S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/09/2017 - 00:31

లండన్, జూలై 8: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి క్షణం సమీక్షిస్తునే ఉంటారు. అధికారులు ఎంత కష్టపడుతున్నా జరగాల్సిన నష్టం జరిగింది. 17వ నంబర్ కోర్టులో సొరానా సిర్‌స్టియాతో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆడేందుకు వేగంగా ముందుకు వెళ్లిన బెథానీ మాటెక్ సాండ్స్ పట్టుకోల్పోయి కింద పడింది.

07/09/2017 - 00:29

వింబుల్డన్: ఒక మహిళా అంపైర్‌పై రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ నాణాన్ని విసిరిన సంఘటనపై వింబుల్డన్ అధికారులు విచారణ చేపట్టారు. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో స్టానిస్లాస్ వావ్రిన్కాను ఓడించి సంచలనం సృష్టించిన మెద్వెదెవ్ రెండో రౌండ్‌లో బెల్జియం దేశానికి చెందిన క్వాలిఫయర్ రూబెన్ బెమెల్మన్స్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

07/09/2017 - 00:27

వింబుల్డన్, జూలై 8: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జో విల్‌ఫ్రైడ్ సొంగా, శామ్ క్వెర్రీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ మారథాన్ మ్యాచ్‌లో సొంగాను క్వెర్రీ 2-6, 6-3, 7-6, 6-1, 7-5 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. చివరి వరకూ ఈమ్యాచ్ ఉత్కంఠ రేపింది.

07/09/2017 - 00:26

లండన్, జూలై 8: అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమేగాక, మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగా దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబదాపై వేటు పడింది. అతనిని ఒక టెస్టు నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో చోటు చేసుకున్న సంఘటనపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ చేసిన ఫిర్యాదుపై ఐసిసి తీవ్రంగా స్పందించింది.

07/09/2017 - 00:25

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 8: స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ బ్యాటింగ్ సామర్థ్యంపైనే ఆధారపడి, ఆదివారం భారత్‌తో జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బరిలోకి దిగనుంది. టి-20 వరల్డ్ కప్‌లో విండీస్‌ను గెలిపించిన కార్లొస్ బ్రాత్‌వెయిట్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో గేల్‌తోపాటు మార్లొస్ సామ్యూల్స్, సునీల్ నారైన్, శామ్యూల్ బద్రీ వంటి స్టార్లు ఉన్నారు.

07/09/2017 - 00:23

హంబన్‌తోట, జూలై 8: జింబాబ్వేతో శనివారం జరిగిన నాలుగో వనే్డలో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న లంక ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకొని, 50 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు సాధించిన లంకను వాన నిలువునా ముంచేసింది.

07/08/2017 - 00:34

విండీస్‌ను చివరి వనే్డలో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో గెల్చుకున్న టీమిండియా

07/08/2017 - 00:30

కింగ్‌స్టన్, జూలై 7: విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, అజేయ శతకంతో రాణించడంతో, వెస్టిండీస్‌తో జరిగిన చివరి, ఐదో వనే్డలో 8 వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. విండీస్ 9 వికెట్లకు 205 పరుగులు చేయగా, భారత్ మరో 79 బంతులు మిగిలి ఉండగానే, అజింక్య రహానే (39), శిఖర్ ధావన్ (4) వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది.

07/08/2017 - 00:26

ముంబయి, జూలై 7: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు మారుతీ సుజుకి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును స్వీకరించింది. లివింగ్ లెజెండ్‌గా మాజీ రన్నర్ మిల్కా సింగ్, ఉత్తమ కోచ్‌గా గోపీంద్, ఉత్తమ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవ్ గిల్ అవార్డులు తీసుకున్నారు.

07/08/2017 - 00:25

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ట్విటర్‌లో ఉంచిన ఫొటో ఇది. 36వ ఏట అడుగుపెట్టిన ధోనీని టీమిండియా క్రికెటర్లు కేక్‌తో ఇలా అలంకరించారు. కాగా, పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, ప్రముఖులు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్‌కు అతను చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు

Pages