S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంట్రాక్టు లెక్చరర్లను మోసగించిన ప్రభుత్వం

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 27: కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం మోసం చేసిందని జిల్లా వైసిపి అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో 49వార్డులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నాయకులు నోట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు లెక్చరర్లను అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తానని చెప్పిన ఆయన వారిని మోసం చేశారని దుయ్యాబట్టారు. ఈ కార్యక్రమంలో కడియాల చిన్నబాబు, మురళీ, రావూరి వెంకటేశ్వరరావు, లింగం రవి తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ పదవులకు ఎన్నికలకు ఏర్పాట్లు

ఏలూరు, సెప్టెంబర్ 27 : ఖాళీగా వున్న సర్పంచ్, వార్డుమెంబర్ల పదవులకు త్వరలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిపివో కె సుధాకర్‌ను ఆదేశించారు. ఏలూరు జడ్పీ అతిధిగృహంలో మంగళవారం సాయంత్రం డిపివోతో ఎన్నికల ఏర్పాట్లుపై మంత్రి చర్చించారు. జిల్లాలో ఖాళీగా వున్న సర్పంచ్, వార్డు మెంబరు పదవులను నిర్ణీత కాలవ్యవధిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి కోరారు.

జిల్లాకు వర్ష నష్టం రూ.300 కోట్లు

ఏలూరు, సెప్టెంబర్ 27: జిల్లాలో భారీవర్షాల వల్ల 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, రాబోయే రెండురోజుల్లో గోదావరికి వరద కూడా వచ్చే అవకాశమున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం జిల్లా కలెక్టరుతో భారీవర్షాల పరిస్ధితులపై ఆయన సమీక్షించారు. నిరంతరం వర్షం కురవటం వల్ల రహదారుల వ్యవస్ద పూర్తిగా దెబ్బతిందని, ఎక్కడచూసినా గతుకులతో రోడ్లు నిండిఉన్నాయని మంత్రి చెప్పారు.

గోదా‘వర్రీ!’

భీమవరం, సెప్టెంబర్ 27: అఖండ గోదావరికి ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ధవళేశ్వరం నుంచి ఎక్కువ జలాలను కిందకు విడుదల చేశారు. జిల్లాలోని విజ్జేశ్వరం వద్ద బ్యరేజీ గేట్లను ఎత్తివేశారు. దీంతో గోదావరి జలాలు ఎక్కువ స్థాయిలో కిందకు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ నీటిని విజ్జేశ్వరం నుంచి నందమూరి అక్విడెక్ట్‌కు మళ్లించి చిలకంపాడు లాకుల మీదుగా యండగండి, భీమవరం యనమదుర్రు గుండా సముద్రంలోకి వదిలారు. మరోపక్క పెనుగొండ నుండి గోదావరి వరద జలాలను నరసాపురం సముద్రానికి భారీ స్థాయిలోనే విడుదల చేశారు.

రూ.750 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టులు

ఏలూరు, సెప్టెంబర్ 27: జిల్లాలో ప్రజల సౌకర్యార్ధం భారీ మంచినీటి ప్రాజెక్టులు చేపట్టడానికి 750 కోట్ల రూపాయల వ్యయంతో తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం పంచాయతిరాజ్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ రక్షితమంచినీటి పధకాలు చేపట్టి వేసవిలో కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

ఇలా అయతే మేమెందుకు

ఏలూరు, సెప్టెంబర్ 27: అధికారులు మామాట వినకపోతే ఇక మేమెందుకు, ప్రజాప్రతినిధుల మాట అధికారులు వినేలా ఇన్‌ఛార్జి మంత్రిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఏలూరు ఎంపి మాగంటి బాబు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని కోరారు.

50 ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని 50 దేవాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా భక్తులకు సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ తెలిపారు. ద్వారకాతిరుమల మాధవ కల్యాణ మండపంలో నిర్వహించిన అసిస్టెంట్ కుక్ భర్తీల నిమిత్తం విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులకు వౌలిక వసతులు కల్పించి పచ్చని పరిశుభ్ర వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

బహిరంగ మలవిసర్జన చేస్తే చర్యలు

పెంటపాడు, సెప్టెంబర్ 27: గ్రామంలో ఎక్కడైనా సరే బహిరంగ మల విసర్జన చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పెంటపాడు కాలువ గట్టు పక్కనే స్వచ్ఛ భారత్ నిధులు రూ. 6 లక్షలు, పంచాయతీ నిధులు రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను మంత్రి మాణిక్యాలరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్‌లో మరిన్ని నిధులు ఉన్నాయని, వాటితో అనేక కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్భారత్‌కు శ్రీకారం చుట్టి మరిన్ని నిధులు కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు.

పోటెత్తుతున్న వరద

పోలవరం, సెప్టెంబర్ 27: గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరడంతో మంగళవారం ఉదయం నుండి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులలో నుండి నీరు వదలడంతో గోదావరికి వరద పోటెత్తింది. పోలవరంలోని సిడబ్ల్యూసి కార్యాలయం వద్ద గోదావరి నీటి మట్టం 10.14 మీటర్లకు చేరింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రానికి సుమారు 2మీటర్ల నీటి మట్టం పెరిగినట్టు సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. ఆర్డీవో ఎస్ లవన్న కొత్తూరు కాజ్‌వే వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎగువ ఏజన్సీ గ్రామాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను రేషన్ డిపోల్లో నిల్వ ఉంచినట్టు తెలిపారు.

‘నరకానికి దారి’లో 1870 గోతులు!

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 27: తల్లాడ - దేవరపల్లి రాష్ట్ర రహదారిలో జంగారెడ్డిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు చిన్న పెద్ద కలిపి 1,870 గోతులు పడ్డాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెంల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు విధి నిర్వహణ కోసం నిత్యం వెళ్ళే ఉద్యోగుల్లో ఒకాయన ఈ గోతులను లెక్కపెట్టారు. గోతుల వివరాలు వెల్లడించారు. చిన్న చిన్న గోతుల్లో మోటార్ సైకిళ్ళు పడిపోతుంటే, పెద్ద గోతుల్లో బస్సులు, లారీల ఇరుసులు విరిగిపోయి ఆగిపోతున్నాయని నిత్యం ప్రయాణించే వారు వాపోతున్నారు.

Pages