S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/03/2017 - 00:34

న్యూఢిల్లీ, మార్చి 29: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ రక్తికట్టింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి ప్రేక్షకులను అలరించాయి. ఆటతోపాటు, మైదానంలో చోటు చేసుకున్న ఘర్షణలు, వాగ్వాదాలు, వెక్కిరింతలు కూడా టీమిండియా క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కించాయి.

04/03/2017 - 00:32

బూనస్‌ఎయిర్స్, మార్చి 29: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీపై వేటు పడింది. అతనిని నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసినట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ప్రకటించింది. దీనితో బొలీవియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బరిలోకి దిగలేదు. అతను మైదానంలో లేకపోవడంతో డీలాపడిన అర్జెంటీనా, ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బొలీవియాతో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో ఓటమిపాలైంది.

04/03/2017 - 00:31

న్యూఢిల్లీ, మార్చి 29: భారత బాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్‌లో ముందంజ వేశారు. సైనా తన మొదటి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చియా సిన్ లీను 21-10, 21-17 తేడాతో ఓడించింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు 21-17, 21-6 ఆధిక్యంతో అరుంధతి పత్వానేపై గెలిచింది.

04/03/2017 - 00:30

మియామీ, మార్చి 29: మియామీ ఓపెన్ టెన్నిస్ నాలుగో రౌండ్‌లో టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా ఓటమిపాలయ్యాడు. యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ అతనిని 4-6, 6-2, 6-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్స్‌లో అతను 12వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌ను ఢీ కొంటాడు. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో కిర్గియోస్ 7-6, 6-3 స్కోరుతో డేవిడ్ గొఫిన్‌ను ఓడించాడు.

04/02/2017 - 01:27

కౌంట్ డౌన్ 3
**

04/02/2017 - 01:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించాల్సిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్‌పై ఈనెల రెండో వారంలో నిర్ణయం తీసుకుంటారు. ఆతర్వాతే, అతను ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడే విషయాన్ని ఖాయం చేస్తారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

04/02/2017 - 01:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పదో ఐపిఎల్ కోసం ఫిబ్రవరి మాసంలో జరిగిన వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి 91.15 కోట్ల రూపాయలు వెచ్చించి, 66 మంది ఆటగాళ్లను కొన్నాయి. వీరిలో 39 మంది భారతీయులు. 27 మంది విదేశీ క్రికెటర్లు. గుజరాత్ లాయన్స్ అత్యధికంగా 11 మందిని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతి తక్కువగా ఐదుగురిని కొన్నాయి. ఈ వేలంలో వివి ధ ఫ్రాంచైజీలు కొన్న ఆటగాళ్ల వివరాలు..

04/02/2017 - 01:23

లండన్, ఏప్రిల్ 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడేందుకు మొగ్గుచూపుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐర్లాండ్‌తో వనే్డ సిరీస్‌కు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అతనితోపాటు క్రిస్ వోక్స్ కూడా ఐర్లాండ్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండబోమని ప్రకటించినట్టు స్థానిక మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈసారి ఐపిఎల్‌లో స్టోక్స్‌కు అత్యధిక ధర పలికింది.

04/02/2017 - 01:21

* పదో ఐపిఎల్ వేలంలో కొంత మందికి అనుకోని అదృష్టం వరించగా, చాలా మంది ప్రముఖులకు నిరాశ తప్పలేదు. ఏ జట్టూ ఆసక్తి చూపని ఆటగాళ్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (బేస్ ప్రైస్ 50 లక్షలు), ఇర్ఫాన్ పఠాన్ (బేస్ ప్రైస్ 50 లక్షలు), ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో (బేస్ ప్రైస్ 1.5 కోట్లు), దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (బేస్ ప్రైస్ 50 లక్షలు) వంటి స్టార్లు ఉన్నారు.

04/02/2017 - 01:20

బెంగళూరు, ఏప్రిల్ 1: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికా దేశవాళీ వనే్డ టోర్నీకి దూరం కావడంతో, ఐపిఎల్‌లో తమ పరిస్థితి ఏమిటని బెంగళూరు క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజం గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.

Pages