S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/10/2017 - 00:33

గోల్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), సెప్టెంబర్ 9: కామనె్వల్త్ యూత్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్లు మొత్తం 34 కొత్త రికార్డులను నమోదు చేయగా, 105 కిలోల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 342 కిలోల బరువునెత్తి స్వర్ణ పతకం సాధించాడు. తద్వారా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదించాడు. గురుదీప్ సింగ్ 371 కిలోలతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

09/09/2017 - 00:47

న్యూఢిల్లీ, సెప్టంబర్ 8: క్రీడాశాఖ మంత్రిగా ఏస్ షూటర్, ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే, భారత హకీ జట్టు చీఫ్ కోచ్‌గా సుయర్డ్ మరిన్‌ను ఎంపిక చేసింది. అతను 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసే వరకూ చీఫ్ కోచ్‌గా కొనసాగుతాడు. ప్రస్తుతం అతను భారత మహిళల జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.

09/09/2017 - 00:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: లోధా కమిటీ సూచనలకు అనుగుణంగా వివిధ అంశాలను చేయాల్సిన మార్పులు, చేర్పులతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి కొత్త నిబంధనావళికి పాలనాధికారుల బృందం (సిఒఎ) ఒక రూపాన్నిచ్చింది. ఈనెల 11న సుప్రీం కోర్టుకు ముసాయిదాను సమర్పించనుంది. సుప్రీం కోర్టు ఆమోద ముద్ర పడితే, లోధా సిఫార్సుల అమలుకు ఇన్నాళ్లూ ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

09/09/2017 - 00:44

ఏథెన్స్ (గ్రీస్)లో జరుగుతున్న ప్రపంచ కెడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 56 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత రెజ్లర్ సోనమ్ మాలిక్. తుది పోరులో అతను జపాన్‌కు చెందిన సెనా నాగమోటోను 3-1 తేడాతో చిత్తుచేశాడు

09/09/2017 - 00:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: భారత హాకీ జట్టు కోచ్‌గా రొలాంట్ ఆల్ట్‌మన్స్ స్థానాన్ని సుయన్ మరిన్‌తో భర్తీ చేయడంపై మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ విమర్శలు కురిపించాడు. ఇది ఏకపక్ష నిర్ణయమని, దీనికి ఎలాంటి హేతుబద్ధత లేదని ఒక ప్రకటనలో విమర్శించాడు. పురుషుల జట్టుకు కోచ్‌గా సేవలు అందించిన అనుభవం మారిన్‌కు లేదని అజిత్ పాల్ సింగ్ గుర్తుచేశాడు.

09/09/2017 - 00:41

న్యూయార్క్, సెప్టెంబర్ 8: కెరీర్‌లో ఐదోసారి యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అందుకోవాలనుకున్న అమెరికాకు చెందిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. తన దేశానికే చెందిన స్లొయెన్ స్టెఫెన్స్ చేతిలో వీనస్ 1-6, 0-6, 5-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కాగా, ఈసారి టైటిల్ పోరులో స్టెఫెన్స్ తన సహచరురాలు మాడిసన్ కీస్‌ను ఢీ కొంటుంది.

09/09/2017 - 00:37

జొహానె్నస్‌బర్గ్, సెప్టెంబర్ 8: దక్షిణాఫ్రికా టెన్నిస్ ఆటగాడు కెవిన్ ఆండర్సన్ రాత్రికి రాత్రే సంచలన క్రీడాకారుడన్న ముద్ర వేయించుకున్నాడు. న్యూయార్క్‌లో జరుగుతున్న యుఎస్ ఓపెన్ పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికా ఆటగాడు శామ్ క్వెర్రీని ఓడించి సెమీస్ చేరడమే అందుకు కారణం.

09/09/2017 - 00:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే రంజీ సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలు స్వతంత్రంగా బరిలోకి దిగనున్నాయి. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు శుక్రవారం బిసిసిఐ పాలనాధికారు బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్‌ని కలిసి, సుమారు గంటన్నర సేపు చర్చించారు.

09/09/2017 - 00:35

సోనేపట్, సెప్టెంబర్ 8: ప్రో కబడ్డీలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లూ టైగానే ముగియడం విశేషం. హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు 41 పాయింట్లు చేశాయి. హర్యానా తరఫున వజీర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సుర్జీత్ సింగ్ 9, మోహిత్ చిల్లార్ 5 చొప్పున పాయింట్లు సాధించారు.

09/08/2017 - 00:30

న్యూయార్క్: ఈసారి యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. అమెరికాకు చెందిన నలుగురు క్రీడాకారిణులు సెమీ ఫైనల్స్ చేరుకోవడం ఇందుకు ఒక కారణమైతే, ఒక సెమీ ఫైనల్ ఇద్దరు నల్లజాతీయుల మధ్య జరగడం మరో కారణం. మొత్తం మీద సెమీస్, ఆతర్వాత ఫైనల్‌లో ఎవరు గెలిచినా, ట్రోఫీ మాత్రం అమెరికాకే దక్కనుంది.

Pages