం అద్భుతమైందని, నువ్వు శివుని విల్లు విరిచేసావని విన్నాను. ఊహించలేని అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నా వెంట ఓ మంచి విల్లుని తెచ్చాను. జమదగ్ని నించి నాకు లభించిన ఆ భయంకరమైన వింటిని ఎక్కుపెట్టి, బాణాన్ని పూరించి, నీ బలాన్ని చూపించు. ఆ పని చేస్తే నువ్వు బలమైన వాడివని మెచ్చుకుని నీతో ద్వంద యుద్ధం చేస్తాను’
ఆ మాటలు వినగానే దశరథుడు దిగాలుగా చేతులు జోడించి చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

మన్యంలో జలయజ్ఞం

‘‘క్రియాసిద్ధి సత్వేభవతి మహతాం నోపకరణే’’
- సంకల్పశుద్ధి, క్రియాశీలత, త్యాగం, సేవాభావం ఆభరణాలుగా కలిగిన వ్యక్తులకు కార్యసిద్ధి అందనంత దూరమేమీ కాదు. నిస్వార్థమైన కోరిక యొక్క అలౌకిక బలమే వారికి ఎనలేని శక్తినిస్తుంది. అలాంటి వారికి ఉపకరణాలతో పనిలేదు. - ఇదీ పై శ్లోకం యొక్క భావం.
కొంతమంది విషయంలో ఇది అక్షరసత్యం. అలాంటివారే మానవ సేవే మాధవ సేవ అని త్రికరణశుద్ధిగా నమ్ముతారు, ఆచరణలో చూపుతారు. ఒక పని చేయాలంటే కావాల్సింది నిష్కళంకమైన సంకల్పం, నూటికి నూరుపాళ్లు అందులో నిమగ్నం కావడం. అవి నిండుగా కలవారు ఎంతటి క్లిష్టమైన పనినైనా చేతల్లో చేసి చూపిస్తారు.

-శ్రీరామశాస్ర్తీ, 9440066633

పిబరే కల్పరసం

కొబ్బరి నీళ్ళే అమృతాన్ని తలపిస్తాయ... తక్షణం సేద తీర్చి కొత్త ఉత్సాహాన్నిస్తాయ. అలాంటి కొబ్బరిచెట్టునుంచే మరో అద్భుతమైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. పోషక విలువలు పుష్కలంగా కలిగిన ఈ అమృతమయ ద్రావకమే కల్పరసం. ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నీ అందిస్తాయ. కొబ్బరినీళ్లకే అలవాటుపడ్డ ప్రజలకు ఈ కల్పరసం మరో అనిర్వచనీయ అనుభూతి. రసాయనాలతో పనిలేని పోషక విలువల సమ్మిళిత ఆరోగ్య దివ్యరసమిది.

- టి. శ్రీనివాస్

Pages