S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/12/2017 - 01:15

చెన్నై, జూలై 11: ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి జోత్స్న చిన్నప్పకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ కార్పొరేషన్ (టిఎఎన్‌జిఇడిసిఓ)లో ఆమెను సీనియర్ స్పోర్ట్స్ అధికారిగా నియమించింది.

07/12/2017 - 01:13

లండన్, జూలై 11: వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమిస్తానని స్పానిష్ బుల్ రఫెల్ నాదల్ కలలో కూడా ఊహించి ఉండడేమో. ఎందుకంటే ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను పదోసారి తన ఖాతాలో వేసుకున్న అతను ఈ సారి వింబుల్డన్‌లోను టైటిల్ ఫేవరేట్లలో ఒకడుగా ఉన్నాడు.

07/12/2017 - 01:12

జొహానె్నస్‌బర్గ్, జూలై 11: వరల్డ్ హాకీ లీగ్ (డబ్ల్యుహెచ్‌ఎల్) సెమీ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టు చతికిలబడింది. పూల్-బిలో జరిగిన రెండో మ్యాచ్‌లో పటిష్టమైన అమెరికా జట్టు 4-1 తేడాతో భారత జట్టును మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే హోరాహోరీగా తలపడిన ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్ల రూపంలో పలు అవకాశాలు లభించినప్పటికీ చాలాసేపు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి.

07/11/2017 - 00:42

లండన్, జూలై 10: వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మన్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో ఆమె 6-4, 4-6, 4-6 తేడాతో స్పెయిన్‌కు చెందిన 14వ సీడ్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా చేతిలో పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుపై కెర్బర్ పట్టు కోల్పోయింది.

07/11/2017 - 00:40

ముంబయి, జూలై 10: భారత క్రికెట్ జట్టుకు తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న విషయంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడలేదు. ఈ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ముగ్గురు సభ్యులతో కూడిన బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే నియామకాన్ని మాత్రం ప్రస్తుతానికి నిలిపివేయాలని ఈ కమిటీ నిర్ణయించింది.

07/11/2017 - 00:37

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 10: వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు. కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో ఆదివారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై కోహ్లీ విమర్శలు గుప్పించాడు.

07/11/2017 - 00:35

భువనేశ్వర్, జూలై 10: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ (ఎఎసి)లో పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరినీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ఘనంగా సత్కరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఇంతకుముందు ఎన్నడూ లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటుకుని పతకాల పట్టికలో తొలిసారి అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

07/11/2017 - 00:34

హంబన్‌తోట, జూలై 10: శ్రీలంకలో జరిగిన ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. హంబన్‌తోటలోని మహింద రాజపక్స ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం జరిగిన నిర్ణాయక చివరి మ్యాచ్‌లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంక జట్టును ఓడించి ఈ సిరీస్‌ను గెలుచుకుంది.

07/10/2017 - 01:16

న్యూఢిల్లీ, జూలై 9: కోచ్‌గా రాజీనామా చేసిన తర్వాత అనిల్ కుంబ్లే వ్యవహార తీరుపై విమర్శలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుంబ్లే భిన్నధ్రువాలుగా ఉన్న తరుణంలో ఎటువైపు మాట్లాడితే ఏం కష్టం వస్తుందోనని భయపడిన పలువురు క్రికెటర్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు.

07/10/2017 - 01:12

న్యూఢిల్లీ, జూలై 9: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనే సస్పెన్స్‌కు సోమవారం తెరపడుతుంది. టీమిండియాకు కొత్త కోచ్‌ని నియమించే బాధ్యతను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇప్పటికే క్రికెట్ సలహా మండలి (సిఎసి)కి అప్పచెప్పిన విషయం తెలిసిందే. నిరుడు కూడా కోచ్‌గా ఉండేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని సిఎసి ఇంటర్వ్యూ చేసింది. అనిల్ కుంబ్లే పేరు ప్రతిపాదించగా, బిసిసిఐ ఆమోద ముద్ర వేసింది.

Pages