S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మాయం

భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పసికందు మాయమైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు మాయమైన శిశువును తీసుకెళ్లి ఉండవచ్చనే సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రుల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు అనుమానితురాలిగా ఉన్న ఒక మహిళను గుర్తించారు. పసికందు మాయం ఘటనలో నిందితురాలి ఆనవాళ్లు రాబట్టిన పోలీసులు స్థానికంగా ఉన్న ఒక చిన్నపిల్లల ఆసుపత్రిలో కిడ్నాప్ చేసిన మహిళ పసికందుతో ఉన్న ఫుటేజీని కనుగొన్నారు. సీసీ కెమెరా పుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి కిడ్నాప్ చేసిన మహిళ ఆమె అని నిర్ధారించుకున్నారు.

దీపావళి బోనస్‌తో సింగరేణి కార్మికులకు ట్రిపుల్ ధమాకా

కొత్తగూడెం, అక్టోబర్ 25: సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌రూపంలో బుధవారం ఒక్కొక్కరు రూ 54వేల చొప్పున ఈనెల వరుసగా 3వ బెన్‌ఫిట్‌ను పొందనున్నారు. ఈనెల 7వ తేదీన రాష్టమ్రుఖ్యమంత్రి కెసిఆర్ గడచిన ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 23శాతం లాభాలవాటాను కార్మికులకు ప్రకటించారు. అదేరోజు రాత్రి రూ 245.21కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు మొదటి బెన్‌ఫిట్‌గా వారివారి బ్యాంకుఖాతాలలో జమఅయ్యాయి. తరువాత దసరాపండుగ సందర్భంగా పండుగ అడ్వాన్సుగా ఒక్కొక్క కార్మికునికి రూ 18వేల చొప్పున బ్యాంకు ఖాతాలలో 2వ బెన్‌ఫిట్‌గా జమచేశారు.

2.20కోట్ల మొక్కల పెంపకమే లక్ష్యం

ఖమ్మం, అక్టోబర్ 25: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని, వచ్చే సంవత్సరం జిల్లాలో 2.20కోట్ల మొక్కలను పెంచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని టిటిడిసి సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన జరిగినందున రెండు జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను వివరించారు. జిల్లాలోని 165నర్సరీల్లో 2.20కోట్ల మొక్కలు పెంచాలని ఆదేశించారు.

ప్రతిపక్షాల ఆందోళనలకు స్పందించని పాలకులు

ఖమ్మం, అక్టోబర్ 25: ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలకు టిఆర్‌ఎస్ నేతలు స్పందించడం లేదు. దీంతో నకిలీ విత్తనాలతో పాటు జిల్లాల విభజన శాస్ర్తియంగా జరగలేదని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని, అర్హులైన వారందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలంటూ గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ప్రతినిత్యం ఈ కారణాలతో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రజల నుంచి మద్దతు కూడా లభిస్తుంది.

డిసెంబర్ 29 నుంచి శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

భద్రాచలం, అక్టోబర్ 25: డిసెంబర్ 29 నుంచి 2017 జనవరి 18వ తేదీ వరకు దక్షిణ అయోధ్య శ్రీసీతారామచంద్రస్వామికి శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవస్థానం స్థానాచార్యులు స్థలసాయి, ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబులు మంగళవారం ఉత్సవ తేదీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభవౌతాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29 నుంచి అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు మత్స్య, కూర్మా, వరాహ, నృసింహ, వామన, పరశురామా, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణా అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 25: రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం టిటిడిసి సమావేశ మందిరంలో డిఆర్‌డిఏ, మార్కెటింగ్, సివిల్‌సప్లయిస్, మార్కెటింగ్ ఏజన్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొనుగోలు సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. పత్తి, వరిధాన్యం, మొక్కజొన్న పంటల దిగుబడికి అనుగుణంగా అవసరమయ్యే ఏర్పాట్లపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన కస్తూరిబా విద్యార్థిని

ఎర్రుపాలెం, అక్టోబర్ 25: ఎర్రుపాలెంలోని కస్తూరిబాయి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రావణి రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎస్ సరిత, పిఇటి విజయ మంగళవారం తెలిపారు. ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి అండర్-14 ఖోఖో పోటీల్లో మండలం నుండి ఎంపికై జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చడంతో రాష్టస్థ్రాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందని ప్రిన్సిపాల్ తెలిపారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థినిని ప్రిన్సిపాల్ సరిత, పిఇటి విజయ, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్‌లో హాజీబాబాకు
బంగారు పతకం

నీటితొట్టిలో పడి బాలుడు మృతి

గార్ల,అక్టోబర్ 25: నీటితోట్టిలో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం గార్ల మండలం మంగలితండాలో జరిగింది. స్థానికులు, కుటుంబుసభ్యుల కథనం ప్రకారం మంగలితండకు చెందిన కురసం అంజయ్య,సుధల మూడెళ్ళ కుమారుడి దిలీప్ ఆటలాడుకుంటూ నీటి తొట్టి దగ్గరకు వెళ్లి నీళ్ళు ముంచబోతూ అందులో పడిపోయాడు. ఆప్రక్కనే పొలం పనులు నిర్వహిస్తున అంజయ్య,సుధలు తమ కుమారుడి జాడకై వెతుకులాడుతుంటే నీటితోట్టిలో శవమై కన్పించాడు. దీంతో వారి రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పట్టుపరిశ్రమ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి

పలమనేరు, అక్టోబర్ 25 : రైతులందరూ పట్టుపరిశ్రమ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కేంద్ర పట్టు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పట్టుపరిశ్రమశాఖ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమ అభివృద్ధికి దేశ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని పట్టుపరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో సబ్సిడీ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు.

తిరుమల ఘాట్‌రోడ్డులో బైక్‌రేస్‌చేస్తూ పట్టుబడ్డ యువకులు

తిరుమల, అక్టోబర్ 25: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే నలుగురు తమిళ యువకులు బైక్ రేస్ చేస్తూ పట్టుబడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండవ ఘాట్‌రోడ్డులో మంగళవారం నలుగురు తమిళ యువకులు టిటిడి నిబంధనలు అతిక్రమించి రేసులకు పాల్పడ్డారు. ఆ నలుగురు తమిళ యువకులు ఘాట్‌రోడ్డులో బైకులను ఒకరికొకరు పోటీ పడుతూ ద్విచక్ర వాహనాలను నడుపుతుండటంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జి ఎన్ సి టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆ నలుగురు ద్విచక్ర వాహనాలపై టిటిడి సూచించిన సమయం కంటే ముందుగా చేరుకోవడంతో జరిమానా విధించి మందలించి పంపేశారు.

Pages