S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 00:12

శ్రీకాకుళం: జిల్లాలో కొంతమంది విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడటంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సొసైటీలో కాస్త హోదా ఉన్నవారు, సెలబ్రీటీల పిల్లలు ‘రేవ్’ పార్టీ అంటూ జిల్లా ముఖద్వారం వద్ద గల రూరల్ ఏరియాల్లో నిర్వహిస్తున్న మత్తులో జోగుతుంటారు. అయితే, అలాంటి రేవ్ పార్టీలో కొంతమంది సంపన్నులు డబ్బు కోసం నిర్వహిస్తూ యూత్ బలహీనతను క్యాష్ చేసుకుంటారు.

09/27/2016 - 00:10

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 26: విజ్ఞాన శాస్త్ర మూలల నుండి విద్యార్థులు ఆలోచించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. ప్రభుత్వ పురుషుల కళాశాలలో బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో మాలిక్యూలార్ బయాలజీలో శక్తిసామర్థ్యాల పెంపుపై ఐదు రోజులు ప్రాంతీయ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

09/27/2016 - 00:09

శ్రీకాకుళం, సెప్టెంబర్ 26: జిల్లా అంతటా హాల్‌చల్ చేసిన మహిళల నీలిచిత్రాలు కథ కటకటాల వెనక్కి చేరింది! నైపుణ్యంతో తీసి, నెట్‌లో పెట్టి, చివరికి కేబుల్ టీవీలో ప్రసారం చేస్తామంటూ బెదిరించి లక్షల రూ.లు కాజేసేందుకు పన్నాగం పన్నిన దొంగ స్క్రీన్‌ప్లే, దర్శకులు కటకటాల్లోకి పోలీసులు నెట్టేశారు. జిల్లాలో ఆమదాలవలస నీలిచిత్ర నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చెప్పారు.

09/27/2016 - 00:08

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 26: జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం వివిధ వృత్తిదారులు, ప్రైవేట్ ఉద్యోగుల ధర్నాలతో, నినాదాలతో దద్దరిల్లిపోయింది. జిల్లా గొర్రెలు, మేకలు పెంపకం దార్ల సంఘం ఆధ్వర్యంలో జీవో నెం. 559, 1016లు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. జెఎల్ గ్రూపులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని, వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

09/27/2016 - 00:07

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 26: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహించే ఈ వార్షిక కల్యాణ మహాత్సవాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. ఉషాపద్మినీ ఛాయా సమేత ఆదిత్యున్ని అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నేతృత్వంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య కొలువుదీర్చారు.

09/27/2016 - 00:06

బలగ, సెప్టెంబర్ 26: క్రీడలు జీవితంలో అంతర్భాగమని, క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు.

09/27/2016 - 00:06

సీతంపేట, సెప్టెంబర్ 26: నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసేదానికి కార్యకర్తలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని టిడిపి రాష్ట్ర పార్టీ కార్యదర్శి, పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడు యర్రా వేణుగోపాలరాయుడు చెప్పారు. మండలంలోని పెదరామ గ్రామంలో సోమవారం రుణమాఫీ పత్రాల పంపణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడారు.

09/27/2016 - 00:05

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 26: నెరవేరని హామీలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం ఎస్‌ఎం పురం గ్రామంలో గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

09/27/2016 - 00:05

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 26: పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఇవోఆర్డీ నిశ్చల ఆదేశించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పెద్దపాడు, వాకలవలస పంచాయతీ గ్రామాల్లో కాలువల్లో ఉన్న పూడికను తొలగిస్తున్నారు. ఈ పనులను సోమవారం ఈవోఆర్డీ నిశ్చల పెద్దపాడు గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

09/27/2016 - 00:04

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 26: హరికాథ కాలక్షేపం పూర్వనుంచి నేటి వరకు విజ్ఞాన దాయకమైన అంశమని డిఎం అండ్ హెచ్‌ఒ ఎస్.తిరుపతిరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో మిత్రా సాంస్కృతిక సమితీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆదిభట్ల నారాయణదాస్ 152వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన హరికథాసప్తాహం రెండో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

Pages