S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రంగాల్లో పరిగి అభివృద్ధి

పరిగి, మే 19: నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని చేవెళ్ళ ఎంపి కొండా విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణంలోని రోడ్, సయ్యద్‌పల్లి గ్రామాంలోని సిసి రోడ్లకు మురుగు కాలువల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపి నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిబాటలో తీసుకు వెళతానని అన్నారు. 75 లక్షల రూపాయలతో పరిగిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని చెప్పారు. టిఆర్‌ఎఏస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసిఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

కాంగ్రెస్ భూస్థాపితం ఖాయం

హైదరాబాద్, మే 19: అసోంలో విజయంపై తెలంగాణ బిజెపి రాష్ట్ర కమిటీ భారీ ఎత్తున సంబురాలు నిర్వహించింది. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను తరిమికొట్టండి అంటూ ఆనాడు బిజెపి పిలుపునిచ్చిందని అదే నేడు దేశవ్యాప్తంగా జరుగుతోందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని లక్ష్మణ్ చెప్పారు.

‘న్యాయాధికారుల కేటాయింపులో అన్యాయం’

హైదరాబాద్, మే 19: హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం, ఆంధ్రా సబార్డినేట్ న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడంపై జోక్యం చేసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గండ్ర మోహన్‌రావు గవర్నర్‌ను కలిసి కోరారు. తెలంగాణ న్యాయవాదులు గురువారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

నటుడు రవితేజకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా

హైదరాబాద్, మే 19: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటేనని నిరూపించుకున్న నగర పోలీసులు తాజాగా ప్రముఖ సినీ నటుడు రవితేజకూ జరిమానా విధించారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారణంగా పోలీసులు ఏడు వందల రూపాయలు చలానా విధించారు. తాజాగా మాస్ రాజా రవితేజ కూడా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో ప్రయాణిస్తుండగా జూబ్లిహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారున ఆపి బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి రూ. 800లు ఫైన్ వేశారు. రవితేజ రాకతో అక్కడ కాస్త సందడి నెలకొంది.

ప్రైవేట్ క్రిస్టియన్ మైనార్టీ డిగ్రీ కాలేజీలు అడ్మిషన్లను సొంతంగా నిర్వహించుకోవచ్చు: హైకోర్టు

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ క్రిస్టియన్ మైనార్టీ డిగ్రీ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వ నోటిఫికేషన్‌తో సంబం ధం లేకుండా ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు జరుపుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రప్రభుత్వం మే 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు జరపాలంటూ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాజధానిలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఫర్ వుమెన్‌తో పాటు మరో 11 కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కేసులో పిటిషనర్ల తరఫున ఎస్ శ్రీరాం అనే న్యాయవాది వాదనలు వినిపించారు.

అంతా రామమయం..

హైదరాబాద్, మే 19: భద్రాచల రామచంద్రుడిని కీర్తిస్తూ భక్తరామదాసు రాసిన కీర్తనలకు ప్రాచుర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రామదాసు కీర్తనల పోటీలను నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక) డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ సౌజన్యంతో శ్రీకోదండపాణి సంగీత విద్యాసంస్థ నిర్వహించే ‘అంతా రామమయం’ (్భక్తరామదాసు కీర్తనల పోటీల కార్యక్రమం) బ్రోచర్‌ను సచివాలయంలో గురువారం ఆయన విడుదల చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని కీర్తిస్తూ అన్నమయ్య రాసిన కీర్తనలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి.

ప్రైవేట్ కాలేజీల తనిఖీకి పోలీసుల సహాయం తీసుకోవద్దు

హైదరాబాద్, మే 19: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలను విద్యాశాఖ సిబ్బంది మాత్రమే తనిఖీ చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ యూనిఫాంలో ఉన్న పోలీసులను వెంట తీసుకెళ్లరాదని, ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రైవేట్ కాలేజీల తనిఖీలో పోలీసుల సహాయాన్ని విద్యాశాఖాధికారులు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ గౌతమి, విజ్ఞాన్ డిగ్రీ కాలేజీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

హైదరాబాద్, మే 19: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తెరాస గెలుపుతో రాష్ట్ర మంత్రుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ తెరాస విజయం సాధిస్తూ వస్తుండటంతో ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రులు భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఈశాన్యాన విరిసిన కమలం

హైదరాబాద్, మే 19:‘చిదిమెకొద్ది ఎదిగనంట.. కోసెకొద్ది పూసెనంట’ అన్న గీతం ఇప్పుడు బిజెపి విషయంలో నిజమయింది. ఢిల్లీ, బిహార్ ఓటమితో డీలాపడిన కమలం ఇప్పుడు ఈశాన్య దేశంలో పాదం మోపింది. దక్షిణ భారతంలోని కర్నాటకలో పాగా వేయడానికి తీసుకున్న సమయం కంటే ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో అధికారం చేజిక్కించుకునేందుకు తీసుకున్న సమయం తక్కువ. కర్నాటకలో అధికారంలోకి వచ్చేందుకు 15 సంవత్సరాలు పట్టింది. అయితే ‘ఎర్రకోట’ల్లో పాగా వేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనప్పటికీ, కేరళలో ఒకటి, పశ్చిమ బెంగాల్‌లో 6 సీట్లతో భవిష్యత్తుపై ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రధానంగా అసోంలో బిజెపి విజయం ప్రత్యర్ధి పార్టీలను నివ్వెరపరిచింది.

నోరి నరసింహశాస్ర్తీ ట్రస్టు ఆధ్వర్యంలో జూలై 16న గురు పురస్కారాల ప్రదానం

హైదరాబాద్, మే 19: నోరి నరసింహ శాస్ర్తీ ట్రస్టు ఆధ్వర్యంలో జులై 16న గురు పురస్కారాల ప్రదానోత్సవ సభ జరుగుతుందని ట్రస్టు ఉపాధ్యక్షుడు నోరి శివసేనాని ఒక ప్రకటనలో తెలిపారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించే ఈ ప్రదానోత్సవ సభలో బ్రహ్మశ్రీ ఎంవిఆర్ శర్మకు వేదవ్యాస పురస్కారం, దువ్వూరి సుబ్బలక్ష్మికి జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య పురస్కారం అందజేయబడుతుందని ఆయన వివరించారు. అదేవిధంగా పన్నాల కృష్ణ సుబ్రహ్మణ్యంకు శుశ్రుత వైద్య పురస్కారం, పాలకుర్తి రామమూర్తికి కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ సాహిత్య పురస్కారం, సుద్దాల సుధాకరతేజకు విశ్వకర్మ పురస్కారం అందజేయబడుతుందని తెలిపారు.

Pages