S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/28/2018 - 01:31

పూణె, ఏప్రిల్ 27: శనివారం ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చావోరేవో అనే రీతిలో తలపడక తప్పదు. ఇప్పటికే మనుగడకోసం పోరాడుతున్న ముంబై ఇండియిన్ జట్టుకు ఇది అత్యంత కీలక మ్యాచ్ కానున్నది.

04/28/2018 - 01:30

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఐపీఎల్ సీజన్‌లో అంకిత్ రాజ్‌పుత్ నూతన రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించి పంజాబ్ అటగాళ్ల మనుసులో నిలిచిపోయాడు. అంతేకాకుండా ఐదు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

04/28/2018 - 01:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు జరిగిన క్రికెటర్ల వేలంలో విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను కొనుగోలు దాదాపు అసాధ్యమనిపించిందని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజ్ సహ-యజమాని నెస్ వాడియా వెల్లడించారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజ్ దాదాపు రూ.67.5 కోట్లతో క్రికెట్ ఆటగాళ్ల వేలంలో పాల్గొంది.

04/28/2018 - 01:58

హైదరాబాద్, ఏప్రిల్ 28: నెమార్ జూనియర్స్ 5-ఏ సైడ్ జాతీయ సాకర్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు నిరుటి చాంపియన్ హైదరాబాద్ స్పోర్టింగ్ ఫుట్‌బాల్ క్లబ్ దూసుకెళ్లింది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన నగరాలలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫైనల్‌కు అర్హత పొందాయి. జాతీయ స్థాయి 5-ఏ సైడ్ సాకర్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా మారింది.

04/28/2018 - 01:23

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆశించిన రీతిలో ఫీల్డింగ్, బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొంప ముంచిందని కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్, సన్‌రైజర్స్ బౌలర్లు చక్కటి బౌలింగ్ పటిమను ప్రదర్శించడంతో ఓటమి పాలయ్యాం. సరైన సమయంలో రాణిస్తామన్న నమ్మకం ఉంది.

04/28/2018 - 01:22

హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రతిష్టాత్మకమైన హసీనా స్మారక ప్రథమ గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో అమెరికా, మలేషియా, మాల్దీవులుతో పాటు భారత్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి క్యారమ్ క్రీడాకారులు టోర్నమెంట్ ప్రత్యేక అకర్షణగా నిలువనున్నారు.

04/27/2018 - 04:09

న్యూఢిల్లీ: టెన్నిస్ సింగిల్స్ విభాగంలో అగ్రపథాన కొనసాగుతున్న యుకీ భామ్రి, డబుల్త్ విభాగంలో రాణిస్తున్న రోహన్ బోపన్నలకు అర్జున అవార్డుల కోసం ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఇద్దరు టెన్నిస్ క్రీడారుల పేర్లను ప్రతిపాదించిన విషయాన్ని ఏఐటీఏ సెక్రెటరీ జనరల్ హిరణ్మయి ఛటర్జీ స్పష్టం చేశాడు.

04/27/2018 - 01:12

* కోహ్లీకి ఖేల్ రత్న, గవాస్కర్‌కు ధ్యాన్‌చంద్ * కేంద్రానికి బీసీసీఐ ప్రతిపాదనలు

04/27/2018 - 00:50

కోల్‌కతా, ఏప్రిల్ 26: అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) నిర్వహించే ట్రోఫీల్లో చాంపియన్‌స ట్రోఫీ ఒకటి. అయతే, ఆ వనే్డ ట్రోఫీ ఇకనుంచి కనిపించే అవకాశాలు లేనట్టే. 50 ఓవర్ల చాంపియన్ ట్రోఫీని 2021 చాంపియన్ ట్రోఫీ వరల్డ్ టీ-20గా మార్చుతున్నట్టు ఐసీసీ తాజాగా నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయంతో చాంపియన్ ట్రోఫీ స్థానంలో రెండు వరల్డ్ టీ20లు జరపనున్నారు.

04/27/2018 - 00:48

బెంగళూరు, ఏప్రిల్ 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు వైఫల్యం చెందడంతో రాయల్ చాలెంజర్స్ ఓటమిపాలైందని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో లయ తప్పిన బౌలర్లు, మ్యాచ్ చివర్లో అత్యధికంగా పరుగులివ్వడంతోనే జట్టు ఓటమి పాలైందని చెప్పాడు.

Pages