S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/11/2017 - 00:07

మాడ్రిడ్, సెప్టెంబర్ 10: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్‌తో రాణించడంతో, స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా ఎస్పానియల్‌తో జరిగిన మ్యాచ్‌ని బార్సిలోనా 5-0 తేడాతో గెల్చుకుంది. పాయింట్ల పట్టికలో తన సమీప ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే బార్సిలోనా నాలుగు పాయింట్లు ఆధిక్యంలో నిలవడం విశేషం.

09/11/2017 - 00:05

ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న సాల్ట్ లేక్ స్టేడియం.
స్థానిక నిర్వహణ కమిటీ (ఎల్‌ఒసి)కి ఈ స్టేడియాన్ని ఆదివారం అప్పగించారు

09/11/2017 - 00:03

సోనేపట్, సెప్టెంబర్ 10: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఒక లో స్కోరింగ్ మ్యాచ్‌లో పునేరీ పల్టన్‌పై బెంగళూరు బుల్స్ నాలుగు పాయింట్ల తేడాతో గెలిచింది. కుల్దీప్ సింగ్, సునీల్ జైపాల్, మహేందర్ సింగ్ పోరాటం ఫలించడంతో బెంగళూరు 24 పాయింట్లు చేయగలిగింది. పునేరీ పల్టన్ 20 పాయింట్లకే పరిమితమైంది. ధర్మరాజ్ చెరాలతన్ నాలుగు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

09/11/2017 - 00:03

లక్నో, సెప్టెంబర్ 10: దులీప్ ట్రోఫీలో ఆదివారం ముగిసిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా గ్రీన్‌పై ఇండియా రెడ్ 170 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్ కర్న్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి, రెడ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. గ్రీన్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ సెంచరీ చేసినప్పటికీ, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రెడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు సాధించింది.

09/10/2017 - 00:42

లార్డ్స్, సెప్టెంబర్ 9: జేమ్స్ ఆండర్సన్ కెరీర్‌లో 500 టెస్టు వికెట్ల మైలురాయిని చేరగా, వెస్టిండీస్‌తో జరిగిన చివరి, మూడో టెస్టును ఇంగ్లాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో క్లీన్‌స్వీప్ చేసింది. కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణతో రాణించిన ఆండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.

09/10/2017 - 00:43

న్యూయార్క్, సెప్టెంబర్ 9: ప్రపంచ నంబర్ వన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరాడు. జువాన్ మార్టిన్ డెల్ పొట్రోతో జరిగిన సెమీ ఫైనల్‌లో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, ప్రత్యర్థిని 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో చిత్తుచేశాడు.

09/10/2017 - 00:38

న్యూయార్క్: సుమారు 52 సంవత్సరాల తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా కెవిన్ ఆండర్సన్ రికార్డు నెలకొల్పాడు. సెమీ ఫైనల్‌లో అతను పాబ్లో కరెనో బస్టాను 4-6, 7-5, 6-3, 6-4 తేడాతో ఓడించి, రాఫెల్ నాదల్‌తో టైటిల్ పోరును ఖరారు చేసుకున్నాడు. మొత్తం మీద గ్రాండ్ శ్లామ్స్‌లో దక్షిణాఫ్రికాకు చెప్పుకోదగిన రికార్డు లేదు.

09/10/2017 - 00:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇంగ్లీష్ కౌంటీ కాంట్రాక్టు పూర్తయ్యే వరకూ కదపకుండా అక్కడే ఉంచుతారా లేక స్వదేశానికి పిలిపిస్తారా అన్నది ఆసక్తిని రేపుతుండగా, ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ సిరీస్ మొదటి మ్యాచ్‌లకు టీమిండియా ఎంపిక ఆదివారం జరగనుంది.

09/10/2017 - 00:35

రియో డి జెనీరో, సెప్టెంబర్ 9: టీనేజ్ సంచలనం వినిసియస్ జూనియర్‌కు బ్రెజిల్ అండర్-17 జట్టులో చోటు కల్పించారు. భారత్‌తో జరిగే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసిన జట్టులో వినిసియస్‌ను తీసుకున్నట్టు బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.

09/10/2017 - 00:33

డెన్ బొచ్ (నెదర్లాండ్స్), సెప్టెంబర్ 9: ఐరోపా పర్యటనలో ఉన్న భారత మహిళా హాకీ జట్టు స్థానిక క్లబ్ చేతిలో ఓటమిపాలైంది. లేడిస్ డెన్ బొచ్ క్లబ్‌కు చెందిన చాలా మంది క్రీడాకారిణులు నెదర్లాండ్స్ జాతీయ జట్టులో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ జట్టే నెదర్లాండ్స్ జాతీయ జట్టుగా కొనసాగుతున్నది. క్లబ్‌కు చెందిన తొమ్మిది క్రీడాకారిణులు ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టులో ఉండడం విశేషం.

Pages