S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/19/2018 - 02:20

* సమష్టిగా రాణించిన దినేష్ కార్తీక్ సేన * అజింక్య రహానే, డీఆర్సీ షార్ట్ శ్రమ వృథా
జైపూర్, ఏప్రిల్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇక్కడి సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది.

04/18/2018 - 04:03

ముంబయి, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ జట్టు 46 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.

04/18/2018 - 04:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల నిర్వహించిన కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకుని స్వదేశానికి చేరుకున్న క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది.

04/18/2018 - 03:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రానున్న రోజుల్లో భారత క్రికెట్‌కు ఆశాకిరణాలుగా మారనున్న దాదాపు 23 మంది యువ క్రికెటర్లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దృష్టి సారించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 23 మంది యువ క్రికెటర్లపై పని భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనుంది.

04/18/2018 - 03:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న రేప్ సంఘటనలు తమను ఎంతో బాధిస్తున్నాయని భారత బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ సభ్యురాలు ఎం.సి.మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి దారుణ సంఘటనలు తన హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయని, ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నామనే బాధ మరో పక్క వేధిస్తోందని ఆమె వాపోయింది.

04/18/2018 - 03:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బర్మింగ్‌హామ్‌లో 2022 సంవత్సరంలో నిర్వహించే తదుపరి కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ అంశాన్ని పునరుద్ధరించకుంటే ఆ పోటీలను భారత్ బహిష్కరించాలని జాతీయ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ పిలుపునిచ్చాడు.

04/18/2018 - 03:34

ముంబయి, ఏప్రిల్ 17: ముంబయిలోని ఒక గల్లీలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు. ఓస్..అంతేనా అనుకోకండి...గల్లీ క్రికెట్ ఆడుతున్న యువకులతో కలసి బ్యాటింగ్ కూడా చేశాడండి. దీనిని మీరు నమ్మండి...నమ్మకపోండి...ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోందంటే అంతా నమ్ముతారు.

04/18/2018 - 03:32

కోల్‌కతా, ఏప్రిల్ 17: భారత మీడియం పేస్ బౌలర్ మహ్మద్‌కి కష్టాల మీద కష్టాలు పడి వస్తున్నాయి. గృహహింస చట్టం కింద అతని భార్య హసీన్ జహాన్ అలీపుర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో కోల్‌కతా పోలీసులు షమీకి సమన్లు జారీ చేశారు. షమీతోపాటు అతని సోదరుడు హసిబ్ అహ్మద్‌ను విచారణ కోసం తమ ఎదుట బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు.

04/17/2018 - 13:03

కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ మొహ్మద్ షమికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు మధ్యాహ్నాం 2 గంటలకు విచారణకు హాజరు కావాలన్నారు. క్రికెటర్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. గృహి హింస చట్టం కింద ఆమె కేసును ఫైల్ చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా హాజరుకావాలంటూ షమికి పోలీసులు సమన్లు ఇచ్చారు.

04/17/2018 - 04:33

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన ఇండియ న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా 71 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 201 ప రుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ 129 పరుగులకే కుప్పకూలిం ది.

Pages