S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/08/2017 - 00:23

లండన్, జూలై 7: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ నుంచి ఫేవరిట్స్ జాబితాలో ఉన్న కరోలినా ప్లిస్కోవా రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. సెంట్రల్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 108వ స్థానంలో ఉన్న మగ్దలెన రిబరికొవా 3-6, 7-5, 6-2 తేడాతో ప్లిస్కోవాపై విజయభేరి మోగించి సంచలనం సృష్టించింది.

07/08/2017 - 00:20

భువనేశ్వర్, జూలై 7: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత 4న100 మీటర్ల రిలే జట్టుపై అనర్హత వేటు పడింది. బాటన్‌ను అందించే సమయంలో ఒక రన్నర్ తన లేన్‌ను కాకుండా మరో లేన్‌లోకి అడుగుపెట్టిన కారణంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 400 మీటర్ల సెమీ ఫైనల్ పరుగును శుక్రవారం మరోసారి నిర్వహించారు.

07/08/2017 - 00:19

న్యూఢిల్లీ, జూలై 7: ఈనెలాఖరు నుంచి శ్రీలంకలో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. 26 నుంచి 30వ తేదీ వరకు గా లేలో జరిగే మొదటి టెస్టుతో భారత్ పర్యటన ప్రారంభమవు తుంది. ఆగస్టు 3-7 వరకు రెండవ, 12-16 వరకు మూడవ టె స్టు జరుగుతాయ. ఆతర్వాత భారత్ ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 20 (డంబుల్లా), 24 (పల్లే కల్), 27 (పల్లేకల్), 31 (ఖెత్తరామ), సెప్టెంబర్ 3 (ఖెత్తరామ) తేదీల్లో జరుగుతాయ.

07/08/2017 - 00:18

న్యూఢిల్లీ, జూలై 7: స్వదేశంలో అక్టోబర్ 6న ప్రారంభమయ్యే ఫిఫా అండర్-17 సాకర్ వరల్డ్ క ప్‌లో భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో అమెరికా, కొలంబియా, ఘనా జట్లు కూడా ఉంటాయ. 6న అమెరికాతో తలపడనున్న భారత్ 9న కొలంబియాను ఎదుర్కొంటుంది. 12న ఘనాను ఢీ కొంటుంది. కాగా, ఈ మెగా టో ర్నీలోని మిగతా 23 జట్లను ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ గ్రూపులుగా విభజించారు.

07/07/2017 - 00:49

భువనేశ్వర్, జూలై 6: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మొదటి రోజున భారత పతకాల ఖాతాను మన్‌ప్రీత్ కౌర్ తెరిచింది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఆమె 18.28 మీటర్ల దూరానికి విసిరి సత్తా చాటింది. గురువారం 27వ ఏట అడుగుపెట్టిన ఆమె తన పుట్టిన రోజునే స్వర్ణాన్ని అందుకోవడం విశేషం. గవో తియాంక్వియాన్ 17.91 మీటర్లతో రజత పతకం సాధించగా, ఒయా ఒటా 15.45 మీటర్ల దూరంతో కాంస్య పతకాన్ని అందుకుంది.

07/07/2017 - 00:48

చిత్రం.. హై జంప్ ఈవెంట్ ప్రిలిమినరీల్లో పాల్గొన్న ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత జాంగ్ గువెయ్

07/07/2017 - 00:46

చిత్రం.. భువనేశ్వర్‌లో గురువారం ఆరంభమైన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 1,500 మీటర్ల పరుగు హీట్స్‌లో పోటీపడుతున్న అథ్లెట్లు

07/07/2017 - 00:45

కింగ్‌స్టన్, జూలై 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ జోహ్రి ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సహచరులను కలిసినట్టు సమాచారం. అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, అతను భారత క్రికెటర్లతో సమావేశమై, వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ విషయంపై బిసిసిఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

07/07/2017 - 00:43

లండన్, జూలై 6: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో అతను ఆడం పవ్లాసెక్‌ను 6-2, 6-2, 6-1 తేడాతో సులభంగా ఓడించాడు.

07/07/2017 - 00:42

హైదరాబాద్, జూలై 6: బాడ్మింటన్ సింగిల్స్ విభాంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా దూసుకెళుతున్నప్పటికీ, డబుల్స్ విభాగంలో చాలా వెనుకబడి ఉందని ఇటీవలే డబుల్స్ కోచ్‌గా నియమితురాలైన జ్వాల గుత్తా తెలిపింది. గురువారం ఆమె పిటిఐతో మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలిపింది.

Pages