S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజునాథ్ కమిటీపై బిసిల్లో సర్వత్రా వ్యతిరేకత!

కడప,సెప్టెంబర్ 27: కాపుల (బలిజలు)ను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిషన్ పట్ల బిసిల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఆదివారం రాత్రి, సోమవారం , మంగళవారం జిల్లాలో కమిటీ మకాం వేసి కాపునేతలతోనే సన్నిహితంగా ఉండటంతో సోమవారం జెడ్పిసమావేశ మందిరంలో బిసి కులాల సంఘం నేతలు ఇచ్చిన దరఖాస్తులు, వినతిపత్రాలు బుట్టదాఖలు చేసినట్లు పలువురు బిసి నేతలు భావిస్తున్నారు.

చారిత్రాత్మక కట్టడాలకు గుర్తింపేదీ?

కడప,సెప్టెంబర్ 27: జిల్లాలో చోళులు, కృష్ణదేవరాయల కాలం నుంచి అబ్బురపరిచే దేవాలయాలు, కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలున్నా వాటికి తగినంత గుర్తింపు రాలేదదన్నది నగ్నసత్యం. పురాతన కట్టడాలను శాశ్వత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం వైఫల్యం చెందిందని జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఏటా సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారుల హడావిడే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.

నేరాలు తగ్గించేందుకు కఠిన చర్యలు

కడప,(క్రైమ్)సెప్టెంబర్ 27: గత మూడునెలల్లో నేరాలు తగ్గాయని ఇంకా తగ్గేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రైమ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడునెలలుగా రోడ్డుప్రమాదాలు 30శాతం తగ్గాయని డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 498 కేసుల్లో విచారించిన తర్వాతనే అరెస్టులు చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో ఇసుక క్వారీల నుంచి మాత్రమే ఇసుక తీసుకోవాలన్నారు.

సోలార్ భూముల రైతులకు న్యాయం చేస్తాం

గాలివీడు, సెప్టెంబర్ 27: మండలంలోని వెలిగల్లు, తూముకుంట గ్రామాల్లోని సోలార్ ద్వారా భూములు కోల్పోవు రైతులకు ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని కడప ఆర్డీవో చినరాముడు పేర్కొన్నారు. మంగళవారం వెలిగల్లు గ్రామంలో సోలార్‌కు కేటాయించు భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగల్లు గ్రామానికి సంబంధించిన సోలార్‌కు కేటాయించు భూముల వివరాలను తహశీల్దార్ తనకు నివేదించడం జరిగిందన్నారు. తహశీల్దార్ పంపిన రైతుల నివేదికలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు.

రామయ్య సన్నిధిలో మంజునాథ్ కమిటీ సభ్యులు

ఒంటిమిట్ట, సెప్టెంబర్ 27: మంజునాథ్ కమిటీ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కోదండ రాముని దర్శించారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చరిత్రను విశదీకరించారు. అనంతరం మండలంలోని రాచపల్లె గ్రామంలో పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లారు. కమిటీ సభ్యులు గ్రామంలో పర్యటించి అందుబాటులో ఉన్న వారితో కొద్దిసేపు మాట్లాడారు. రాచపల్లెలో ఉన్న దూదేకుల కులస్థులను బీసీలో చేర్చాలని గతంలో కొంతమంది ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.

జిల్లా పర్యాటకరంగం అభివృద్ధికి కృషి

కడప,సెప్టెంబర్ 27: జిల్లాలో ఉన్నతమైన చరిత్ర ఉన్న ఒంటిమిట్ట, సిద్దవటం, గండికోట, అమీన్‌పీర్ దర్గాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ కడప జిల్లా కొండలకు, కోనలకు నిలయమైన ప్రాంతమని, ఎంతో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు, శిల్పసందప ఇక్కడ ఉందన్నారు. ఇక్కడ అతి పురాతన కళలను ప్రదర్శించే కళాకారులున్నారని తెలిపారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

చిన్నమండెం, సెప్టెంబర్ 27: కడప జిల్లా డీఎంహెచ్‌వో రామిరెడ్డి మండలంలో వ్యాధుల పట్ల అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఆయన తెలిపారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీలోని బండకాడ కురవపల్లె, చెరువుముందర కురవపల్లె, దేవగుడిపల్లెలలో గ్రామంలో పర్యటించి డ్రైనేజీ, నీటినిల్వ ఉన్నచోట లార్వాలను చూసి ప్రజలకు ఇలాంటి లార్వాలు లేకుండా చర్యలు చేపట్టాలని, నీరు నిల్వ ఉన్నచోట కిరోసిన్ పోసి లార్వాలను నశించేటట్లు చూడాలని ఆయన అన్నారు. అనంతరం చిన్నమండెం ప్రభుత్వాసుపత్రి యందు డాక్టర్ శారదను రోజు ఆసుపత్రిలో అడ్మిషన్లు, కాన్పులు రోజూ వచ్చు రోగుల గురించి విచారించారు.

రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ

చక్రాయపేట, సెప్టెంబర్ 27: మండలంలోని యర్రగుడి గ్రామం ముద్దప్పగారిపల్లె గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి జూన్ నెలలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఆ రైతు ఆత్మహత్య విచారణపై మంగళవారం ఆర్డీవో చినరాముడు, తహశీల్దార్ నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి నాగమధుసూదన్, వీఆర్‌వో రామచంద్ర, స్థానిక సర్పంచ్ గఫూర్‌లు కలిసి ముద్దప్పగారిపల్లెలో విచారణ చేపట్టారు. విచారణలో పంటల దిగుబడి రాకపోవడంతో అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్న నివేదికను సంబంధిత అధికారులకు పంపనున్నట్లు ఆర్డీఓ చినరాముడు పేర్కొన్నారు.

శెనగ విత్తనాల పంపిణీకి బయోమెట్రిక్ విధానం..

కమలాపురం, సెప్టెంబర్ 27: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రబీసీజన్‌లో రైతులకు పంపిణీచేయనున్న శెనగ విత్తనాల కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెలాఖరులో గాని, వచ్చేనెల మొదటి వారంలో గాని, శెనగ విత్తనాల పంపిణీ ప్రారంభం చేయనున్నారు. గతంలో కొన్ని చోట్ల రైతుల పేరుతో బినాబిదార్లు రైతులనుంచి పాసు పుస్తకాలను సేకరించి విత్తనకేంద్రాల వల్ల కూపన్లు పొంది తదుపరి విత్తనాలను కొనుగోలు చేసి వాటిని అమ్ముకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

రేపు శ్రీకోదండరామయ్యస్వామి ఆరాధన

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 27: కడప నగర సమీపంలోని చింతకొమ్మదినె్న మండలం గోపాలపురం వద్ద వెలసివున్న శ్రీశ్రీశ్రీ కోదండరామయ్యస్వామి ఆలయంలో ఈనెల 29వ తేదిన స్వామివారి 12వ ఆరాధన కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు ఎస్.కొండయ్య, కె.గోవింద రాజస్వామి, కె.వెంకట కేశవయ్యలు మంగళవారం తెలిపారు. స్వామి ఆరాధన సందర్భంగా గురువారం తెల్లవారుజామున నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, మహామంగళస్నానం, తులసీదళాల మహాభిషేకం, ఆకుపూజ, విశేష పూల అలంకరణ, మహానైవేద్యం పూజాది కార్యక్రమాలు ఉంటాయన్నారు. స్వామివారి ఆరాధన కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.

Pages