S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 23:57

కాకినాడ, సెప్టెంబర్ 26: జిల్లాలో అమలవుతున్న వివిధ పనుల పురోగతి విషయంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ హెచ్చరించారు. పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు.

09/26/2016 - 23:56

అమలాపురం, సెప్టెంబర్ 26: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి జెంటిల్‌మెన్ ఒప్పందం కుదిరింది. రెండేళ్లు చిక్కాల గణేష్‌కు, మిగిలిన కాలానికి మాజీ ఛైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు కుమారుడు యాళ్ళ నాగసతీష్ ఛైర్మన్ పదవి నిర్వహించేలా ఒప్పందం కుదిరింది.

09/26/2016 - 23:55

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 26: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పధకం ద్వారా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలుగ్రామాల్లో నూతనంగా సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని కాకినాడ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ తోట నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు.

09/26/2016 - 23:55

అడ్డతీగల, సెప్టెంబర్ 26: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నెలకొన్న అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలోని కొండవాగులు జలకళతో సందడి చేస్తున్నాయి. అడ్డతీగలలో మద్దిగెడ్డ జలాశయంలో నీరు సమృద్ధిగా చేరింది.

09/26/2016 - 23:54

కపిలేశ్వరపురం, సెప్టెంబర్ 26: నాయకత్వ లోపం వల్లే కాశ్మీర్ సమస్యగా మారిందని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) రాష్ట్ర మఠ మందిర్ విరామ ప్రముఖ్ ఈమని సువర్ణం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక అగస్థేశ్వర పాప వినాశేశ్వర స్వామివారి ఆలయంలో హింధూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

09/26/2016 - 23:54

రావులపాలెం, సెప్టెంబర్ 26: జిఒ 30 ప్రకారం ప్రస్తుతం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులు బిసిలుగానే చెల్లుబాటు అవుతున్నారని, వారిని బిసిలు కాదంటే హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లేనని కాపు జెఎసి నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపునేత ముద్రగడ పద్మనాభం పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదన్నారు.

09/26/2016 - 23:53

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: కొత్త మాస్టర్‌ప్లాన్ అమల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని పరిసర గ్రామాల విలీన ప్రక్రియ ఈవారంలోగా పూర్తవుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెల్లడించారు. ఈనెల చివరివారంలో జరిగే కౌన్సిల్‌లో ఈమేరకు తీర్మానం చేయనున్నట్లు సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ రాజమహేంద్రవరంగా అభివృద్ధి చేస్తామన్నారు.

09/26/2016 - 23:52

సామర్లకోట, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు పొందేలా చర్యలు తీసుకుందని టౌన్ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పిఎన్‌ఎస్ సాయిబాబు వెల్లడించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు.

09/26/2016 - 23:50

బాసర, సెప్టెంబర్ 26: బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువ మహారాష్టల్రో నాందేడ్ జిల్లాలోని విష్ణుపురి గ్వైక్‌వాడ్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతోపాటే మంజీర నది వివిధ ఉప నదుల నుండి వరదనీరు పోటెత్తడంతో బాసర వద్ద గోదావరి 1వ ఘాట్ నుండి 2వ ఘాట్ వరకు మెట్లు నదిలో మునిగాయి.

09/26/2016 - 23:50

చెన్నూర్, సెప్టెంబర్ 26: చెన్నూర్ మండలంలో సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ముందుగా చెన్నూర్ పంచక్రోశ ఉత్తరవాహిని గోదావరికి మంగళహారతి ఇచ్చి గోదారమ్మకు ప్రజాప్రతినిదులు మొక్కులు తీర్చుకున్నారు.

Pages