S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన డిఎల్‌ఎఫ్ రుణ భారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణ భారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో ముగిసిన ఏడాదిలో 1,021 కోట్ల రూపాయలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్ నాటికి 22,120 కోట్ల రూపాయలుగా ఉన్న డిఎల్‌ఎఫ్ రుణాలు.. ఈ జూలై-సెప్టెంబర్ ముగిసే నాటికి 23,141 కోట్ల రూపాయలకు చేరాయి. కాగా, రెంటల్ విభాగం డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్‌లో 40 శాతం వాటాను డిఎల్‌ఎఫ్ ప్రమోటర్లు అమ్మేస్తున్నారు. మిగతా 60 శాతం వాటా వాణిజ్య ఆస్తుల రూపంలో ఉంది.

ఐటి, చమురు షేర్లు కుదేలు

ముంబయి, డిసెంబర్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. పేలవమైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అధిక చమురు ధరలు, వీసాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో నష్టాలకు లోనయ్యాయి. ముఖ్యంగా ఐటి, చమురు, గ్యాస్ రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231.94 పాయింట్లు పతనమై 26,515.24 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 90.95 పాయింట్లు క్షీణించి 8,170.80 వద్ద నిలిచింది.

ముందుంది మంచి కాలం

సింగపూర్, డిసెంబర్ 12: వేతన జీవులకు శుభవార్త. ఆసియా-పసిఫిక్ దేశాల్లో వచ్చే ఏడాది అత్యధికంగా వేతనాలు పెరిగేది భారత్‌లోనేనని ఓ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక చెబుతోంది. భారత్‌లో 10.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని మెర్సర్ సంస్థ అంచనా వేసింది.
ఆ తర్వాత వియత్నాంలో 9.2 శాతం వేతనాలు పెరుగుతాయని పేర్కొంది. ఇక ఆసియా దేశాల్లో ఆర్థిక పరిపుష్టికి నిలయమైన హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో 2017లో వేతనాల పెంపు వరుసగా 4.2 శాతంగా, 4.1 శాతంగా ఉంటాయని వార్షిక టోటల్ రెమ్యునరేషన్ సర్వే (టిఆర్‌ఎస్) ఆధారంగా రూపొందించిన ‘కాంపెనే్సషన్ ప్లానింగ్ ఫర్ 2017’ నివేదికలో మెర్సర్ అంటోంది.

ఇంకెందరు చావాలి?

కోల్‌కతా, డిసెంబర్ 12: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఇంకెంత మంది ప్రజలు చనిపోవాలని చూస్తున్నారో చెప్పాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోమవారం విరుచుకుపడ్డారు. ‘మోదీ బాబూ ఎంకా ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు?’ అని ఆమె ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తరపున పార్టీ ప్రతినిధి డెరెక్ ఒ బ్రెయిన్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో మమత ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో, ఏటిఎంల ముందు గంటల తరబడి వరుసల్లో నిలబడి చనిపోయిన 95మంది జాబితాను పోస్ట్ చేశారు.

చర్చకు మేం సిద్ధం

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ‘పార్లమెంట్‌లో పెద్ద నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉన్న రెండు మూడు రోజుల సమావేశాల కాలాన్ని వృధా చేయొద్దు’ అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేది ఇక మూడు రోజులేనని, కొద్ది కాలాన్నైనా ఉపయోగిద్దామని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు విజ్ఞత ప్రదర్శించి పార్లమెంట్ సక్రమంగా సాగేలా సహకరించాలని వెంకయ్య పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు అంశం ఒక్కటే కాదని, పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు.

భద్రతా బలగాలపై దాడికి మావోయిస్టుల వ్యూహం!

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: మావోయిస్టులు తమ ప్రాబల్యం గల ప్రాంతాల్లో పనిచేస్తున్న పారా మిలిటరీ, పోలీసు బలగాలపై దాడులు చేయడానికి కసరత్తు చేస్తున్నారా? అవుననే అంటున్నాయి కేంద్ర భద్రతా సంస్థలు. పారా మిలిటరీ, పోలీసు సిబ్బంది కదలికలు, వారి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మావోయిస్టులు సేకరిస్తున్నారని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి.

‘నల్ల’దొంగలకు మరో అవకాశం!

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ‘నల్ల’ దొంగలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తమ ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు అవకాశం ఇవ్వబోతోంది. 50శాతం పన్ను చెల్లించి మిగతా వెల్లడించిన మొత్తాన్ని తెలుపు చేసుకునేందుకు రెండోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ఈ వారంలో ప్రకటించబోతోంది. దీని ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన లెక్కలు చూపని సొమ్ముకు 50శాతం పన్ను, సర్‌చార్జి రూపంలో చెల్లిస్తే మిగతా సొమ్మును క్లియర్ చేస్తుంది. మిగిలిన సొమ్ములో ఒక సగం నాలుగేళ్లపాటు లాకింగ్ పీరియడ్‌తో ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని.. అంటే మొత్తం నగదులో 25శాతం మాత్రం వెంటనే తీసుకోవటానికి అవకాశాన్నిస్తారు.

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా గల ఇండోనేసియా అంగీకారానికి వచ్చాయి. ముఖ్యంగా ఉగ్రవాదం, దానికి అందుతున్న ఆర్థిక సాయం, మనీలాండరింగ్, ఆయుధాల స్మగ్లింగ్‌పై సమర్థవంతంగా పోరాడటానికి తీరప్రాంతంపై దృష్టి కేంద్రీకరించాలని, పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి.

ఎటిఎం వద్ద బారులు

చిత్రం..సోమవారం సెలవు దినం అయనప్పటికీ ఏదో కొన్ని ఎటిఎంలలో నగదు ఉండటంతో దానిని దక్కించుకునేందుకు చాలామంది నిరీక్షించకతప్పలేదు. అహ్మదాబాద్‌లో ఒక ఎటిఎం వద్ద బారులు తీరిన జనం

‘ఆ ఎంపీలకు జీతాలు ఇవ్వొద్దు’

థానే, డిసెంబర్ 12: పెద్దనోట్లను రద్దుచేసూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని జగద్గురు కాశీ సురేము పీఠాధిపతి శంకరాచార్య స్వామి నరేంద్రానంద్ సరస్వతి స్వాగతించారు. జీతాలు, అలవెన్సులు తీసుకుని మరీ సభకొచ్చి కార్యక్రమాలకు అంతరాయం కల్పిస్తున్నారని ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. సభలో గొడవ చేసేవారికి జీతాలు ఇవ్వొద్దని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

Pages