S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/31/2017 - 01:21

న్యూఢిల్లీ, మార్చి 30: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఐపిఎల్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్పష్టం చేశాడు. గురువా రం ఇక్కడ జరిగిన జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ పుణే జట్టుకు నిరుడు ధోనీ కెప్టెన్‌గా సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశాడు.

03/31/2017 - 01:19

గుర్‌గావ్, మార్చి 30: స్టార్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ గాయపడడం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. గాయం కారణంగా ఈసారి ఐపిఎల్‌లో పాల్గొనడం లేదని డికాక్ ఇప్పటికే ప్రకటించాడు. నిరుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన జట్టు ఈసారి గట్టిపోటీనివ్వాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ, డికాక్ లేకపోవడంతో సమస్యలను ఎదుర్కోనుంది.

03/31/2017 - 01:19

లండన్, మార్చి 30: ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ అడుగుపెట్టే అవకాశాలు పెరుగుతున్నాయని, 2024 ఎడిషన్‌లో ఈ క్రీడను చేర్చడానికి కృషి చేస్తున్నామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపాడు. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని అన్నాడు. అందుకే తమ ప్రతిపాదనకు ఐసిసి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అన్నాడు.

03/31/2017 - 01:19

మస్కట్, మార్చి 30: భారత ఏస్ ఫార్వర్డ్ ఎస్‌వి సునీల్, యువ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఆసియా హాకీ సమాఖ్య (ఎహెచ్‌ఎఫ్) అవార్డులు లభించాయి. 2016 సంవత్సరానికిగాను సునీల్‌కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కగా, ప్రామిసింగ్ ప్లేయర్‌గా హర్‌మన్‌ప్రీత్ ఎంపికయ్యాడు.

03/30/2017 - 06:14

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 29: కీలకమైన ఫైనల్ పోటీలో దినేష్ కార్తీక్ చెలరేగిపోయాడు. అతను సెంచరీ చేయడంతో, ఇండియా ‘బి’పై తన జట్టు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ విజయంతో తమిళనాడు దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుని ఈ పోటీలకు తమిళనాడు అర్హత సంపాదించింది.

03/30/2017 - 06:10

న్యూఢిల్లీ, మార్చి 29: సుప్రీం కోర్టు నియమించిన పాలక కమిటీ (సిఒఎ) పర్యవేక్షణలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక వర్గం గురువారం సమావేశం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహారాల్లో ప్రస్తుతం అన్ని అధికారాలు సిఒఎకు ఉన్నాయి. దీనితో ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు.

03/30/2017 - 06:09

హామిల్టన్, మార్చి 29: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టులో విజయానికి చేరువైనప్పటికీ, వర్షం కారణంగా న్యూజిలాండ్ డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆట వర్షం కారణంగా రద్దుకావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఓటమి నుంచి బయపడిన ఆ జట్టు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 314 పరుగులు చేసింది.

03/30/2017 - 06:09

న్యూఢిల్లీ, మార్చి 29: పార్లమెంటు ఆవరణలో బుధవారం ఫుట్‌బాల్ సందడి కనిపించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ , పలువురు పార్లమెంటు సభ్యులు సరదాగా ఫుట్‌బాల్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది జరిగే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

03/30/2017 - 06:08

న్యూఢిల్లీ, మార్చి 29: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ రక్తికట్టింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి ప్రేక్షకులను అలరించాయి. ఆటతోపాటు, మైదానంలో చోటు చేసుకున్న ఘర్షణలు, వాగ్వాదాలు, వెక్కిరింతలు కూడా టీమిండియా క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కించాయి.

03/29/2017 - 03:47

పోరు పరిసమాప్తమైంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ భారత్ ఖాతాలో పడింది. 8 వికెట్ల తేడాతో కంగారూలను మట్టి కరిపించి, చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ధర్మశాలలో ముగిసిన నిర్ణాయక చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సునీల్ గవాస్కర్ నుంచి ట్రోఫీని అందుకుంటున్న విరాట్ కోహ్లి, అజింక్య రెహానె

Pages