Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

ప్లూటో గ్రహానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

నెప్ట్యూన్ గ్రహం చుట్టూ ఉండే రింగుల నేపథ్యంలో కనిపించే అతి చిన్న గ్రహం ప్లూటో. దీనిని 1930లో క్లైడ్ టొమ్‌బాగ్ అనే ఖగోళ శాస్తవ్రేత్త కనిపెట్టారు. అయితే దీనికి ఏం పేరుపెట్టాలన్నదానిపై ఆలోచన చేస్తున్న సమయం అది. వెనెటియా బర్న్‌లీ అనే పదకొండేళ్ల బాలిక ప్లూటో పేరును పెడితే బాగుంటుందని తన తాత ఫాల్కన్ మదన్‌తో చెప్పింది. ఇతను బాడ్‌లియాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ లైబ్రరీలో ఉద్యోగి. గడ్డకట్టిన ఈ సరికొత్త గ్రహానికి ఇంకా పేరుపెట్టలేదని ఓ దినపత్రికలో చదివినప్పుడు ఆమె ప్లూటో పేరును పెడితే బాగుంటుంది కదా తాతా అనడంతో ఆయన పరమానందభరితుడయ్యాడు. ప్లూటో రోమన్ల పురాణాల్లో అధోజగత్తుకు అధిదేవత.

అపర కర్ణుడు

ఇది స్వార్ధపూరిత ప్రపంచం. అంతా నాకే కావాలి... అంతా నేనే దోచుకోవాలి అనుకునే సమాజంలో బతుకుతున్నాం మనం. పక్కవాడి గురించి కలలో కూడా ఆలోచించని పైశాచిక మానవులు మన చుట్టూ ఉన్నారు. ఆస్తులు, ఐశ్వర్యాల కోసం రక్తసంబంధీకులను కూడా కడతేరుస్తున్నారు. అటువంటిది తనకేమీ కాని వారి కోసం తన యావదాస్తిని తృణప్రాయంగా త్యజించిన ఒక మానవతా మూర్తి గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. అతనే డెబ్బై నాలుగేళ్ల పాలం కళ్యాణ సుందరం. చెన్నైకి చెందిన కళ్యాణ సుందరానికి చిన్నతనం నుండి కష్టాలంటే ఏమిటో తెలుసు. ఎందుకంటే అతనికి ఏడాది వయసప్పడు అతని తండ్రి మరణించాడు. తల్లే అతన్ని అష్టకష్టాలు పడి పెంచి పోషించింది.

దుర్గాప్రసాద్ సర్కార్

ధ్రువాలను చుట్టివచ్చే పక్షి

ఏడాదిలో భూగోళాన్ని చుట్టివచ్చే వలసపక్షి ఇది. దీని పేరు ఆర్కిటిక్ టెర్న్. కేవలం వంద గ్రాముల బరువు, 40 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ పక్షి ఏటా కనీసం సగటున 70,900 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆహార లభ్యత ఆధారంగా ఏటా వేసవిలో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి అంటార్కిటికాకు వలస వెళతాయి. సంతానోత్పత్తి తరువాత మళ్లీ ఆర్కిటిక్‌కు వెళతాయి. వెళ్లేటపుడు అక్కడక్కడ ఆగుతూ మూడునెలల ప్రయాణం తరువాత గమ్యాన్ని చేరే ఈ పక్షులు తిరుగుప్రయాణాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేస్తాయి. గాలుల వేగం, దిశను బట్టి అడ్డదారుల్లో ఇవి ప్రయాణించడం విశేషం.

ఎస్.కె.కె. రవళి

అతి చిన్న శునకాలు ఇవే!

చిహువాహువా జాతి శునకాలు డాగ్ ఫ్యామిలీలో అతి చిన్నవి. మెక్సికోలోని అతిపెద్ద రాష్టమ్రైన చిహువాహువా ప్రాంతంలో మొదటిసారిగా వీటిని కనిపెట్టినందున ఆ ప్రాంతం పేరే వాటికి పెట్టారు. మూడున్నర నుంచి 4.5 అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే ఈ శునకాలు పెద్ద చెవులు, గుండ్రని పెద్దకళ్లు, వెడల్పైన పెద్ద చెవులతో చూడముచ్చటగా ఉంటాయి. శునకాలన్నింటిలోకి ఇవి కాస్త ఆరోగ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పెంపుడు శునకాల్లో వీటిదే అగ్రస్థానం. ముఖ్యంగా యుకె, యుఎస్, కెనడాల్లో వీటికి ఆదరణ ఎక్కువ. కుటుంబంలో ఎవరో ఒకరిని ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండటం వీటికి ఇష్టం. ఒంటరిగా ఉంటే కుంగిపోతాయి.

ఎస్.కె.కె. రవళి

దీనికి ‘కొమడో’ పేరు ఎలా వచ్చింది?

లిజార్డ్ (బల్లి) జాతికి చెందిన ఈ కొమడో డ్రాగన్‌లు భూమిపై ఉన్న అతి పాతకాలపు జీవులు. భూమి ఏర్పడిన తరువాత పుట్టిన ఈ జీవులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయినా వాటిని గురించి తొలిసారిగా తెలిసింది వందేళ్ల క్రితమే. అదీ ఓ విమాన ప్రమాదం కారణంగా వాటి సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. కొమడో అనేది ఓ దీవి. ఓ ఓసారి ప్రమాదానికి గురైన ఓ విమానం ఈ దీవిలో పడింది. అప్పుడు జరిగిన పరిశోధనలో వీటి సంగతి తెలిసింది. డ్రాగన్‌ల మాదిరిగా ఉండటం వల్ల, ఆ దీవిలో ఉండటం వల్ల వాటిని కొమడో డ్రాగన్‌లని పిలుస్తున్నారు. ఎర్రగా ఉండే వీటి లాలాజలం విషపూరితం. దాదాపు 50 రకాల బ్యాక్టీరియా వీటి లాలాజలంలో ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి

ఎర్ర జుత్తువాళ్లు ఎక్కడ ఎక్కువ?

ప్రపంచంలో అత్యధిక జనాభాకు నల్లని, లేదా గ్రేకలర్ జుత్తు కలిగి ఉంటారు. 12శాతం మంది జనాభా ఎర్రజుత్తుతో ఉంటారని తేలింది. అయితే వారిలో అత్యధికశాతం మంది స్కాట్లాండ్‌లో ఉంటారు. అంటే ఆ దేశంలో దాదాపుసగం మంది ఎర్రజుత్తు ఉన్నవారే. ఎర్రజుత్తు ఉన్నవారి కళ్లు గ్రే కలర్ ఉండటం మామూలు. అయితే నీలికళ్లు, ఎర్రజుత్తు ఉన్నవారికి ఎంతో విలువ ఉంటుంది. ఈ జుత్తు ఉన్నవారికి డి విటమిన్‌ను సొంతంగా తయారు చేసుకునే శక్తి ఉంటుంది. సాధారణంగా వీరిలో ఎక్కువమంది ఎడమచేతి వాటంతో ఉంటారు. కాకపోతే నల్లజుత్తు వారికన్నా వీరికి కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువట. స్కాట్లాండ్ తరువాత ఐర్లండ్‌లో ఈ ఎర్రజుత్తు వాళ్లు ఎక్కువట.

నిలబడి గమనించే మోనిటర్ లిజార్డ్స్

లిజార్డ్స్ జాతికే చెందిన జీవి మోనిటర్ లిజార్డ్. ఇవి కూడా కొమడో డ్రాగన్‌ల మాదిరిగా పెద్ద జీవులే. 10 నుంచి 122 అంగుళాల మేర ఇవి పెరుగుతాయి. పొడవైన మెడ, తోక వీటికి ఉంటాయి. వెనుక కాళ్లపై నిటారుగా నిలబడి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించడం వీటికి అలవాటు. అందువల్లే వీటిని మోనిటర్ లిజార్డ్స్ అని పిలుస్తారు. అతివేగంగా తిరగడం వీటికి తెలుసు. ఒకే ప్రాంతంలో జీవితాంతం ఉండటానికి ఇష్టపడటం వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి

వీటిని పెంచడం కష్టమే

నీలం, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో అందంగా కనిపించే ఈ చేపలు డ్రాగనెట్ కుటుంబానికి చెందినవి. సముద్రంలో అడుగున నేలపై నడుస్తూ, పగడపుదిబ్బల మాటన జీవిస్తూ ఆహారాన్ని అనే్వషిస్తాయి. ఇవి అందంగా ఉండటం వల్ల అక్వేరియంలలో పెంచేందుకు వ్యాపారులు వేటాడి పట్టుకుంటారు. కానీ వీటిని పెంచడం చాలా కష్టం. ఎందుకంటే సముద్రాల్లో స్వేచ్ఛగా, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లతో పెరిగే ఈ చేపలు అక్వేరియంలు, కృత్రిమ కేంద్రాల్లో జీవించడానికి ఇష్టపడవు. మనం పెట్టే ఆహారాన్ని అవి తినడానికి ససేమిరా అంటాయి. అందువల్ల ఆకలిదప్పులతో అవి మరణిస్తాయి. బతికున్న కొన్ని రకాల సముద్ర జీవుల్ని అవి తినడానికి ఇష్టపడతాయి. మనం వేసినా అవి ఇష్టపడవు.

ఈ నత్త విషానికి విరుగుడే లేదు

శంఖం ఆకారంలో షెల్‌లో (కోన్ స్నెయిల్స్) పెరిగే నత్తలు అత్యంత విషపూరితమైనవని అందరికీ తెలిసిందే. వాటిలో అన్నింటికన్నా జియోగ్రాఫిక్ కోన్ స్నెయిల్ అత్యంత విషపూరితమైనది. వీటిని సిగరెట్ స్నెయిల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి కాటువేసిన తరువాత బాధితుడు కేవలం సిగరెట్ కాల్చడానికి పట్టినంత సమయంలో ప్రాణాలు కోల్పోతాడు. అందుకనే వీటిని అలా పిలుస్తారు. ఈ భూమీద అత్యంత విషపూరితమైన జీవి ఇదే. వంద రకాల విషతుల్య రసాయనాల కలయికతో దీని విషం తయారవుతుంది. దీని నోటిప్కకనుంచి వచ్చే ఓ ప్రత్యేకమైన టెంటకిల్‌లా పెరిగే భాగంతో ఇది దాడి చేస్తుంది. దీని విషానికి ఇంతవరకు విరుగుడు కనిపెట్టలేకపోయారు.

- ఎస్.కె.కె. రవళి

స్టోన్‌ఫిష్ కాటేస్తే..

విషపూరితమైన జీవి స్టోన్ ఫిష్. రాయిమాదిరిగా కనిపించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. హిందూ పసిఫిక్ సముద్ర జలాల్లో ఇవి కనిపిస్తాయి. శరీరంపై ఉండే సూదుల్లాంటి పుల్లల దిగువ సంచుల్లో విషం నిల్వ ఉంటుంది. దీనిపై అడుగువేసినప్పుడు కలిగే ఒత్తిడిని బట్టి ఆ స్పైన్స్‌లోకి విషం వస్తుంది. కేవలం 0.15 సెకండ్లలో ఇది దాడి చేస్తుంది. కనురెప్ప పడి తెరిచేలోగా ఇది ఆహారాన్ని పట్టుకోవడం కాని, దాడి చేయడం గాని చేసేస్తుంది. దీనిమీద ఎంత ఎక్కువ వత్తిడి పడితే అంత ఎక్కువ విషం ఆ ముల్లుద్వారా శత్రువుశరీరంలోకి వెళుతుందన్నమాట. ఒకసారి ఆ ముల్లు దిగువ ఉన్న సంచీలోని విషం పూర్తయితే మళ్లీ రెండువారాల్లోగా ఉత్పత్తి అవుతుంది.

- ఎస్.కె.కె. రవళి

Pages