S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/23/2020 - 23:24

ఆక్లాండ్, జనవరి 23: న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా మంచొళ్లని, వారితో ఆడడాన్ని మేం ఆస్వాదిస్తామని టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై కోహ్లీ సేన 18 పరుగుల తేడాతో ఓడిపోయన సంగతి తెలిసిందే. అయతే అందుకు ప్రతీకారం తీర్చుకుం టారా?

01/23/2020 - 06:15

ఓవల్: న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్ గెలుపుతో ఆరంభించింది. బుధవారం జరిగిన మొదటి అనధికార వనే్డలో కివీస్ ఏ జట్టుపై భారత్ ఏ విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిం ది. అయితే మొదటి వికెట్‌కు 51 పరుగులు జోడించిన కివీ ఓపెనర్లు జార్జ్ వర్కర్, రచిన్ రవీంద్ర జట్టుకు మంచి ఆరంభాన్ని అందిం చారు.

01/22/2020 - 23:34

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన సందడి చేస్తోంది. సుదీర్ఘ పర్యటన కోసం సోమవారమే న్యూజిలాండ్ విమానం ఎక్కిన భారత జట్టు బుధవారం జిమ్‌లో సాధన చేసింది. అనంతరం కెప్టెన్ కోహ్లీ సహచరులు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మనీష్ పాండేతో కలిసి ఆక్లాండ్ విధులోల సరదాగా గడిపారు. అనంతరం ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫొటోను కోహ్లీ తన ట్విటర్‌లో షేర్ చేశాడు.

01/22/2020 - 23:32

'చిత్రం... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో కలిసి బుధవారం రాంచీలో సోలార్ పవర్ ఫెసిలిటీ, సీ3 ఫిట్‌నెస్ హబ్, అప్‌టౌన్ కేఫ్ ప్రారంభోత్సవానికి హాజరైన టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని

01/22/2020 - 23:29

వాంఖడే, జనవరి 22: రంజీ ట్రోఫీలో భాగంగా యూపీతో జరిగిన మ్యాచ్‌ను ముంబయి డ్రా చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి ముందు గా బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ జట్టు 8 వికెట్లు కోల్పోయ 625 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆకాశ్ దీప్‌నాథ్ (115) సెంచరీకి తోడు వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (203) డబుల్ సెంచరీ చేశాడు.

01/22/2020 - 23:26

హరారే, జనవరి 22: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్ (200, నాటౌట్) డబుల్ సెంచరీకి తోడు కుశల్ మెండిస్ (80), ధనుంజయ డిసిల్వా (63), నిరోషన్ డిక్వెల్లా (63) అర్ధ సెంచరీలు సాధించడంతో జిం బాబ్వేతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయ 515 పరుగుల వద్ద ఇ న్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు తొలి ఇన్నిం గ్స్‌లో జింబాబ్వే 358 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

01/22/2020 - 02:03

సిడ్నీ: టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో కోచ్‌గా కనిపించనున్నాడు. ఆస్ట్రేలియా లో కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించే బుష్ ఫైర్ క్రికెట్ బాష్ లీగ్ లో సచిన్ కోచ్‌గా తన సేవలను అందించనున్నాడు. ఈ లీగ్ పాంటింగ్ ఎలెవన్, షేన్‌వార్న్ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహి స్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సీఈవో కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు.

01/21/2020 - 23:18

బ్లోమ్‌ఫొంటెన్, జనవరి 21: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టా రు. మంగళవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అంతకుముందు టాస్ ఓడిన జపాన్ రవి బిష్ణోయి, కార్తీక్ త్యాగి దెబ్బకు 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. జపాన్ బ్యా ట్స్‌మెన్ల స్కోరు వరుసగా 1, 7, 0, 0, 0, 0, 0, 7, 5, 1, 1 ఉంది.

01/21/2020 - 23:15

న్యూఢిల్లీ, జనవరి 21: వచ్చే నెల లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దూర మైనట్లు తెలుస్తోం ది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివ రి వనే్డలో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయ పడ్డాడు. దీంతో ఎడమ భుజానికి తీవ్రంగా గాయం కావడంతో మధ్య లోనే మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయతే తాజాగా న్యూజిలాండ్ పర్య టనకు వెళ్లే జట్టుతో ధావన్ లేకపో వడం దీనికి మరింత బలాన్ని చే కూర్చింది.

01/21/2020 - 23:13

'చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌లో జపాన్ ఆటగాడు టసుమా ఇటోతో తలపడుతున్న భారత టెన్నిస్ క్రీడాకారుడు ప్రజ్నేష్ గుణేశ్వరన్.

Pages