S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగంబండ రిజర్వాయర్ ప్రమాదంలో ఉందా?

మక్తల్, డిసెంబర్ 11: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పరిధిలోని సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ) బాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట ప్రాంతం ప్రమాదం అంచున చేరబోతుందని ఈప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అండగా ఉంటా ధైర్యంగా ఉండాలి

అడ్డాకుల, డిసెంబర్ 11: పోరాడి సాదించుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకునే క్రమంలో కార్యకర్తలు నిరాశకు గురికాకుండా దైర్యంగా ఉండాలని మహబూబ్‌నగర్ ఎంపి జితెందర్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం అడ్డాకుల మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షనత నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి జితెందర్‌రెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి జితెందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

అమలుకు నోచని చట్టాలు

నిజామాబాద్, డిసెంబర్ 11: బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని, బాలకార్మిక రహిత సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, అడుగడుగునా దుర్భర జీవనాలు గడుపుతున్న బాలలు దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రవేశపెట్టినా, దాని అమలు తీరును సామాజిక పరిస్థితులు ప్రశ్నిస్తున్నాయి. పొట్ట కూటి కోసం పలువురు చిన్నారులు యాచక వృత్తిలో అడుగుపెడుతుండగా, మరికొందరు ప్రమాదకర పనుల్లో కొనసాగుతున్నారు. ఉదయానే్న పది ఇళ్లకు తిరుగుతూ సేకరించిన పాచిపోయిన అన్నం చిన్నారులతో పాటు వారి కుటుంబీకులకు పరమాన్నంగా మారుతూ ఆకలితో అలమటించకుండా ప్రాణాలు నిలుపుకునేందుకు దోహదపడుతోంది.

యోగతో చెడు వ్యసనాలు దూరం

కామారెడ్డి, డిసెంబర్ 11: ప్రజల ఆరోగ్యం బాగుడాలంటే ప్రతి ఒక్కరు యోగ చేయాలని అప్పుడే చెడు వ్యసనాలు దూరం అవుతాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో రాష్టస్థ్రాయి యోగ ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆయుధం యోగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగ చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అప్పుడు గ్రామాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రోజు ఉదయం గంట పాటు యోగ చేస్తానని తమ యొక్క గురువు రాంచంద్రం యోగ విద్యను రోజు అందిస్తారన్నారు.

అన్నదాతకు ఆపన్నహస్తం ఏదీ?

నిజామాబాద్, డిసెంబర్ 11: ప్రకృతిపరంగా ఒడిదుడుకులు ఎదురై పంటలు కోల్పోయిన బాధిత రైతాంగానికి ఆపన్నహస్తం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు అతివృష్టి, అనావృష్టి ధాటికి కోల్పోయి ఆర్థికంగా చితికిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో బాధిత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ పాలకులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఆఘమేఘాల మీద అధికారులను సర్వేలకు పూరమాయించి నివేదికలు రూపొందించడంతోనే సరిపెట్టుకుంటున్నారు.

అఖిలపక్షం నేతల రాస్తారోకో

గాంధారి, డిసెంబర్ 11: గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించే విషయమై తమకు స్పష్టమైన హామీ రావడం లేదని ఆరోపిస్తూ ఆదివారం గాంధారి ప్రధాన రహదారిపై అఖిలపక్షం నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని తాము గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. తమ మండలానికి అన్యాయం జరుగుతుందని తెలిపినా సంబంధిత అధికారులు గానీ, అధికార పార్టీ నేతలు గానీ ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదని ఆరోపించారు.

మధ్యమానేరు పనుల అడ్డగింత

ఇల్లంతకుంట, డిసెంబర్ 11: మండలంలోని కందికట్కూర్, మానువాడ మధ్యలో నిర్మిస్తున్న మధ్యమానేరు నిర్మాణం పనులను ఆదివారం కందికట్కూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. కట్కూర్ పంచాయతీ పరిధిలోని గుర్రంవానిపల్లె మాత్రమే ముంపు గ్రామంగా తీసుకొని వారికి పరిహారం చెల్లించారని, కట్కూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించనట్లయితే పనులను జరుగనిచ్చే ప్రసక్తేలేదని గ్రామస్థులు హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్న గ్రామస్థులతో చర్చలు జరిపారు.

వంద శాతం నగదు రహిత గ్రామంగా ముక్రాకె

ఇచ్చోడ, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి వాటి స్థానంలో నగదు రహిత లావాదేవీలపై దృష్టిసారించాలని ప్రకటించడంతో ఇచ్చోడ మండలంలోని ముక్రాకె గ్రామంలోని ప్రజలు పేటిఎంపై తమ అవగాహనను పెంచుకొని వాటిద్వారానే లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక తహసీల్దార్ మోహన్‌సింగ్ గ్రామానికి వెళ్ళి నగదు రహిత లావాదేవీలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. స్వయాన తహసీల్దార్ పేటి ఎం ద్వారా కిరాణ షాపులో సరకులను కొనుగోలు చేసి గ్రామస్తులను అభినందించారు.

శుభ కార్యంలో విషాదం!

హుస్నాబాద్, డిసెంబర్ 11: శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువులు అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేస్తుండగా బాలుడు గేటుతో అడుకుంటుండగా గేటుఊడి పైనపడి బాలుడు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాదం నెలకొన్న సంఘటన సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టనానికి చెందిన ముత్తినేని పూర్ణచందర్ రెడ్డి అదివారం పట్టణంలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మైసమ్మ పండుగ చేసుకున్నాడు.

కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: కృష్ణాజలాలు మన పొలాల్లోకి ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసిన రైతాంగానికి ఈ ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే కృష్ణానదీ జలాలు చెరువుల్లోకి, వాగులు, వంకల్లోకి చేరడంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగం ఆశలు నేరవేరాయి. దశాబ్దాల కాలం పాటు ఎన్నో పోరాటలు ఉద్యమాలు చేసి సాదించుకున్న ప్రాజెక్టుల నుండి సాగునీరు వస్తుండడంతో ఈ ప్రాంత రైతాంగంలో నూతనోత్సహం నెలకొంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబందించి లిఫ్ట్-1,2,3ల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తూ సాగునీటిని రైతులకు అందజేసే ప్రక్రియలో ప్రభుత్వం నిమగ్నమైంది.

Pages