Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

అంటార్కిటికాలో సరికొత్త జీవప్రపంచం?

మనం ఇంతవరకూ చూడని, మనకు తెలియని కొత్త జీవజాతులతో కూడిన ప్రపంచం అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఉండి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. మొక్కలు, ఉభయచర జీవులు, జలచరాలు, జంతువులకు చెందిన వినూతన, విభిన్న జీవజాతులకు మనుగడ సాగిస్తుండవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. అత్యంత శీతల పరిస్థితులకు నెలవైన అంటార్కిటికాలో అలాంటి అవకాశం లేదని ఇంతకాలం భావిస్తున్నప్పటికీ తాజా అధ్యయనాలు ఈ భావనకు ఊపిరులూదుతున్నాయి. ఈ రహస్య జీవజాతుల ప్రపంచం గురించి కొందరు శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితాలను వివిధ జర్నల్స్‌లో ప్రచురించారు. నిజానికి అంటార్కిటికాలో మైనస్ 30కు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయి.

-ఎస్.కె.ఆర్.

‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటె తెలుసా?

పసిఫిక్ సముద్రం చుట్టూ గుర్రపు నాడా ఆకారంలో విస్తరించి ఉన్న అగ్నిపర్వతాల ప్రాంతం. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ దేశాల పరిథిలోనే ఉన్నాయి. దాదాపు 40 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో, దాదాపూ 450 పైగా అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో చాలావరకు యాక్టివ్‌గా ఉండటం విశేషం. కొన్ని పూర్తిగా నిర్వీర్యమైనవి, మరికొన్ని స్తబ్దతతో ఉన్నవి కూడా ఉన్నాయి. జపాన్‌లోని ఫ్యుజి అగ్నిపర్వతం అతి ఎతె్తైనది. ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో 90 శాతం అగ్నిపర్వతాల విస్ఫోటనాలవల్లే వస్తున్నాయి. మిగతా పర్వతాల మాదిరిగా కాకుండా అగ్నిపర్వతాల లోపిల భాగం గుల్లగా ఉంటుంది.

ఏడిస్తే మంచిదే!

మెదడు, హృదయంపై ఒత్తిడి తగ్గడానికి ఏడుపు మంచి మార్గం. బాలానాం రోదనం బలం అంటారు. అంటే చిన్నపిల్లలు ఏడిస్తే మంచిది అని. నిజానికి ఎవరు ఏడ్చినా మంచిదే. మనకు తెలియని ఒత్తిడి నుంచి ఏడుపు మనల్ని పడేస్తుంది. అంటే ఏడుపు ఆరోగ్యానికి ఆయుధం. మగవారికన్నా మహిళలు ఎక్కువగా ఏడుస్తారు. వారిలో మగవారికన్నా ఎక్కువగా ఉండే ప్రొలాక్టిన్ అనే ప్రొటీన్ అందుకు కారణం. ఆనందంతో ఏడవడం (ఆనందభాష్పాలు)వల్ల మొదట కుడికంట్లోంచి నీటిబొట్లు రాలతాయట. అదే బాధతో ఏడ్చినప్పుడు మొదట ఎడమకంటిలోంచి అశ్రువులు వస్తాయట. పసిపిల్లలు రోజుకు గంట నుంచి మూడు గంటలపాటు ఏడుస్తారట తెలుసా!

‘హార్స్‌షూ క్రాబ్’ పీతకాదు!

హార్స్ షూ క్రాబ్ అని పిలిచే ఉభయచరం నిజానికి పీత కాదు. పీతలతో కన్నా సాలీళ్లు, తేళ్లతో వీటికి దగ్గర పోలికలు ఉంటాయి. ఇది గుర్రపు నాడా ఆకారంలో ఉండటం వల్ల అలా పిలుస్తారు. బాహ్య అస్తిపంజరం పైన ఐదు, దిగువ రెండు కళ్లున్న ఈ ‘క్రాబ్’ జోడీని వెదుక్కోవడానికి, సముద్రంపై ప్రయాణం ఏ దిశగా చేయాలన్న విషయాన్ని గ్రహించడానికి ఎక్కువగా ఉపయోగిస్తాయి. దాదాపు నలభై ఏళ్లపాటు జీవించే వీటిలో ఆడవి మగవాటికన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి పెట్టే గుడ్లలో 10 శాతం మాత్రమే పిల్లలుగా బతకగలుగుతాయి. బతికిన పిల్లలు నీటిలో తలకిందులుగా ఈదడం విశేషం. తోక ఉన్న ఈ ‘హార్స్‌షూ క్రాబ్స్’ దానిని ప్రయాణాన్ని నియంత్రించే సాధనంగా ఉపయోగిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

పక్షుల పండుగ!

థాయ్‌లాండ్‌లో ఏటా సెప్టెంబర్‌లో పక్షుల పండుగ నిర్వహిస్తారు. వేలాది పక్షులను పంజరాల్లో ఉంచి అక్కడ ప్రదర్శిస్తారు. ఈసారి దాదాపు 1400 రకాల పక్షులు కనువిందు చేశాయి. వరుసగా పోల్స్‌పాతి వాటికి పంజరాలను అమర్చి ఈ వేడక నిర్వహిస్తారు. ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. థాయ్‌లాండ్‌లో ఇది పెద్ద పర్యాటక ఆకర్షణ.

- భారతి

బొచ్చే శాపం

అందంగా, ఒత్తుగా పెరిగే బొచ్చు దీని ప్రాణాలకు ప్రమాదం తెస్తోంది. క్యాట్ ఫామిలీకి చెందిన ‘లిన్స్’ మిగతా పిల్లులకు భిన్నంగా బాగా దట్టంగా ఉన్న బొచ్చుతో బలిష్టంగా కనిపిస్తాయి. వీటి పాదాలు మిగతా పిల్లులకన్నా భిన్నంగా ఉండటం వల్ల అవి మంచులో కూరుకుపోకుండా నడవగలుగుతాయి. ఫ్యాషన్ రంగంలో వీటి బొచ్చుతో చేసిన వస్తువులకు విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల వేటకు గురవుతున్నాయి. వాటి బొచ్చే వాటి ప్రాణాలు తీస్తోందన్నమాట. నాలుగు రకాల ‘లిన్స్’ పిల్లుల్లో స్పానిష్ లిన్స్ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇవి కేవలం యూరోపియన్ ర్యాబిట్‌లనే ఆహారంగా తీసుకుంటాయి.

- ఎస్.కె.కె. రవళి

ఇది కొమ్మకాదు... పక్షి

ఎండిపోయి విరిగిన కొమ్మలా ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఓ పక్షి. వీటిని ఫ్రాగ్‌వౌత్ పక్షులుగా పిలుస్తారు. వాటినోరు కప్పనోటిలా ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. చెట్ల బెరడు రంగులా వాటి వాటి ఈకలు బూడిద, గోధుమ రంగులో ఉంటాయి. చూడటానికి గుడ్లగూబల్లా ఉన్నప్పటికీ వాటితో వీటికి సంబంధం లేదు. తావీ ఫ్రాగ్‌వౌత్ పక్షులైతే ఎండిన చెట్ల బెరడు రంగులో విరిగిన కొమ్మల్లో కలసిపోయి ఉంటాయి. చూసి వెంటనే పోల్చుకోవడం కష్టం. ప్రమాదం ఎదురైనప్పుడు కదలకుండా అలా ఉండిపోవడం వాటి ప్రాణరక్షణ యత్నంలో ఒకటి. ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, టాస్మేనియాల్లో ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

టమోటా కప్పల తెలివి తెలుసా!

టమోటా పండ్లలా ఎర్రగా, ఉబ్బిన పొట్టతో గుడ్రంగా కనిపించడం వల్ల ఈ కప్పలను టమోటా ఫ్రాగ్స్ అని పిలుస్తారు. మడగాస్కర్ దీవుల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. సాధారణంగా పసుపు, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లో ఇవి ఉంటాయి. రంగుల్లో మెరుపును బట్టి అవి ఎదిగే వయసు వచ్చిన విషయం తెలుస్తుంది. వీటిని శత్రువులు తినడానికి ప్రయత్నించినపుడు ఇవి పొట్టను ఉబ్బరించేలా చేసి గుండ్రంగా తయారవుతాయి. ఆ సమయంలో శరీరం నుంచి బంకలాంటి ఒక విష రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ఆ శత్రువు నోరు, కళ్లు మూసుకుపోయి ఊపిరితీయడం కష్టమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కప్పను అది తినలేక కక్కేయవలసి వస్తుంది.

- ఎస్.కె.కె. రవళి

కోతుల జాతిలో ఇవే అతిపెద్దవి

ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఈ పాత తరం కోతులు చాలా ఆకర్షణీయమైన రంగులతో ఉంటాయి. కోతుల జాతిలో ఇవే అతిపెద్దవి. దాదాపు 32 అంగుళాల ఎత్తు పెరిగే వీటి ముఖం, పృష్ట్భాగం అందమైన ముదురువర్ణాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ రంగులు ఎంత ప్రస్ఫుటంగా ఉంటే అవి జతకట్టే వయసుకు వచ్చాయని అర్థం. ఎరుపు, నీలం రంగులతో ముఖంపై చారలు, ఒతె్తైన ఆలివ్‌గ్రీన్ మెరుపుతోకూడిన బొచ్చుతో ఇవి అందంగా ఉంటాయి. భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఈ రంగుల తీక్షణత పెరుగుతూంటుంది. పసుపువర్ణంతో ఉండే గెడ్డం వీటికి ప్రత్యేక ఆకర్షణ. వీటి కోరపళ్లు మిగతా కోతులతో పోలిస్తే చాలా పెద్దవిగా ఉంటాయి.

బాలవాక్కు

సత్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడు. వృత్తిని దైవంగా భావించే వ్యక్తి. విద్యార్థులే అతడి లోకం. ఎప్పుడో సెలవులకు తప్ప అస్తమాను సొంత ఊరికి వెళ్లడు. గది అద్దెకు తీసుకుని ఒంటరిగా అక్కడే నివాసముంటున్నాడు. ఎనిమిదవ తరగతి చదువుతూన్న సిద్దూ అతని ప్రియ శిష్యుడు. పేదరికం వల్ల తల్లిదండ్రులు వాణ్ణి బడి మాన్పించేసి పనిలో పెట్టాలనుకున్నప్పుడు తనే అడ్డుపడి వాడికి కావలసినవి కొనిస్తూ దగ్గరుండి చదివిస్తున్నాడు. సిద్దూ కూడా మాస్టారికి తోడుగా ఉంటూ అతడికి ఎప్పుడు ఏం కావాలన్నా తెచ్చిపెడుతూ ఎంతో సహాయకారిగా ఉంటున్నాడు. సత్యానికి ఎప్పుడూ బడి ధ్యాసే.

దూరి వెంకటరావు

Pages