S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

08/07/2016 - 22:59

నువ్వంటే ప్రేమ నాకు
ఆత్మ ప్రతీ ఒక్కరి ప్రాణంలా...
సున్నితమైన హృదయాన్ని సురక్షిత స్థానంలో పదిలపరిచినట్టు!
శీతాకాలం మంచులో నువ్వొణుకుతుంటే
వేసవిలో నువ్వు మండుతుంటే
విలువైన రత్నాన్ని బంగారంలో పొదిగినట్టు
నిన్ను నా రెక్కల్లో దాచేసాను
అప్పుడెప్పుడో మనమెరుగని గత శతాబ్దాలలో
మా తాతల ముత్తాతలు
మీ ముత్తాతల తాతలనేమన్నారో గాని

08/07/2016 - 22:48

కడప రచన సాహిత్య వేదిక 1982 నుండి రాష్ట్ర స్థాయిలో బహూకరిస్తూ వస్తున్న మహాకవి గడియారం వేంకట శేషశాస్ర్తీ అవార్డు ఎంపికకై 2012 నుండి ప్రథమ ముద్రణ పొందిన పద్య కావ్యాలను ఆహ్వానించడమైనది. కావ్యం ఒకే కవికృతమై వుండాలి. ఖండ కావ్యాలు పంపవచ్చు. ఈ అవార్డు క్రింద ఎంపికైన కావ్యానికి రూ.5,000/- నగదు, అవార్డు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.

08/07/2016 - 22:47

చినుకు చిట్లింది
గజ్జెలు పగిలాయి
గాజుల గలగలా శబ్దం
పగిలింది చేతి గాజులు కాదు కదా!
కదలికా తన్మయత్వంలో
చేసిన సవ్వడి!!

ఆకలి మరిగిపోతోంది!
మనిషిలోని మనసు నీడలు
కరిగిపోతున్నాయి!

చెవులు చిల్లులు పడే ధ్వని నుండి
నిశ్శబ్దపు పాఠం చదువుకోవాలిప్పుడు!!

08/07/2016 - 22:45

అతిదూర విభిన్న కాలాలకు చెందిన ప్రక్రమాలు (processes) ఒకే కాలంలో కలిసి ఉండడం అనేది భారతదేశంలోనే జరుగుతుంది. మరెక్కడైనా జరుగుతుందో లేదో ఇప్పటికిప్పుడే తెలియదు. మన తెలుగు నేలలో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన రాకెట్ కేంద్రం ఉంది. ఇక్కడినుండి ఎన్నో ఉపగ్రహాలను సుదూర అంతరిక్షంలోనికి ప్రవేశపెడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి ప్రతినిధి.

08/07/2016 - 22:42

తెలుగువారికి చాలాకాలం నాడు ఒక మల్లినాథసూరి కాళిదాస కావ్యాలకు గొప్ప వ్యాఖ్యానాలు రాసి సంస్కృత సాహిత్య భిక్ష పెట్టినాడు. అటు తరువాత వేదాంత దేశికులు తమ సంస్కృత పాండితీప్రకర్ష చేత అనేక రచనలు చేస్తే అవన్నీ సంస్కృతంలో ఉండి కొందరికే తెలిసే స్థితి ఏర్పడింది. తమిళదేశం వారు వాటిని ఇంగ్లీషులోకి, తమిళంలోకి అనువదించుకున్నారు.

08/07/2016 - 22:39

ఆమె గొడుగు కోసుకురమ్మంది
అవును మరి
అది ప్రణయ రుతువులో విచ్చుకునే పువ్వు
పై చినుకులేవీ మీద పడకుండా
లోపల కురిసే చినుకుల్ని మాత్రమే
మనకు వినిపించే వేణువు

08/07/2016 - 22:38

కొందరు రచయితలు, పూర్తిగా ఉత్తరాలతోనే కథనంతటినీ నింపేస్తారు. కొందరయితే కేవలం సంభాషణల్లోనే కథనం అంతా నడుపుతారు. అలాగే కథంతా వర్ణనలతో నింపేసే రచయితలూ ఉన్నారు. ఏ పద్ధతిని అవలంబించినా, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే-కథ నడవాలి. పాత్రలను కాగితంమీద, చదువరని మన్ఫఃలకంమీద ముందుకు లాక్కుపోవాలి. ఇటుకలు పేర్చుకుంటూ, గోడను ఎత్తుకు లేపుకుపోయినట్టుగా కథ బలిష్టంగా పైకి ఎదగాలి.

07/31/2016 - 21:10

పూవు నేల రాలినప్పుడు
పరిమళం గాయపడటం చూశావా!

కాల్లో విరిగిన తుమ్మ ముల్లు
సలపరించడాన్ని భరించావా!

గాలి కూడా వౌనంగా
మనసుల్ని దాటిపోవడం విన్నావా!

కొడవలిని చూసి ఉలిక్కిపడ్డ
కంకి బెదురు చూపులు కన్నావా!

శిథిలమైన దుఃఖపు శిలాజాల
కాలాన్ని గుర్తించగలిగావా!

దిగులు బరువుతో
మనశ్శయ్య కుంగడం గమనించావా!

07/31/2016 - 21:08

‘రాజుల సొమ్ము రాళ్ళపాలు’ అని ఒక నానుడి. అక్షరాలలో చెక్కిన రాళ్ళలోనే ఆ రాజుల చరిత్ర దాగి ఉందని పరిశోధకుల భావన. ఆ అక్షర సంపదే తెలుగువారి చరిత్రకి దివిటీలుగా పనిచేస్తాయని నిరూపించినవాడు డా.పి.వి.పరబ్రహ్మశాస్ర్తీ.

07/31/2016 - 21:06

ఏదయినా సిద్ధాంత ప్రతిపాదన చేయదలచుకున్నప్పుడు ‘వ్యాసం’ వ్రాసుకోవడం మంచి పద్ధతి. అయితే ఏ సిద్ధాంతమూ కేవలం కొన్ని పొడిమాటలతో, కట్టుబా భావాలతో నిల్చిపోదు. సిద్ధాంతానికి ఒక ఆచరణ సూత్రం, అవలంబన పద్ధతి ఉంటుంది. అప్పుడు ‘కథ’ ముందుకు వస్తుంది. వ్యాస కథలకు, సాధారణ కథలకు ఉన్న వ్యత్యాసాలను కూడా గమనించడం అవసరం.

Pages