S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/13/2017 - 01:09

చెన్నై, సెప్టెంబర్ 12: టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు తమదైన శైలిలో సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ముందు మంగళవారం చెన్నైలో జరిగిన ఏకైక సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 103 పరుగుల తేడాతో ఆతిథ్య బోర్డు ప్రెసిడెండ్స్ ఎలెవెన్ జట్టును మట్టికరిపించి సత్తా చాటుకుంది.

09/13/2017 - 01:07

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) గోస్వామి (బి) కుషాంగ్ పటేల్ 64, హెచ్‌డబ్ల్యుఆర్.కార్ట్‌రైట్ (సి) గురుకీర్త్ సింగ్ (బి) ఆవేశ్ ఖాన్ 0, స్టీవ్ స్మిత్ (సి) గురుకీర్త్ సింగ్ (బి) వాషింగ్టన్ సుందర్ 55, ట్రవిస్ హెడ్ (సి) సందీప్ శర్మ (బి) కార్నేవర్ 65, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) వాషింగ్టన్ సుందర్ 14, మార్కస్ స్టొయినిస్ (సి) త్రిపాఠీ (బి) ఖెజ్రోలియా 76, మాథ్యూ వేడ్ (బి) కుషాంగ్ పటేల్

09/13/2017 - 02:04

ఇటావా, సెప్టెంబర్ 12: భారత క్రికెటర్ సురేష్ రైనా తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. టీమిండియాలో చోటు కోల్పోయినప్పటికీ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఇండియా బ్లూ జట్టుకు సారథ్యం వహిస్తున్న రైనా కాన్పూర్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు తన రేంజ్ రోవర్ కారులో మంగళవారం ఘజియాబాద్ నుంచి బయలుదేరాడు.

09/13/2017 - 01:04

ఆంట్వెర్ప్ (బెల్జియం), సెప్టెంబర్ 12: బెల్జియం పురుషుల జూనియర్ జట్టుతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దీటుగా తలపడింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగించింది. ఆరంభం నుంచే ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగినప్పటికీ ఫస్ట్ క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోయాయి. అయితే 19వ నిమిషంలో స్టాన్ బ్రానికీ సాధించిన గోల్‌తో బెల్జియం జట్టు ప్రథమార్థం ముగిసే సమయానికి 1-0 గోల్ ఆధిక్యతలో నిలిచింది.

09/13/2017 - 01:02

ముంబయి, సెప్టెంబర్ 12: భారత క్రికెట్ జట్టుకు 2006-07 అత్యంత దారుణమైన సమయమని, అది ఓ పీడకల లాంటిదని , ఆ సమయంలో జట్టు అట్టడుగు స్థాయికి చేరుకుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ అభిప్రాయ పడ్డారు. వెస్టిండీస్‌లో జరిగిన 2007 ప్రపంచ కప్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన తర్వాత భారతజట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, అవన్నీ భారీ సత్ఫలితాలనిచ్చాయని కూడా ఆయన అన్నాడు.

09/13/2017 - 01:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: 2015లో డేవిస్ కప్ ప్లే ఆఫ్స్ దశలో భారత్ ఓటమి పాలయిన చెక్ రిపబ్లిక్ జట్టుకన్నా ప్రస్తుత కెనడా జట్టు బలమైనదని భారత డేవిస్ కప్ జట్టు కెప్టెన్ మహేశ్ భూపతి అభిప్రాయ పడ్డాడు. న్యూయార్క్‌లో వారం రోజుల పాటు శిక్షణ అనంతరం వరసగా నాలుగోసారి వరల్డ్ గ్రూపునకు క్వాలిఫైకావడం కోసం భారత జట్టు కెనడాను ఢీకొనేందుకు మంగళవారం ఎడ్మంటన్‌ను చేరుకొంది.

09/13/2017 - 01:00

లాహోర్, సెప్టెంబర్ 12: చాలా కాలం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ మంగళవారం ఇక్కడ ఏడు దేశాల ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవెన్ జట్టుతో జరిగిన మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌లో విజృంభించి ఆడింది. 20 పరుగుల తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి సత్తా చాటుకుంది.

09/13/2017 - 00:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: నాయకత్వం విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ సమానులేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. అయితే వన్‌డే బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ స్మిత్‌కన్నా కాస్త మెరుగని, స్మిత్ టెస్టుల్లో కోహ్లీకన్నా మెరుగని ఆయన అన్నాడు. ‘విరాట్ మెరుగైన వన్‌డే బ్యాట్స్‌మన్, స్మిత్ టెస్టుల్లో మెరుగైన వాడు. కెప్టెన్సీ విషయానికి వస్తే ఇద్దరూ సమానులే.

09/13/2017 - 00:57

సియోల్, సెప్టెంబర్ 12: కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తన పోరాటాన్ని విజయవంతంగా ప్రారంభించాడు. సియోల్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను చైనీస్ తైపీకి చెందిన లిన్ యు హియెన్, కన్ చావో యు (తైవాన్)పై వరుస విజయాలు సాధించి మెయిన్ డ్రాలో ప్రవేశించాడు.

09/12/2017 - 01:00

న్యూయార్క్, సెప్టెంబర్ 11: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, క్లే కోర్టు స్పెషలిస్టు రాఫెల్ నాదల్ గ్రాస్ కోర్టులోనూ రాణించే సత్తా తనకు ఉందని నిరూపించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్‌ను 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ‘స్పెయిన్ బుల్’ కెరర్‌లో 16వ గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిల్‌ను అందుకున్నాడు. యుఎస్ ఓపెన్‌లో అతను విజేతగా నిలవడం ఇది మూడోసారి.

Pages