S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/02/2017 - 01:19

బెంగళూరు: లోకేష్ రాహుల్ గాయం కారణంగా ఈసారి ఐపిఎల్‌కు హాజరుకాకపోవడం యువ వికెట్‌కీపర్ జగదీశన్‌కు లాభించనుంది. రాహుల్ స్థానాన్ని జగదీశ్‌తో భర్తీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపిఎల్‌లో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరచలేకపోయాడు.

04/02/2017 - 01:18

కీ బిస్కేన్, ఏప్రిల్ 1: చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో మరోసారి టైటిల్ పోరుకు ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ సిద్ధమయ్యాడు. ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఫెదరర్‌ను ఢీకొన్న అతను 4-6, 6-3, 1-6, 6-3, 3-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

04/02/2017 - 01:17

కొలంబో, ఏప్రిల్ 1: బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంక 71 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. కుశాల్ మేండిస్, తిసర పెరెరా చెరి 54 పరుగులు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై, 44.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది.

04/02/2017 - 01:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో తలపడిన తెలుగు తేజం పివి సింధు, ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ ఓపెన్ సెమీ ఫైనల్‌లో రెండ సీడ్ సంగ్ జి హ్యున్‌ను 21-18, 14-21, 21-14 తేడాతో ఓడించిన మూడో సీడ్ సింధు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

04/01/2017 - 02:29

న్యూఢిల్లీ, మార్చి 31: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అతను రోజుకు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే, అతను అత్యధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న సెలబ్రిటీల జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ దిగ్గజాలు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులను మించిపోతాడు.

04/01/2017 - 02:27

హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ)కు జరిగిన ఎన్నికల్లో జి. వివేక్ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. వివిధ కోర్టు కేసులు, లోధా కమిటీ సిఫార్సుల అమలు వంటి ఎన్నో కీలక పరిణామాల నేపథ్యంలో, శుక్రవా రం జరిగిన ఎన్నికల్లో వివేక్ తన ప్రత్యర్థి విద్యుత్ జైసింహపై 68 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వివేక్‌కు 136 ఓ ట్లురాగా, విద్యుత్ జైసింహకు 68 ఓట్లు పోలయ్యాయ.

04/01/2017 - 02:27

న్యూఢిల్లీ, మార్చి 31: హైదరాబాద్‌లో ఏప్రిల్ ఐదున సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు స్టార్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, లోకేష్ రాహుల్ గాయాల కారణంగా దూరంకానున్నారు. అశ్విన్ రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్‌కు, రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది.

04/01/2017 - 02:24

న్యూఢిల్లీ, మార్చి 31: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు సెమీ ఫైనల్స్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ను 21-16, 22-20 తేడాతో ఓడించింది. సెమీస్‌లో ఆమె సంగ్ జి హ్యున్‌ను ఢీ కొంటుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో హ్యున్ 21-16, 22-20 ఆధిక్యంతో రచానొక్ ఇంతనాన్‌పై విజయం సాధించింది.

04/01/2017 - 02:22

కీ బిస్కేన్, మార్చి 31: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్స్ చేరాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న అతను క్వార్టర్ ఫైనల్స్‌లో పదో సీడ్ థామస్ బెర్డిచ్‌ని 6-2, 3-6, 7-6 తేడాతో ఓడించాడు. ఫైనల్‌లో స్థానం కోసం అతను 12వ సీడ్ నిక్ కిర్గియోస్‌ను ఢీ కొంటాడు.

04/01/2017 - 02:21

న్యూఢిల్లీ: కోహ్లీ టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరంకానున్న నేపథ్యంలో, అతని స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దక్షిణాఫ్రికా సూపర్ స్టార్ ఎబి డివిలియర్స్ నాయకత్వం వహిస్తాడు. లోకేష్ రాహుల్ ఈసారి ఐపిఎల్‌లో ఆడలేకపోవడం, కోహ్లీ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వంటి కారణాల నేపథ్యంలో డివిలియర్స్‌పై బాధ్యత పెరగడం ఖాయం.

Pages