-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, జనవరి 27: ఎన్‌బీఏ లెజెండ్ కోబె బ్రియాంట్ అకాల మరణం పట్ల ప్రపంచ క్రికెట్ రంగం సోమవారం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ నివాళులు అర్పించారు. ఈ వార్త తమనెంతగానో కలచివేసిందని, 41 సంవత్సరాల్లో బ్రియాంట్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించాడన్నారు.
మనీలా, జనవరి 27: పిలిపీన్స్‌లో ఆదివారం ప్రారంభించిన ఓ కొత్త కమ్యూనిటీ సెంటర్, బాస్కెట్ బాల్ కోర్టుకు దివంగత కోబె బ్రియాంట్ పేరు పెట్టారు. బ్రియాంట్ తన కుమార్తెతో సహా హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన కొన్ని గంటల వ్యవధిలోనే అతనికి అరుదైన గౌరవం లభించడం విశేషం. ఆ కమ్యూనిటీ సెంటర్ కం బాస్కెట్‌బాల్ కోర్టుకు ‘హౌస్ ఆఫ్ కోబె’గా నామకరణం చేశారు.
మెల్బోర్న్, జనవరి 27: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌లో మ్యాచ్ విన్నింగ్ సామర్ధ్యాలు పుష్కలంగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్, ఢిల్లీ ఐపీఎల్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కితాబిచ్చాడు. అతను తిరిగి రెట్టించిన ఉత్సాహంతో జట్టులోని తొలి 11 మందిలో ఒకడుగా వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
లాహోర్, జనవరి 27: బంగ్లాదేశ్-పాకిస్తాన్ జట్ల మధ్య సోమవారం నాడిక్కడ జరగాల్సిన మూడో టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రద్దు అయింది. రోజంతా వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌కు అనుకూలించకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సిరీస్‌ను ఆతిధ్య పాక్ జట్టుకు 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకుంది.
జోహాన్స్‌బర్గ్, జనవరి 27: బౌలర్లు క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతులతో దక్షిణాఫ్రికా ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించడంతో సిరీస్‌లో నాలుగవది, చివరిది అయిన టెస్టు మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు సాధించింది. సిరీస్ విజయంపై కనే్నసింది. ఇక్కడి వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో సోమవారం లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
మెల్బోర్న్, జనవరి 27: రెండు సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన గార్బెయిన్ ముగురుజా ఆస్ట్రేలియా ఓపెన్‌లో మళ్లీ మునుపటి ఫాంను ప్రదర్శించింది. తొమ్మిదో సీడ్ కికీ బెర్టన్స్‌ను 68 నిమిషాల్లోనే ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం అన్‌సీడెడ్‌గా ఉన్న ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి 6-3, 6-3 సోరుతో ఓడించింది.
అక్లాండ్, జనవరి 27: భారత మహిళల హాకీ జట్టు న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా సోమవారం నాడిక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో 1-2 స్కోరుతో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్ డెవలప్‌మెంట్ స్క్వాడ్ జట్టును భారత జట్టు 4-0 స్కోరుతో ఓడించడం జరిగింది. కాగా సోమవారం రెండో మ్యాచ్‌ను న్యూజీలాండ్ జట్టు దూకుడుగా ఆరంభించింది. అటాకింగ్‌తో ఆరంభ కార్వర్టర్‌లో ఓ పెనాల్టీ కార్నర్‌ను సాధించింది.
ఆక్లాండ్: న్యూజిలాండ్ సొంతగడ్డపై కోహ్లీసేన వరుసగా మరో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివా రం జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి పరుగు లు తీసేందుకు ఇబ్బంది పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయ కేవలం 132 పరుగులకు మాత్రమే పరిమి తమైంది.
క్రిస్ట్‌చర్చ్, జనవరి 26: మార్క్ చాప్మాన్ అజేయ సెంచరీకి తోడు టాడ్ అస్టిల్ అర్ధ సెంచరీ తొడవడంతో న్యూజిలాండ్ ఏ జట్టు భారత్ ఏ జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మూడో అనధికార వనే్డలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 270 పరుగులు చేసింది. మార్క్ చాప్మాన్ (110, నాటౌట్), టాడ్ అస్టిల్ (56) రాణించారు.
'చిత్రం...*మెల్‌బోర్న్‌లో ఏడో రోజు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ సింగిల్స్ మ్యాచ్‌లో హంగేరీ ఆటగాడు మార్టన్ ఫుసోవిక్స్‌తో తలపడుతున్న స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.