S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపల్లి పీచేముఢ్

పటమట, మే 19: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైకాపా నుంచి టిడిపి సొంత గూటకి చేరారు. గురువారం సాయంత్రం గురునానక్ నగర్ ఎన్‌ఏసి కల్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి పార్టీ జెండాను కొత్తపల్లి సుబ్బారాయుడి మెడలో వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పుట్టి, పెరిగిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ సొంత గూటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

పుష్కరాల్లో డేగకన్ను భద్రత

విజయవాడ (క్రైం), మే 19: రానున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు గురువారం సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. నగరానికి వచ్చిన ఆయన డిజిపి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కృష్ణా పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నందున అందుకు తగిన రీతిలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై నిశితంగా చర్చించారు.

వణికిస్తున్న ‘రోను’

విజయవాడ, మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘రోను’ తుపానుగా మారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీరప్రాంత గ్రామవాసులను గజగజలాడిస్తున్నది. దీనికితోడు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మరింత అలజడి వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్, కృత్తివెన్నుకు సమీపంలోని పెదగొల్లపాలెం బీచ్‌లలో సముద్రపునీరు సుమారు 20 మీటర్లు ముందుకు రావడంతో రెవెన్యూ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా తీరప్రాంతాలలో గస్తీని తీవ్రతరం చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవులలో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఈ దశాబ్దం జీవశాస్త్రానిదే

హైదరాబాద్, మే 19: హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సిఎస్‌ఐఆర్) నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంస్థలో పనిచేస్తున్న పలువురు సీనియర్ శాస్తవ్రేత్తలు వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం సిసిఎంబిలో జరుగుతున్న పలు పరిశోధనలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన శాస్తవ్రేత్తలతో మాట్లాడుతూ ఈ దశాబ్దం జీవశాస్త్రానిదేనని వ్యాఖ్యానించారు.

నకిలీ ఫోన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ఖైరతాబాద్, మే 19: బ్రాండెడ్ సెల్‌ఫోన్లంటూ నకిలీ సెల్‌ఫోన్లను వినియోగదారులకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 21 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను ఎసిసి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన డి.నరేంద్ర (25) నగరంలోని మియాపూర్‌లో ఉంటూ సెల్‌ఫోన్ రిపేరింగ్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆకాంక్షతో కలకత్తాలో నకిలీ సెల్‌ఫోన్లు విక్రయించే ప్రాంతానికి వెళ్లి బ్రాండెడ్‌కు తీసిపోని విధంగా ఉండే నకిలీ సెల్‌ఫోన్లను తీసుకువచ్చేవాడు.

ఆవులను తరలిస్తున్న డిసిఎం పట్టివేత

మేడ్చల్, మే 19: నిబంధనలకు వ్యతిరేకంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న ఓ డిసిఎం వాహనాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుండి నగరంలోని బహదూర్‌పురా ప్రాంతంలోని కబేళాకు డిసిఎం వాహనంలో 28 ఆవులను తరలిస్తున్నారు. మేడ్చల్ చెక్‌పోస్టు ప్రాంతం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డిసిఎం డ్రైవర్ సిద్ధిప్రేమ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని ప్రశ్నించగా వివరాలను తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు డిసిఎం స్వాధీనం చేసుకుని ఆవులను నగరంలోని జియగూడ ప్రాంతంలో గల కామధేను గోశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాల్య వివాహాన్ని ఆపిన అధికారులు

వికారాబాద్, మే 19: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లికి చెందిన హర్షబేగం, ఖాజాపాష కూతురు(16) జిల్లా పరిషత్ పాఠశాలలో పదోతరగతి పాసైంది. ఈనెల 26న హైదరాబాద్‌కు చెందిన అబ్బాయితో వివాహం చేయాలని ప్రయత్నించారు. విషయం చైల్డ్‌లైన్‌కు 1098కు చేరడంతో ఆర్‌ఐ సాయన్న, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ రామేశ్వర్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ బాలిక ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించి పెళ్ళి చేయకూడదని చెప్పారు. అనంతరం వికారాబాద్ తహశీల్దారు కార్యాలయానికి తల్లి, అన్నయ్యలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి పెళ్ళి చేయకూడదని సూచించారు. పెళ్ళి చేయబోమని వారిచే రాత పూర్వకంగా రాయించుకున్నారు.

ఓయులో ఛలో అసెంబ్లీకి పిలుపు

నాచారం, మే 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుతుందని విద్యార్థి నేత కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఈడి, డిఎస్‌సి పరీక్షల నిర్వహణను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని తెలిపారు. దీనికి నిరసనగా ఓయులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. దీంతో భారీగా పోలీసులు చేరుకుని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు.

గాలిలో దీపం ..ప్రజారోగ్యం

హైదరాబాద్, మే 19: ప్రస్తుతమున్న మహానగరంలో నేటికీ ప్రజారోగ్య పరిరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా మహానగర పాలక సంస్థ పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బగా తయారైంది. ఆహారవిక్రయ కేంద్రాలపై నిఘా పెట్టాల్సిన సిబ్బంది ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నగరంలో రోడ్డుపక్కన వెలుస్తున్న చిల్లర వ్యాపారాలు నిబంధనలకు విరుద్ధంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వ్యాధుల భయం పొంచి ఉన్నా, ప్రజారోగ్య పరిరక్షణ గాలిలో దీపంలా మారింది.

ఎర్రగుంట అభివృద్ధిపై సిఎం హామీకి ఏడాది పూర్తి

సైదాబాద్, మే 19: నాలుగు నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని ఎర్రగుంట చెరువు, శ్మశానవాటికల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎర్రగుంటను ప్రత్యక్షంగా వీక్షించి అప్పటికప్పుడు బహిరంగంగా ఇచ్చిన అభివృద్ధి హామీకి ఏడాది పూర్తి అవుతోంది.

Pages