S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 23:44

కొత్తూరు, సెప్టెంబర్ 26: జాతీయ రహదారికి ఇరువైపుల రెండు లేదా మూడు వరసల్లో మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొత్తూరు మండలం తిమ్మాపూర్ రిసార్ట్‌లో హరితహరం కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

09/26/2016 - 23:44

షాద్‌నగర్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేందుకు షాద్‌నగర్ పురపాలక సంఘాన్ని అభివృద్ది చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఈడెన్ పంక్షన్ హాల్‌లో బహిరంగ మల విసర్జన రహిత పట్టణం ధృవపత్ర ప్రధాన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

09/26/2016 - 23:43

కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ సాధనే అఖిలపక్షం లక్ష్యమని, రెవెన్యూ డివిజన్ కోసం చేస్తున్న దీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గత 35 రోజులుగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు కడ్తాల, చారకొండలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలను కొనసాగిస్తున్నారు.

09/26/2016 - 23:43

ధరూరు, సెప్టెంబర్ 26: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉదృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.190 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,40,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను తెరిచి దిగువకు 1,42,857 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

09/26/2016 - 23:43

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 26: ప్రస్తుతం కురుస్తున్న వానలతో దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉన్నారని జెడిఎ శ్రీచరిత అన్నారు. సోమవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.

09/26/2016 - 23:42

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 26: బిజినేపల్లి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని వస్రూరాంనాయక్ తండాలో ఆదివారం రాత్రి నుంచి కలుషితమైన నీటితో అతిసార వ్యాది వ్యాపించింది.

09/26/2016 - 23:42

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ది నియంతృత్వ పాలన కొనసాగుతుందని అందులోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్క అధికారం లేకుండా చేశారని టిడిపి రాష్ట్ర నిర్వహక కార్యదర్శి, జడ్చర్ల టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆరోపించారు.

09/26/2016 - 23:40

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : జిల్లాల పునర్విభజనలోభాగంగా నారాయణరావుపేట గ్రామాన్ని మండలం చేయాలని డిమాండ్ చేస్తు గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి 6 గంటల పాటు హైడ్రామా సృష్టించారు. నారాయణరావు పేట గ్రామానికి చెందిన బామండ్ల కిషన్ (27) సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ..గ్రామాన్ని మండలం చేయకుంటే అక్కడ నుండి దూకుతానని బెదిరించి 6గంటల పాటు హైడ్రామాకు పాల్పడటం చర్చనీయంశంగా మారింది.

09/26/2016 - 23:40

సంగారెడ్డి, సెప్టెంబర్ 26: నాలుగు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్లాను నిలువునా ముంచాయి. ఎండిన జలాశయాలకు జలకళ వచ్చిందన్న సంతృప్తి మినహా కురిసిన వర్షాలతో అన్ని వర్గాల వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలకు వరదపోటును ఎదుర్కొన్నాయి.

09/26/2016 - 23:39

గజ్వేల్, సెప్టెంబర్ 26: జల వనరుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యపడుతుందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ పాండవుల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఅర్ ప్రత్యేక దృష్టి కారణంగా పాండవుల చెరువు మినీట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు.

Pages