S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధులకు నేత్ర వైద్యం

నరసన్నపేట, అక్టోబర్ 25: మండల కేంద్రంలోని స్థానిక ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారు 25మంది వృద్ధులకు నేత్ర చికిత్సలకు ఎంపిక చేశారు. మంగళవారం ఈ మేరకు వీరిని సోంపేట ఆరోగ్యవరం నేత్ర ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆప్తాలమిక్ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల సుమారు 20నుండి 30మందికి పైగా శస్తచ్రికిత్సలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్.సి లబ్ధిదారుల అవగాహన సదస్సు

దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 25: జిల్లాలోని లావేరు మండలంలోని అదపాక గ్రామ దళితులపై అదే గ్రామానికి చెందిన పెత్తదార్లు మూకుమ్మడిగా దాడి చేశారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ తరపున జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రెల్లి కులస్తులపై గ్రామ పెత్తందారులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు.

ఘనంగా నందెమ్మ అనుపోత్సవం

జలుమూరు, అక్టోబర్ 25: మండలం చల్లవానిపేటలో గౌరీపౌర్ణమి నుండి నెలకొన్న గౌరీదేవి ఉత్సవాలు మంగళవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. సాయంత్రం ఆశ్వీయుజమాసం దశమిపర్వదినం పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేపట్టారు. నందెమ్మ నెలకొన్ని సింహాద్రి వారి ఇంటి నుండి బయలుదేరిన గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పురాతన పాటలతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. షేర్‌మహ్మద్‌పురం గ్రామానికి చెందిన తప్పెటగుళ్ల కార్యక్రమాలు జరిగాయి. చల్లవానిపేటలో ఈ నృత్య ప్రదర్శలను ఆకట్టుకున్నాయి. సుమారు అర్థగంట పాటు ఈ బృందం ప్రదర్శించిన దృశ్యాన్ని అభినందించారు.
మనోనేత్రంతో ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు

రక్తదానం మరొకరికి ప్రాణదానం

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 25: రక్తదానం ఎంతో అవసరమని దీన్ని నిరంతరం కొనసాగించేలా అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మంగళవారం తమ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తం కొరత ఎక్కువగా ఉండటం వలన రక్తదానాన్ని ఎక్కువగా చేయాలన్నారు.

మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు జీవో అమలు చేయాలి

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 25: రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల ఆర్థిక ప్రయోజనార్థం రాష్ట్ర ఫైనాన్స్ డిపార్టుమెంట్ విడుదల చేసిన జీవోలను తక్షణమే అమలులోకి తీసుకురావాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు పేర్కొన్నారు.

‘గాజు’ల బొమ్మ దుర్గమ్మ!

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 25: మట్టి గాజులను సర్వాభరణాలుగా ధరించి ఇంద్రకీలాద్రి స్థిర నివాసిని శ్రీ కనకదుర్గమ్మ మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. మిలమిల మెరిసిపోతున్న ఆమెను భక్తులు దర్శించి పులకించిపోయారు. ఆమె దర్శనానికి మంగళవారం వేకువజాము నుండే మహిళలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. సుమారు 4 లక్షల గాజులు సర్వాభరణాలుగా ధరించిన దుర్గమ్మను దర్శించుకుంటే వంద సంవత్సరాలు సౌభాగ్యవతిగా జీవిస్తారని, అవివాహిత యువతులకు వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారి అమ్మవార్లకు ఈ ప్రత్యేక అలంకారం చేశారు.

సంస్కరణల అమలులో ఎపి ఫస్ట్

విజయవాడ, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖలో అమలవుతున్న సంస్కరణలను వివిధ రాష్ట్రాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర రవాణా శాఖ దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు

విజయవాడ, అక్టోబర్ 25: ఐటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎంజిరోడ్డులోని హోటల్ ఫార్చ్యున్ మురళి హోటల్ నందు ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర శాఖ - ఎఫ్‌ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా గత రెండు రోజుల నుండి నిర్వహిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది.

కాలక్షేపానికే జగన్ యువభేరి

విజయవాడ, అక్టోబర్ 25: చంద్రబాబునాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సమయంలో యువభేరీ పేరుతో ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన రెడ్డి యువత, విద్యార్థులను అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో టిఎస్‌ఎన్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసిన జగన్ విద్యార్థులకు ఏ విధమైన సందేశమిస్తారు అని ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డి విలువల గురించి మాట్లాడుతుంటే చంచల్‌గూడ జైలులో ఉన్న ఖైదీలు కూడా నవ్వుకుంటారని విమర్శించారు.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై పూర్తి స్థాయిలో అధ్యయనం

విజయవాడ, అక్టోబర్ 25: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుపై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు అడ్వకేట్ జనరల్ సహా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి మంగళవారం రాత్రి సిఎం కార్యాలయం మీడియా పాయంట్ వద్ద పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 31న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సైతం దీనిని చర్చించడం జరుగుతుందన్నారు.

Pages