S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 00:58

న్యూయార్క్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎన్నడూ షరతులు పెట్టలేదని భారత్ ఐరాస వేదికపై సభ్య సమాజం ముందు కుండబద్ధలు కొట్టింది. కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని..దీన్ని చేజిక్కించుకోవాలన్న పాక్ కలలు కల్లలేనని విస్పష్టంగా తెలిపింది.

09/27/2016 - 00:47

కరీంనగర్, సెప్టెంబర్ 26: కరువుతో కునారిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వచ్చే రెండేళ్ళ వరకూ కరువు ఛాయలు కనిపించవని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. అతివృష్టితో ఖరీఫ్ పంటలు కొంతమేర దెబ్బతిన్నా, రబీలో మరింత బలమైన పంటలతో రైతులకు మేలు కలుగుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు.

09/27/2016 - 00:44

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 2118 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రక్రియ పూరె్తైందని, నియామకపు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. వీటితోపాటు మరి కొన్ని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నియామకాలు పూరె్తైతే ప్రభుత్వ వైద్య శాలల్లో సిబ్బంది కొరత తీరిపోతుందన్నారు.

09/27/2016 - 00:43

హైదరాబాద్, సెప్టెంబర్ 26: దేశవ్యాప్తంగా జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ తమ వల్ల కాదని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ)చేతులెత్తేసింది. యూనివర్శిటీలతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి, పిహెచ్‌డి అడ్మిషన్లలో ప్రాధాన్యతకు నెట్ అర్హత ఉపయోగపడుతుంది. ఇక మీదట ఆ బాధ్యతను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చూసుకోవాలని పేర్కొంది.

09/27/2016 - 00:41

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అసాధారణ వర్షాలతో రాజధానినే వరద కకావికలం చేయడంతో మున్సిపల్ మంత్రి కె తారక రామారావు చర్యలకు ఉపక్రమించారు. నీటి ప్రవాహ మార్గాల్లో అక్రమంగా వెలసిన కట్టడాలను తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలపై మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తం కావాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

09/27/2016 - 00:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ‘నీళ్లూ నెత్తురూ ఎన్నటికీ కలవవు. కలిసి ప్రవహించవు.’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్‌పై రక్తపాతానికి ఒడిగడుతున్న పాకిస్తాన్‌పై జలాయుధాన్ని ప్రయోగించేందుకు మోదీ యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందంపై సోమవారం మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం జరిగింది.

09/27/2016 - 00:33

భద్రాచలం/రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలం వద్ద నీటిమట్టం సోమవారం రాత్రి 27.2 అడుగులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

09/27/2016 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: పోలంవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొలి విడత రుణం ఇచ్చేందుకు నాబార్డ్ అంగీకరించింది. వచ్చే నెల 15నుంచి తొలి విడత రుణం విడుదల మొదలు కానుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం సుజనా చౌదరి అధ్వర్యంలో నాబార్డ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

09/27/2016 - 00:28

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ఆంధ్రప్రదేశ్‌లో 3 విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిం ది. తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్ర యం ఏర్పాటుకు ఏంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే నేతృత్వంలో గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సమావేశం జరిగింది.

09/27/2016 - 00:13

సీతంపేట, సెప్టెంబర్ 26: సీతంపేట మన్యంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సోమవారం కురిసిన వర్షంతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించాయి.

Pages