S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరాల అదుపులో తనదైన ముద్ర

అనంతపురం, జూలై 21 : జిల్లాలో నేరాలు అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌వి.ఎస్పీ రాజశేఖర్‌బాబు తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల పాలనలో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంతో పాటు, అన్ని వర్గాలను సమన్వయ పర్చుకుని పోలీసు శాఖను ప్రగతి పథంలో నడిపించి విజయం సాధించారనడంలో సందేహం లేదు. అంతేగాకుండా ప్రజల భాగస్వామ్యంతో పోలీసుల స్వచ్ఛ భారత్, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్షల్లో మొక్కల పెంపకం తదితర సామాజిక, సేవా కార్యక్రమాలను సైతం చేపట్టి తనదైన ముద్ర వేశారు.

గుంతకల్లులో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి

గుంతకల్లు, జూలై 21 : గుంతకల్లులో పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు హరిహరనాథ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీ బుగ్గ సంఘాల వద్ద పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా గుంతకల్లు స్పినింగ్ మిల్లును తెరిపించి ఉపాధి కల్పించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పిఎం ఆవాస్ యోజన పథకాన్ని అర్హులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సకలాంగులకు దీటుగా రాణిస్తున్న వికలాంగులు

అనంతపురం సిటీ, జూలై 21: ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తూ సకలాంగులకు దీటుగా వికలాంగులు రాణిస్తున్నారని రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత అన్నారు. రాప్తాడు సమీపంలోని టిటిడిసిలో సమర్థనా ట్రస్టు ఆధ్వర్యంలో అంధులకు కంప్యూటర్ విద్యలో శిక్షణా తరగతులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి ఒక్కరు సమాజానికి సేవ చేసి తమ జీవితాలను చరితార్ధం చేసుకోవాలన్నారు. ఏ వ్యవస్థయినా, ఏ వ్యక్తయినా అభివృద్ధి సాధించాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు.

వైభవంగా సాయినాథుని గ్రామోత్సవం

ధర్మవరం రూరల్, జూలై 21: పట్టణంలో గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా గురువారం షిరిడీ సాయినాథుని గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన జానపద కళాకారులు నిర్వహించిన అష్టలక్ష్మిల నాట్యం అందరినీ ఆకట్టుకుంది. గురువారం షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనంలో సాయినాథుడు కొలువుదీరి పట్టణ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ రథాన్ని సేవా సమితి సభ్యులు విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా అలంకరించారు.

‘హోదా’ బిల్లుకు మద్దతు తెలపాలి

అనంతపురంటౌన్, జూలై 21: ఎ.పికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి ప్రారంభమై జెడ్.పి కార్యాలయం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కోటాసత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధి, వాసు, కొండారెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం ఎపికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ప్రకటించాల్సి ఉందన్నారు.

విద్యార్థిని మృతిపై పెల్లుబికిన నిరసనలు

గోరంట్ల, జూలై 21 : పట్టణంలోని శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని తన్మయి సాయి బండ విరిగిపడి మృతి చెందిన ఘటనపై ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా గురువారం స్థానిక ఎస్‌విఆర్ కళాశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేసి కదిరి-హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపారు.

తుంగభద్ర నుంచి ఎల్లెల్సీకి నీరు విడుదల

బళ్లారి, జూలై 21 : తుంగభద్ర జలాశయం నుంచి గురువారం మధ్యాహ్నం ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నేడు హెచ్చెల్సీకి నీరు విడుదల చేస్తామన్నారు. ఎల్లెల్సీకి సంబంధించి గంటగంటకూ 100 క్యూసెక్కులు పెంచుతూ గరిష్టంగా 1300 క్యూసెక్కులు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గురువారం జలాశయంలో 1612.41 అడుగులు, 40072 టిఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్ రంగారెడ్డి, బళ్లారి ఎగ్జిక్యూటివ్ ఇంజినీయర్ విశ్వనాథరెడ్డి, శశిభూషణరెడ్డి, మల్లికార్జున, శివన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

చెనే్నకొత్తపల్లి, జూలై 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చెనే్నకొత్తపల్లి సమీపాన హంద్రీనీవా కాలువ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మస్తాన్‌వలి(32) గ్రామంలో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం తెల్లవారుజామున స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంలో గుట్టూరుకు కోళ్ళను తీసుకురావడానికి బయలుదేరాడు. అయితే చెనే్నకొత్తపల్లి దాటగానే హంద్రీనీవా కాలువ వద్ద వెనుకవైపు నుండి గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్‌వలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

పామిడి, జూలై 21: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు ఉప్పర సూర్యనారాయణ (50) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని దేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి గ్రామస్థులు అందించిన వివరాలిలా వున్నాయి.. వ్యవసాయ పొలంలో పంటను సాగు చేసిన రైతు ఉప్పర సూర్యనారాయణ నీరు పెట్టేందుకు వెళ్ళగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యనారాయణ మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి జరిగిన సంఘటనపై విచారిస్తున్నట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలియజేశారు.

‘పురం’ ప్రభుత్వాసుపత్రిపై దాడి కేసు కొట్టివేత

హిందూపురం, జూలై 21 : 2004లో స్థానిక ప్రభుత్వాసుపత్రిపై దాడి చేసిన కేసును కొట్టివేస్తూ జూనియర్ సివిల్ జడ్జి షేక్ జానీబాషా గురువారం తీర్పు చెప్పారు. దీంతో దశాబ్దం తర్వాత కేసులో ఉన్న ముద్దాయిలకు విముక్తి కలిగినట్లైంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2004లో పట్టణంలోని రహమత్‌పురానికి చెందిన ఆస్మాభాను ప్రసవం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రాగా వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లీబిడ్డ మృతి చెందారు. దీంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని ఆగ్రహావేశాలతో బంధువులు కొందరు ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

Pages