S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/14/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 13: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మరో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ జట్టులో కొనసాగే విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అంటున్న టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తానని అంటున్నాడు. అందుకే అతను ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అద్భుతంగా రాణించిన పలువురు యువ ఆటగాళ్లపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు.

07/14/2017 - 00:55

చెన్నై, జూలై 13: భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గురువారం టేబుల్ టెన్నిస్ (టీటీ)లో తన పరిజ్ఞానాన్ని అందరికీ తెలియపరిచాడు. అల్టిమేట్ టీటీ చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన అతను కొంత సేపు సరదాగా గేమ్ ఆడాడు. ఆనంద్‌ను చెస్ ఆడుతున్నప్పుడు చూసిన వారు ఎంతో మంది ఉన్నా, ఇరే ఇతర క్రీడలు ఆడుతున్నప్పుడు ఎవరూ చూసి ఉండరు.

07/13/2017 - 02:08

బ్రిస్టల్, జూలై 12: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్స్ చేరుకునే అవకాశాలను భారత్ పూర్తిగా కోల్పోకపోయినా, పరిస్థితిని సంక్లిష్టం చేసుకుంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బౌలింగ్ కారణంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ పూనమ్ రావత్ శతకంతో చెలరేగినప్పటికీ, బౌలర్లు అదే స్థాయిలో రాణించలేకపోవడంతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

07/13/2017 - 02:06

బ్రిస్టల్, జూలై 12: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించింది. కెరీర్‌లో ఇంత వరకూ 183 వనే్డలు ఆడిన ఆమె 52.25 సగటుతో 6,028 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 114 (నాటౌట్). ఆమె ఖాతాలో ఐదు శతకాలు, 49 అర్ధ శతకాలు ఉన్నాయి.

07/13/2017 - 02:05

లండన్, జూలై 12: వింబుల్డన్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే ఈసారి క్వార్టర్ ఫైనల్స్ నుంచే నిష్క్రమించాడు. శామ్ క్వెర్రీ అతనిని 3-6, 6-4, 6-7, 6-1, 6-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. మొదటి మూడు సెట్లు హోరాహోరీగా సాగాయి. క్వెర్రీ ఒక సెట్‌ను గెల్చుకుంటే, ముర్రే రెండు సెట్లు సాధించాడు. అయితే, చివరి రెండు సెట్లలో అతను ఏమాత్రం ఎదురుదాడి చేయలేకపోయారు.

07/13/2017 - 02:05

లండన్: ప్రపంచ మాజీ నంబర్ వన్, మాజీ చాం పియన్ గాయం కారణంగా మ్యాచ్‌ని పూర్తి చేయ లేక వైదొలిగాడు. వింబుల్డన్‌లో ఈసారి టైటిల్ ఫే వరిట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగిన జొకోవిచ్ క్వార్ట ర్ ఫైనల్స్‌లో థామస్ బెర్డిచ్‌ను ఢీకొన్నాడు. అయతే, అప్పటికే మోచేతి నొప్పితో బాధపడుతున్న కార ణంగా అతను ఆటపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచ లేకపోయాడు.

07/13/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 12: లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం అనర్హులైన కొంత మంది అధికారులే ఆ సిఫార్సులను అడ్డుకుంటున్నారని, వారి వల్లే జాప్యం జరుగుతున్నదని సుప్రీం కోర్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనాధికారుల బృందం (సిఒఎ) వివరణ ఇచ్చింది.

07/12/2017 - 01:21

న్యూఢిల్లీ, జూలై 11: టీమిండియా చీఫ్ కోచ్ పదవికి నియామకంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. టీమిండియా మాజీ డైరెక్టకర్ రవిశాస్ర్తీని రెండేళ్ల కాలానికి చీఫ్ కోచ్‌గా నియమించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా మంగళవారం రాత్రి ప్రకటించారు. అలాగే మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు కూడా ఖన్నా ప్రకటించారు.

07/12/2017 - 01:17

న్యూఢిల్లీ, జూలై 11: మంగళవారం జరగాల్సిన బిసిసిఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) వాయిదాపడింది.. నోటీసు సమయానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలనుటంకిస్తూ బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ వర్గీయులు అభ్యంతరాలు లేవనెత్తడంతో బిసిసిఐ ఈ సమావేశాన్ని వాయిదా వేసింది.

07/12/2017 - 01:16

లండన్, జూలై 11: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా ‘నల్ల కలువ’ వీనస్ విలియమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత జెలెనా ఒస్టాపెంకోను మట్టికరిపించి గత 23 ఏళ్లలో వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్‌కు చేరిన అతిపెద్ద వయస్కురాలిగా ఆవిర్భవించింది.

Pages