S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

09/04/2016 - 20:40

మూడేళ్లుగా ఒంటరితనం అలవాటైంది
ఎన్నడూ లేని కొత్త అనుభూతి పరిచయమైంది
పాతికేళ్లు నేను కోల్పోయిందేమిటో అర్థమైంది
సంధ్యారాగపు సాయం సమయాలు..
ఉషోదయంలో ఉషాకిరణాలు..
ఒంటరి నడకల సుదూర ప్రయాణాలు..
కొత్తగా అనిపించాయ్..
నాలో నేను మాట్లాడుకోవడం..
నాతో నేను పోట్లాడుకోవడం..
సరికొత్తగా కన్పించాయ్..
నాతో నేను గడిపిన సమయాలు..

08/28/2016 - 21:59

ఇంటి యజమాని ఆదుర్దాగా వున్నాడు.
వాకిట్లో పచార్లు చేస్తున్నాడు
ఇంటి కుడివైపు గోడమీద మర్రి చెట్టు మొలిచింది
ఆకుల చేతుల్ని అల్లల్లాడిస్తూ గాలికి విలాసంగా ఊగుతోంది
మర్రి మొక్కను పీకగూడదన్నారు
కనీసం విరవగూడదన్నారు
ఎందుకంటే అది ధర్మవిరుద్ధం గనుక!

08/28/2016 - 21:58

రాయలసీమ సమస్యలు, వెనుకబాటుతనంపై కవితలను ఆహ్వానిస్తున్నాం. సాహితీ స్రవంతి రాయలసీమ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ సంకలనానికి ఇరవై అయిదు పం క్తులు మించకుండా కవితలు రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. కవితలు సెప్టెంబర్ 25వ తేదీ 2016లోగా ఈ చిరునామాకు పంపగలరు
ఎస్.మస్తాన్‌వలి
సాహితీ స్రవంతి, 2/693
నాగరాజ్‌పేట్, కడప 516 001
చరవాణి: 9490099284
ఈ మెయిల్:

08/28/2016 - 21:57

మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మారక పురస్కారాలకు ఆహ్వానం
వజ్రాయుధ కవిగా ప్రసిద్ధుడైన మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మృత్యర్థం వారి పేర స్మారక పురస్కారాలను ఈ సంవత్సరంనుండి ఇవ్వదలచాము.
వివరాలు
ఉత్తమ కవితా సంపుటి
ఉత్తమ అనువాద కవితా సంపుటి/సంకలనం
ఉత్తమ కథా సంపుటి
ఉత్తమ అనువాద కథా సంపుటి/సంకలనం

08/28/2016 - 21:55

అభిరుచులకీ, అనుభవాలకీ, ఆలోచనల పదునుకూ, జ్ఞాన సంపదకీ, గవేషణకీ, అనే్వషణకీ, అన్నిటికీ చదువు అవసరం. ఏ ఒక్క చదువూ మనని పరిపూర్ణ మానవులుగా తయారుచెయ్యలేదు. చదువుల బడిలో చదువుకున్న చదువులో గేప్స్ (గ్యాప్స్) పూర్తిచేసే చదువు అవసరం. అలాంటి చదువులే పుస్తక సాహిత్యమూ, సాహిత్య పుస్తకాలూ, కథలు అందులో ఒక భాగం.

08/28/2016 - 21:54

వాళ్లు ఆంగ్లం అనర్గళంగా మాట్లాడతారు
వారి తెలుగు తెలుగులా ఉండదు
మా తెలుగు వారికి అర్థం కాదు
మా పిల్లలు కూడా
వారితో ఆంగ్లంలోనే మాట్లాడతారు
ఆంగ్లం నేర్చుకున్నా నేర్పుతున్నా
తెలుగులో మాట్లాడమంటాం మేం
వాళ్లు నవ్వేసి ఊరుకుంటారు

ఒక్కోమారు
ఆ పిల్లలు
అలా పోట్లాడుకోవద్దని
మేము వారితో
తెలుగులో నచ్చచెబుతాం

08/28/2016 - 21:52

కవిత్వం 2015
సంపాదకులు:
దర్భశయనం శ్రీనివాసాచార్య
ప్రచురణ: కవన కుటీరం
వరంగల్- తెలంగాణ
వెల:రూ.80/-
ప్రతులకు:
నవోదయ, విశాలాంధ్ర,
నవ చేతన బుక్‌హౌస్
***

08/28/2016 - 21:50

‘కథ’ అనేది ఎప్పుడు పుట్టింది. ఎలా పెరిగింది, ఏమేం ప్రయోజనాలు సాధించింది అనే విషయాలను గురించి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. కొత్త కొత్త విషయాలు బయలుపడుతున్నాయి. కథ అనేది ఆధునిక యుగంలో పత్రికల కోసం పుట్టిందనీ, అమెరికా బాగా ప్రాచుర్యం సంపాదించిందనీ ఎరుక. పుట్టటం మటుకు ఇంగ్లాండ్‌లోనే. అంతమాత్రంచేత వెనకటి రోజులలో- ప్రాచీన యుగాలలో కథ వేరు అని కొట్టిపారేయాలేము.

08/21/2016 - 21:11

కథలో మాధుర్యం ఎక్కడ వున్నదంటే- చదువరి కథ చదవటానికి ముందు అతని వైఖరి, కథ చదివేసిన తరువాత అతని వైఖరిని బేరీజు వేయడంలో వుంది. మధురమయిన కథ చదువరి మనస్సును ఆలోచనలను మార్చివేయాలి. అతని మనఃస్థితి కొత్త రూపు కట్టుకోవాలి. కథలో చదివిన సన్నివేశ ధోరణికి యిచ్చిన సమాధానం అతన్ని అక్కర పరిచేదిగా, అంతకుముందు ఊహించనిదిగా వుండాలి. కథ చివర మెలిక యివ్వడం కాదు యిది. కథను కొత్తగా అర్థం చేసుకోవటానికి దోహదపడడం.

08/21/2016 - 21:07

తెలుగు సాహిత్యంలో సంవాదాలు ఇప్పుడు పత్రికల నుంచి సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సాగుతున్నాయి.
వర్ధమాన రచయితల దగ్గరి నుంచి మహామహుల దాకా అందరికీ సామాజిక మాధ్యమం వేదికగా మారింది. సాహిత్య సృజన అనేక పుంతలు
తొక్కుతోంది. అలాంటి సృజనల్లో ఒక తురుపుముక్క ఇది. ప్రపంచ భాషలన్నింటిలోనూ తెలుగులో పదప్రయోగం ఎంత అద్భుతంగా ఉంటుందో..
ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయవచ్చనటానికి ఈ సంవాదం ఓ నిదర్శనం.

Pages